
భర్త, పిల్లలతో కౌసర్ (ఫైల్)
సాక్షి, బెంగళూరు(మండ్య): పచ్చని సంసారంలో అక్రమ సంబంధం వ్యవహారం చిచ్చు పెట్టింది. భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటంతో భార్య తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి హత్య చేసుకుంది. ఈఘటన మండ్య జిల్లా మద్దూరులో జరిగింది. మద్దూరు పట్టణ పోలీసుల కథనం మేరకు హోళె వీధిలో అఖిల్ ఆహ్మద్, కౌసర్(30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు హ్యారిస్ అహ్మద్(8), కుమార్తెలు అలిసా(4), ఆనం ఫాతిమా(2) ఉన్నారు. ఉస్నాకౌసర్ స్థానిక ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తోంది.
అఖిల్ ఆహ్మద్ రామనగర జిల్లా చెన్నపట్టణలో కారు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అఖిల్ అహ్మద్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై కుటుంబలో గొడవలు జరిగాయి. పెద్దలు పంచాయితీ కూడా చేశారు. అయినా అతనిలో మార్పు రాలేదు. దీంతో గురువారం సాయంత్రం ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చింది. అనంతరం ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అఖిల్ అహ్మద్, అతని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: (అసభ్య చిత్రాలను వీడియోలుగా తీసి.. కోట్ల రూపాయల సంపాదన)
Comments
Please login to add a commentAdd a comment