ప్రతీకాత్మక చిత్రం
మండ్య: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కల్యాణమండపం యజమానికి, వధువు, వరుడి కుటుంబాలకు అధికారులు జరిమానా విధించారు. మండ్య నగరంలో శుక్రవారం ఒక కళ్యాణమండపంలో వివాహం జరిగింది. 500 మందికి మాత్రమే అనుమతి ఉండగా వెయ్యిమందికి పైగా ఉండటం, మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంపై సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ అధికారులు, తహసీల్దార్ చంద్రశేఖర్ శంగాలి, నగరసభ కమిషనర్ లోకేష్‌లు పోలీసులతో కలిసివెళ్లారు. కళ్యాణ మండపం యజమానికి రూ.12వేలు, వధువు, వరుడి కుటుంబాలకు రూ.2వేలు చొప్పున జరిమానా విధించారు.
మాస్క్ మరిచారు.. జరిమానా కట్టారు
బెంగళూరులో కరోనా మహమ్మారి ఎంతో మందిని బలిగొంటోంది. అయినప్పటికీ ప్రజలు మాస్కులు లేకుండా సంచరిస్తున్నారు. ఈ క్రమంలో బీబీఎంపీ మార్షల్స్ జరిమానాలు విధించారు.
Comments
Please login to add a commentAdd a comment