మండ్య : మండ్య నగరంలోని అంబేడ్కర్ భవనంలో విలేకరులకు నిర్వహిస్తున్న కరోనా వైద్య పరీక్షలను అడ్డుకోవడంతో పాటు విలేకరులపైన దాడి చేయడానికి ప్రయత్నం చేసిన ఎమ్మెల్సీ కుమారున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా లాఠీచార్జీ చేసి చెదరగొట్టాల్సి వచ్చింది. విలేకరులకు కోవిడ్ పరీక్షలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశం మేరకు శనివారం మండ్య నగరంలో జేడీఎస్ ఎమ్మెల్సీ శ్రీకంఠేగౌడ నివాసానికి దగ్గరిలోని అంబేద్కర్ భవనంలో వైద్య సిబ్బంది విలేకరులకు ఆరోగ్య పరీక్షలు చేయసాగారు. ఇంతలో ఎమ్మెల్సీ కొడుకు కృషిక్ గౌడ అక్కడి అనుచరులతో వచ్చి హల్‌చల్ ఆరంభించారు. ఇక్కడ కరోనా పరీక్షలు చేయరాదు, అందరూ వెళ్లిపోవాలని అని హెచ్చరించాడు. అతనికి సర్దిచెప్పడానికి వచ్చి విలేకరులను కొట్టడానికి యత్నించాడు. దీంతో పోలీసులు అతన్ని అక్కడి నుంచి తరలించి, అనుచరులపై లాఠీచార్జ్ చేశారు. కరోనా పరీక్షలకు అడ్డు తగిలారని ఎమ్మెల్సీ, అతని కొడుకు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment