బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకున్న తమకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందో లేదో తెలియదని, పార్టీపై నమ్మకంతో కాకుండా, జిల్లా ప్రజలు తోడుగా ఉంటారనే పోటీ చేయడానికి ధైర్యం చేసినట్లు నటి సుమలత అంబరీశ్ తెలిపారు. బుధవారం మండ్య తాలూకా బేవినహళ్లి గ్రామంలో ఎన్నికల్లో పోటీపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో సుమలత మాట్లాడారు. ఎన్నికల్లో తోడుగా ఉంటామని జిల్లా ప్రజలు ఇచ్చే హామీ మేరకే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అంబరీశ్‌కు అందించిన విధంగానే తమకు కూడా జిల్లా ప్రజలు సహకారం అందించాలని కోరారు. మండ్య నుంచి అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టమైన ప్రకటన విడుదలయ్యాక తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment