burnt alive case
-
Manipur Violence: మణిపూర్‌లో సజీవదహనమైన తల్లీకొడుకులు..
ఇంఫాల్: మణిపూర్‌లో తవ్వేకొద్దీ దారుణాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. మణిపూర్ హింసాకాండపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ చేతికి మొత్తం 20 కేసులను అప్పగించగా తాజాగా వారికి మరో సంచలనాత్మక కేసును అప్పగించారు మణిపూర్ పోలీసులు. ఆనాటి అల్లర్లలో బులెట్ గాయమైన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని ఆసుపత్రికి తీసుకెళ్తోన్న తల్లి, మేనత్తలను బిడ్డతో సహా సజీవ దహనం చేసిన ఈ సంఘటన అధికారులను సైతం కలచివేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 4న టాన్సింగ్(7) సహాయక శిబిరంలో ఉండగా మెయిటీ అల్లరి మూకలు జరిపిన కాల్పుల్లో ఒక బులెట్ అతడి తలలోకి దూసుకెళ్లింది. వెంటనే సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు అక్కడి ఎస్పీతో మాట్లాడి బాలుడి తోపాటు తల్లి, మేనత్తలను మాత్రమే వెంట ఆసుపత్రికి పంపాల్సిందిగా సూచించారు. ఎందుకంటే బాలుడి తండ్రి జాషువా హాంగ్సింగ్ కుకీ తెగకు చెందిన వారు కాగా తల్లి మీనా హాంగ్సింగ్ మాత్రం మెయిటీ తెగకు చెందింది. ఆమెనైతే మెయిటీలు ఏమీ చేయరన్న ఉద్దేశ్యంతో అలా చేసినట్టు ఆర్మీ అధికారి తెలిపారు. అధికారి చెప్పినట్టుగానే బాలుడిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు ఎస్పీ. అంబులెన్స్ కు తోడుగా ఇంఫాల్ వెస్ట్ సూపరింటెండెంట్ సహా పోలీసుల ఎస్కార్టును కూడా పంపించారు ఆర్మీ ప్రతినిధులు. సరిగ్గా ఇంఫాల్ సరిహద్దుకు చేరుకోగానే సుమారు 2000 మంది గుంపు చుట్టూ మూగడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. కొంచెం వెనక్కి తగ్గినట్టే తగ్గి అలరిమూక ఒక్కసారిగా దాడి చేసి అంబులెన్సుకు నిప్పు పెట్టేశారు. పోలీసులు చూస్తుండగానే అంబులెన్స్ మంటల్లో చిక్కుకోగా అందులోని బాలుడు, అతడి తల్లి, మేనత్త సజీవ దహనమయ్యారు. బాలుడి తండ్రి జాషువా హాంగ్సింగ్ కాంగ్పోక్పి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా.. లాంఫెల్ పోలీస్ స్టేషన్లో కూడా ఇదే కేసు నమోదైంది. దీంతో సీబీఐ ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించి రెండు కేసులు ఒక్కటేనని తేల్చి దర్యాప్తు చేసే పనిలో పడింది. మణిపూర్‌లో రెండున్నర నెలలుగా సాగుతున్న హింసాకాండలో ఇప్పటివరకు 160 మంది మృతి చెందగా అల్లర్ల సమయంలో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌పై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు -
పనికోసం నమ్మి వెళ్తే.. ‘బీమా’ ప్లాన్‌లో శవమయ్యాడు.. పాపం ఆ డ్రైవర్!
సాక్షి, మెదక్/హైదరాబాద్: మెదక్ కారు దహనం కేసులో అనూహ్య ట్విస్ట్ నెలకొన్న విషయం తెలిసిందే. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికే ఉన్నట్లు తేలింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నాటకం ఆడి సెక్రెటేరియేట్ ఉద్యోగి ధర్మా అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. అయితే ధర్మా ఆడిన నాటకంలో డ్రైవర్ బలి పశువుగా మారాడు. పనికి వెళ్తే నాలుగు పైసలు వస్తాయని ఆశించిన వ్యక్తి ఊహించని విధంగా విగతజీవిగా మారి ఈ లోకాన్నే విడిచి వెళ్లాడు. చనిపోయింది ఎవరు ? ధర్మానాయక్‌కు రెగ్యులర్ డ్రైవర్ లేడు. ఈ నెల 4న ధర్మా హైదరాబాద్‌లోని అడ్డాపై ఉన్న బిహార్‌కు చెందిన ఓ వ్యక్తిని రోజువారీ కిరాయి ఇస్తానని కారు డ్రైవర్‌గా పనిలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తెలిసిన వ్యక్తిని కారు డ్రైవర్‌గా పెట్టుకుంటే చంపడం కుదరదనుకుని ఇలా ప్లాన్ చేశాడు. 8వ తేదీన డ్రైవర్‌కు ఫుల్‌గా మద్యం తాగించిన తర్వాత గొడ్డలితో నరికిచంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆపై కారులో ఆ డ్రైవర్ మృతదేహాన్ని ఉంచి పెట్రోల్ పోసి తగులబెట్టినట్టు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఇదంతా చేశాడని, దీని కోసమే రెండు నెలల క్రితం సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశాడు. డ్రైవర్‌తో సహా కారును సజీవదహనం చేశాక ధర్మానాయక్ జరిగిన విషయాన్ని భార్యకు చెప్పిన తర్వాత సమీప అటవీ ప్రాంతం గుండా షాబాద్ తండాకు చేరుకున్నాడు. అక్కడి నుంచి మరో వాహనంలో పరారయ్యాడు. మృతుడి స్వస్థలం బీహార్‌గా భావిస్తున్నారు. నవీన్‌పేటలో స్కెచ్ ధర్మానాయక్ అక్క నిజామాబాద్ జిల్లాలోని నవీన్‌పేటలో ఉంటుంది. అక్క కొడుకుతో కలిసి ఇన్సూరెన్స్ డబ్బు కోసం పథకం వేసినట్టు ప్రచారం జరుగుతోంది. సహకరిస్తే పెళ్లికి సాయంతోపాటు, కొంతడబ్బు కూడా ముట్టజెప్పుతానని ఆశ చూపినట్టు సమాచారం. బెట్టింగ్‌లు ఆడి... ధర్మా కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్‌తోపాటు బెట్టింగ్‌లు ఆడి సుమారు రూ.2 కోట్ల వరకు పోగొట్టుకున్నట్లు తెలిసింది. దీంతో తెచ్చిన అప్పులను తీర్చే మార్గం కానరాక భారీ స్కెచ్ వేశాడు. తన పేరుపై ఉన్న 4 ఎల్ఐసీ పాలసీల క్లెయిమ్ విలువ రూ.7 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రమాదంలో చనిపోయింది ధర్మానే అనేవిధంగా నమ్మించి బీమా డబ్బులు పొందాలని చూశాడు. కాగా, ధర్మానాయక్ తమ అదుపులోనే ఉన్నాడని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని చెప్పారు. కారు దహన ఘటనపై విచారిస్తున్నామని, బుధవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. మండిపడుతున్న తండావాసులు డబ్బు కోసం ధర్మానాయక్ ఈ ఘటనకు ఒడిగట్టడంపై తండావాసులు మండిపడుతున్నారు. మంగళవారం మీడియా బృందం తండాకు చేరుకొని ధర్మానాయక్ భార్య నీల, ఇతర కుటుంబసభ్యు లతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే వా రు నోరు మెదపలేదు. మెదక్ డీఎస్పీ, అల్లాదుర్గం సీఐ, మెదక్ సీఐ, టేక్మాల్ పోలీసులు ఘటనా స్థలానికి ధర్మా నాయక్‌ను తీసుకొచ్చి వివరాలు సేకరించినట్టు సమాచారం. ధర్మానాయక్ కస్టడీలో ఉన్నా తమకేమీ సమాచారం లేదంటూ పోలీసులు సమాధానం ఇస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే ఈనెల 9న టేక్మాల్ మండలం వెంకటాపూర్ చెరువు కట్ట సమీపంలో కారులో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఆ కారు సెక్రెటేరియేట్లో పనిచేసే ధర్మనాయక్‌ది అని, చనిపోయిందని అతనేనని భావించారు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అనేక సందేహాలు రేకెత్తాయి. కారు దహనమైన చోట పెట్రోల్ బాటిల్ ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ధర్మానాయక్ కుటుంబసభ్యుల ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టడంతో కేసు మరో మలుపు తిరిగింది. డెత్ సర్టిఫికెట్ తీసుకోమంటూ ధర్మానాయక్ చేసిన మెసేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరపగా.. చనిపోయింది ధర్మానాయక్ కాదనే ఓ అంచనాకు వచ్చారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పూణే సమీపంలో ధర్మానాయక్ ఉన్నట్టు గుర్తించారు. మంగళవారం టేక్మాల్‌కు తీసుకొచ్చి పోలీసులు విచారించారు. ఆపై మెదక్‌కు తరలించారు. -
Medak: కారులో వ్యక్తి సజీవదహనం కేసులో ట్విస్ట్.. ఎంతకు తెగించాడు
సాక్షి, మెదక్: జిల్లాలోని టేక్మాల్ మండలం వెంకటపురంలో వ్యక్తి సజీవ దహనం చేసిన కేసులో ట్విస్ట్ నెలకొంది. సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మా నాయక్ తన డ్రైవర్‌ను హత్య చేసినట్లు తేలింది. ఇన్సూరెన్స్ డబ్ముల కోసమే ధర్మ ఈ నాటకం ఆడినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈనెల 9న కారులో ప్రమాదవశాత్తు చనిపోయినట్లు ధర్మా నాయక్ నాటకం ఆడాడు. ప్రమాద స్థలంలో పెట్రోల్ డబ్బా దొరకడంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. ధర్మ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా తను ఇంకా బతికే ఉన్నాడని భావించి ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. ధర్మ బతికే ఉన్నాడని.. గోవాలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు. తమదైన శైలిలో దర్మను విచారించగా విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయింది కారు డ్రైవర్ అని పోలీసులు గుర్తించారు అప్పులు చేసి బెట్టింగ్ ఆడిన ధర్మ.. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే అప్పులు తీర్చొచ్చని పన్నాగం పన్నాడు.భావించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అసలేం జరిగిందంటే.. టేక్మాల్ మండలం వెంకటపురం గ్రామానికి చెందిన ధర్మా నాయక్ రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనె 9న గ్రామ శివారులోని చెరువు కట్ట కింది భాగంలో దహనమైన కారులో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీ సులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న దుస్తులు, బ్యాగు ఆధారంగా మృతుడిని పాతు లోత్ ధర్మానాయక్‌గా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కారులో వ్యక్తి సజీవ దహనమైన చోట పెట్రోల్ బాటిల్ పడి ఉండటంతో ఎవరైనా కుట్రతో హత్య చేసి, కారులో పడేసి తగలబెట్టారా.. లేదా ఏదైనా ప్రమాదామా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చివరికి కారులోని మృతదేహం ధర్మాది కాదని అతని డ్రైవర్‌దిగా పోలీసులు గుర్తించారు. చదవండి: Alert: హైదరాబాద్‌కు వస్తున్న వారికి పోలీసుల కీలక సూచన -
మెదక్ జిల్లా : వ్యక్తి సజీవదహనం కేసులో పురోగతి
-
సజీవ దహనం కేసులో షాకింగ్ నిజాలు.. వివాహేతర సంబంధమే కారణం?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా వెంకటాపూర్‌లో ఆరుగురి సజీవదహనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసు వెనుక వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ఘటనలో మృతి చెందిన శాంతయ్య భార్య, బంధువులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే శాంతయ్య భార్యతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆస్తి, సింగరేణి వారసత్వ ఉద్యోగం కోసం ప్రియుడితో కలిసి భర్త శాంతయ్యను భార్య హత్య చేయించినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. నస్పూర్, వెంకటాపూర్‌లో స్థానికులు చెప్తున్న వివరాల మేరకు.. వెంకటాపూర్‌కు చెందిన మాసు శివయ్య ఆ గ్రామ వీఆర్ఏ, అతడి భార్య రాజ్యలక్ష్మి (పద్మ) గృహిణి. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. కుమారుడు సందీప్ నస్పూర్‌లో ఉంటున్నాడు. ఇక లక్సెట్టిపేట మండలం ఊత్కూరుకు చెందిన సింగరేణి కార్మికుడు శనిగరపు శాంతయ్య నస్పూర్‌లో నివాసం ఉంటూ ఆర్కే5 బొగ్గు గనిలో పనిచేస్తున్నాడు. వెంకటాపూర్‌కు సమీపంలోనే బొగ్గుగని ఉండగా.. కూలిపనులకు వెళ్లే క్రమంలో రాజ్యలక్ష్మి దంపతులకు శాంతయ్యతో పరిచయం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యం పెరిగి శాంతయ్య వారి ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టాడు. రాజ్యలక్ష్మితో శాంతయ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని అతడి భార్య సృజన పంచాయితీ పెట్టింది. శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆ కుటుంబాలకు పలుమార్లు కౌన్సెలింగ్ కూడా జరిగింది. డబ్బు రేపిన చిచ్చుతో.. శాంతయ్య–సృజన దంపతులకు ఒక కుమార్తు, ఇద్దరు కుమారులు ఉన్నారు. శాంతయ్య సింగరేణి ఉద్యోగి కావడంతోపాటు సొంతూరులో భూములు ఉన్నాయి. ఇటీవల కొంత భూమి విషయంలో వాటాగా రూ.12 లక్షలు వచ్చాయి. అందులో కుమార్తె పేరిట రూ. 5లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి, మిగతా సొమ్ము తన వద్దే పెట్టుకున్నాడు. తనకు, కుమారులకు డబ్బులు ఇవ్వకుండా.. రాజ్యలక్ష్మితో ఉంటూ వారికి డబ్బులు ఇస్తున్నాడని సృజన గొడవపడింది. దీనికితోడు నాలుగు నెలలుగా శాంతయ్య వెంకటాపూర్‌లోనే ఉండిపోవడం, డ్యూటీకి సరిగా వెళ్లకపోవడంతో కక్షపెంచుకున్నట్టు తెలిసింది. ఇదీ చదవండి: మంచిర్యాల ప్రమాదంపై షాకింగ్ నిజాలు.. కారణం అదేనా? -
వెంకటాపూర్ సజీవదహనం కేసును ఛేదించిన పోలీసులు
-
ఘోరం: డ్రైవర్ సజీవ దహనం
మండ్య(బెంగళూరు): జల్లిలోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ వంతెన పిల్లర్‌ను ఢీకొన్న ఘటనలో మంటలు ఏర్పడి డ్రైవర్ సజీవ దహనమైన ఘటన మండ్య జిల్లాలోని మద్దూరు పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో చోటుచేసుకుంది. మృతుడిని హాసన్ జిల్లాకు చెందిన దినేశ్ (44)గా గుర్తించారు. వివరాలు... రామనగర జిల్లా బిదడి కెంపెనహళ్లి నుంచి జల్లి లోడు తీసుకుని డ్రైవర్ దినేశ్ బయలుదేరాడు. ( చదవండి: విడాకులు తీసుకున్నారు.. మాట్లాడాలని భార్యని హోటల్‌కి పిలిచి.. ) గురువారం తెల్లవారుజామున టిప్పర్ లారీ అదుపుతప్పి నిర్మాణ దశలో ఉన్న వంతెన పిల్లర్‌ను ఢీకొంది. లారీ ఇంజిన్ నుంచి మంటలు లేచి అంటుకున్నాయి. డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
వనస్థలిపురం అగ్నిప్రమాదం కేసులో ట్విస్ట్
హైదరాబాద్: అనుమానాస్పదస్థితిలో మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైన వనస్థలిపురం ప్రభుత్వ ఉద్యోగి సరస్వతి కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని పోలీసులు నిర్థారణ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి సరస్వతి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆ సమయంలో కాపాడేందుకు యత్నించిన భర్త బాలకృష్ణకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త బాలకృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగిందని మొదట స్థానికులు భావించారు. కానీ భర్తే ఆమెను హత్యచేసి.. పెట్రోల్ పోసి నిప్పంటించాడని మృతురాలి బంధువులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈమేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని నిర్ధారించారు. చదవండి: వివాహిత సజీవ దహనం: హత్యా.. ప్రమాదమా? -
దిశ ఘటన దేశాన్ని కుదిపివేసినా..
అగర్తలా : దిశ హత్యాచార ఘటన దేశాన్ని కుదిపివేసినా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల ఉదంతాలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. త్రిపురలో 17 ఏళ్ల బాలికపై నెలన్నర పాటు లైంగిక దాడికి పాల్పడిన యువకుడు ఆమెను సజీవ దహనం చేసిన ఘటన వెలుగుచూసింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు అజయ్ రుద్ర పౌల్, అతని తల్లి అనిమ రుద్ర పౌల్ (59)లను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు కాలిన గాయాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు తెలిపారు. కాగా తమ కుమార్తెను అక్టోబర్ 28న ఖవోసి జిల్లా కల్యాణ్‌పూరిలోని తమ ఇంటి నుంచి అజయ్ కిడ్నాప్ చేశాడని, శాంతిర్ బజార్‌లోని తన ఇంటికి తీసుకువెళ్లాడని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశాడని పోలీసులు వెల్లడించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అజయ్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు రూ ఐదు లక్షలు కట్నం డిమాండ్ చేశాడని, కొంత మొత్తం సొమ్ము ముట్టడంతో డిసెంబర్ 11న ఆమెను వివాహం చేసుకునేందకు అజయ్ అంగీకరించాడని తెలిపారు. అయితే కట్నం విషయంలో అజయ్ తన తల్లితో వాగ్వాదం జరిగిన క్రమంలో బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని పోలీసులు వెల్లడించారు. బాలిక మృతితో ఆమె కుటుంబ సభ్యులు, స్ధానికులు అజయ్, అనిమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి నుంచి మరణ వాంగ్మూలం నమోదు చేసుకున్నామని, కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అజయ్ బంధువు ఒకరు బాధితురాలి కుటుంబ సభ్యులను వివాహం చేసుకోగా, అప్పటి నుంచి వారు ఒకరికి ఒకరు పరిచయమయ్యారని, సోషల్ మీడియా, ఫోన్ సంభాషణల ద్వారా దగ్గరయ్యారని స్ధానికులు చెప్పుకొచ్చారు. -
ఆరని మంటలు
లక్నో/న్యూఢిల్లీ: ‘దిశ’ ఘటనపై దేశవ్యాప్తంగా జనాగ్రహం వెల్లువెత్తుతున్నా నేరగాళ్ల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. కోర్టు కేసుకు హాజరయ్యేందుకు వెళ్తున్న అత్యాచార బాధితురాలిని సజీవంగా దహనం చేసేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఆమె మృత్యువుతో పోరాడుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగింది. రాయ్‌బరేలీ కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై గురువారం వేకువజామున దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అగ్నికీలలు దహించి వేస్తుండగానే రక్షించాలంటూ ఆమె దాదాపు కిలోమీటరు దూరం పరుగులు పెట్టారు. చివరకు బాధితురాలే 112 నంబర్‌కు పోలీసులకూ ఫోన్ చేసింది. ఆమె ఫోన్ చేసిన తర్వాతే అంబులెన్స్ ఘటనాస్థలానికి చేరుకొంది. 90 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను ప్రభుత్వం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి ఎయిర్ అంబులెన్స్‌లో తరలించింది. బాధితురాలి వాంగ్మూలం మేరకు పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు..ఏడాది క్రితం ఆమెను రేప్ చేసి, అరెస్టయి, ప్రస్తుతం బెయిల్‌పై వచ్చిన వ్యక్తి కావడం గమనార్హం. బాధితురాలి పరిస్థితి విషమం బాధితురాలిని మొదట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, తర్వాత జిల్లా ఆస్పత్రికి, ఉదయం పదింటికి లక్నో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ అశుతోష్ దుబే చెప్పారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం యూపీ ప్రభుత్వం ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీలోని సప్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించింది. ఆమెను సత్వరమే ఆస్పత్రిలో చేర్పించేందుకు వీలుగా అధికారులు లక్నో ఆస్పత్రి– అమౌసీ ఎయిర్‌పోర్టు, ఢిల్లీ ఎయిర్‌పోర్టు– సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి మార్గాల్లో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. గత ఏడాది డిసెంబర్లో తనపై జరిగిన అత్యాచారం కేసులో రాయ్‌బరేలీ కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగినట్లు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ దయాశంకర్ ఎదుట బాధితురాలు వాంగ్మూలమిచ్చారు. 4.30 గంటలపుడు తన ఇంటి దగ్గర్లోని గౌరా మలుపు వద్ద హరిశంకర్ త్రివేది, రామ్‌కిశోర్ త్రివేది, ఉమేష్ బాజ్‌పాయ్, శివం త్రివేది, శుభం త్రివేదిలు పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు పేర్కొన్నారు. వీరిలో శివం, శుభం 2018 డిసెంబర్లో తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె ఆరోపించగా ఈ ఏడాది మార్చిలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుల్లో ఒకరు పరారీలో ఉండగా మరొకరు నవంబర్ 25న బెయిల్‌పై బయటకు వచ్చారు. ఘటనాస్థలి వద్ద ఆధారాల సేకరణ ఖండించిన రాజ్యసభ ఉన్నావ్ రేప్ బాధితురాలిపై జరిగిన దాడి ఘటన రాజ్యసభలో దుమారం రేపింది. గురువారం రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో అరగంటపాటు వాయిదాపడింది. ఈ ఘటనను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య ఖండించారు. ‘యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నా. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా సరైన చర్యలుతీసుకోవాలి’ అని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతోన్న హింసకు సంబంధించిన వివరాలను అందించాల్సిందిగా జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ఈ ఘటనపై వెంటనే నివేదిక అందించాలని, బాధితురాలికి సరైన వైద్యం అందించాలని యూపీ సీఎం ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఉన్నావ్ బాధితురాలిపై హత్యాయత్నంపై 12వేల మంది ట్విట్టర్లో ఆగ్రహం వెలిబుచ్చారు. రేపిస్ట్లు బెయిలుపై దర్జాగా తిరగడాన్ని కొందరు తప్పుబట్టారు. ►యూపీలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని కేంద్ర హోంమంత్రి, యూపీ సీఎం నిన్న అబద్ధమాడారు. నిత్యం ఇలాంటి ఘటనలను చూస్తుండటం ఆగ్రహం తెప్పిస్తోంది. – ట్విట్టర్లో ప్రియాంకా గాంధీ -
వ్యక్తి సజీవ దహనం కేసులో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురంలో ఓ వ్యక్తి సజీవ దహనం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. గత నెల 26న వనస్థలిపురంలో గుడిసెకు నిప్పంటుకుని రమేష్ అనే యువకుడు మృతి చెందాడు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు భావించారు. కానీ విచారణలో మరో కోణం బయటపడింది. అతని భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యపేట జిల్లా కుమ్మరిగడ్డకు చెందిన కన్నెబోయిన రమేశ్ బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. మేస్త్రీ పని చేసుకుంటూ.. బీఎన్‌రెడ్డి నగర్‌లోని ఎస్కేడి నగర్‌లోని ఖాళీ స్థలంలో గుడిసె వేసుకొని భార్య స్పప్నతో కలిసి నివాసముంటున్నాడు. కాగా, స్పప్న.. వెంకటయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించి అతన్ని హతమార్చేందుకు కుట్ర పన్నింది. వ్యవసాయ పనుల కోసమని చెప్పి స్వగ్రామం వెళ్లిన స్వప్న.. సెప్టెంబర్ 26న ప్రియుడు వెంకటయ్యతో కలిసి నగరానికి వచ్చింది. అదే రోజు రాత్రి.. వనస్థలిపురంలోని గుడిసెపై పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యారు. ఈ ఘటనలో గుడిసెలో నిద్రిస్తున్న రమేశ్ సజీవ దహనమయ్యాడు. గుర్తుతెలియన వ్యక్తి సజీవదహనం అయ్యాడని సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది. స్పప్న, అతని ప్రియుడు వెంకటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్తతో కలిసి టిక్‌టాక్ చేసి.. హత్యకు ముందు స్వప్న తన భర్తతో కలిసి చేసిన టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల.. వైకుంఠపురములోని‘ రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో... ’ అనే పాటకు సంతోషంగా స్టెప్పులేశారు. అంతలోనే తాను ఎంతో ప్రేమించే భార్యే తన ప్రాణాలు తీస్తుందని ఊహించలేకపోయాడు. -
నిర్భయంగా తిరిగే రోజెప్పుడు వస్తుందో!
సాక్షి, చెన్నై : స్త్రీలు ఎక్కడైనా, ఎప్పుడైనా నిర్భయంగా తిరిగే రోజు ఎప్పుడొస్తుందో అని నటి కీర్తీసురేశ్ పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రియాంకరెడ్డిపై లైంగకదాడి, హత్య సంఘటనను అందరి మనసుల్ని కలచివేస్తోంది. ఒక్క తెలంగాణా ప్రజలే కాదు యావత్ భారత ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని నడిరోడ్డులో కాల్చి చంపాలని, అదే వారికి సరైన శిక్ష అని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. భాషా బేధం లేకుండా సినీ తారలు ప్రియాంకరెడ్డిపై జరిగిన అత్యాచారం, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. తమిళ సినీ పరిశ్రమలోనూ గాయనీ చిన్మయి లాంటి పలువురు ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నటుడు విజయ్ అభిమానులు ప్రియాంకరెడ్డిపై లైంగికదాడి, హత్య వ్యవహారంపై పోరాటానికి సిద్ధమయ్యారు. దారుణంగా హత్యకు గురైన ప్రియాంక కోసం ఉయ్ డిమాండ్ జస్టిస్ ఫర్ అవర్ సిస్టర్స్ అంటూ ఒక ట్యాగ్‌ను క్రియేట్ చేశారు. దీన్ని మన సిస్టర్స్‌కు అంకితం అంటూ పేర్కొన్నారు. ఈ ట్యాగ్‌లో ప్రియాంకరెడ్డి హత్య గురించి ప్రపంచానికి తెలిసేలా అందరూ తమ అభిప్రాయాలను పొందుపరచాలని కోరుతున్నారు. ఇప్పుడీ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. అదేవిధంగా యువ నటి కీర్తీసురేశ్ దారుణంగా అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంకరెడ్డి సంఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈమె తన ట్విట్టర్లో పేర్కొంటూ సురక్షిత నగరంగా భావించిన హైదరాబాద్ వంటి నగరాల్లో ఇలాంటి దుర్ఘటనలపై ఎవరిని తప్పు పట్టాలో నాకు తెలియడం లేదు. స్త్రీలు ఎలాంటి సమయాల్లోనూ నిర్భయంగా తిరిగే దేశంగా మన దేశం ఎప్పుడు మారుతుందో..ప్రియాంకను హతమార్చిన ఈ కిరాతకులను వేటాడి శిక్ష పడేలా చేయాలి. హత్యకు గురైన ప్రియాంక కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలుపుకుంటున్నాను. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవడానికి ఆ భగవంతుడు తగిన శక్తిని ఇవ్యాలి. నేరస్తులు శిక్షించబడాలి. నాకు కర్మ ఫలంపై నమ్మకం ఉంది. అది నిరంతరం పని చేస్తుంది అని కీర్తీసురేశ్ పేర్కొంది. చదవండి: ఆ మృగాలని చంపి నేను జైలుకెళ్తా: పూనంకౌర్ -
ఉలిక్కిపడ్డ నారాయణపేట
నారాయణపేట/మక్తల్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని హత్య చేసిన నిందితులు నారాయణపేట జిల్లా వాసులుగా తేలడంతో ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. మక్తల్ మండలం జక్లేర్, గుడిగండ్లకు చెందినవారే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని టీవీలు, సోషల్ మీడియాలో రావడంతో అక్కడి జనం విస్తుపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంట లకే మక్తల్ మండలం జక్లేర్, గుడిగండ్లకు వెళ్లిన షాద్‌నగర్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం విషయం తెలియడంతో నవీన్, చెన్నకేశవులు కుటుంబ స భ్యులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. గుడిగండ్లకి చెందిన నవీన్, చెన్నకేశవులు, శివ కలిసి తిరిగేవారు. నవీన్‌కుమార్ ద్విచక్రవాహనంపై డేంజర్ అనే సింబల్ ఉంటుంది. ఈ హత్య గురించి తెలియడంతో ‘ఆ డేంజర్ గాళ్లా.. ఈ పని చేసింది’ అని గ్రామంలో చర్చించుకుంటున్నారు. బంక్‌లో పనిచేస్తూ లారీ డ్రైవర్‌గా పాషా మక్తల్ మండలం జక్లేర్‌కు చెందిన హుస్సేన్, మౌలానీబీ దంపతుల కుమారుడు మహ్మద్ పాషా అలియాస్ ఆరిఫ్ పదో తరగతి వరకు చదివాడు. తొలుత పెట్రోల్ బంకులో పనిచేశాడు. తర్వాత హైదరాబాద్‌లో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస అయ్యాడు. ప్రియాంకను హత్య చేసిన తర్వాత గురువారం రాత్రి పాషా జక్లేర్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో షాద్‌నగర్ పోలీసులు వచ్చి పాషాను లేపి అదుపులోకి తీసుకున్నా రు. ఎందుకు తీసుకెళ్తున్నారని తల్లిదండ్రులు అడగడంతో.. ‘లారీకి యాక్సిడెంట్ జరిగింది.. అందుకే తీసుకెళ్తున్నారంటూ పాషానే చెప్పినట్టు అతడి తల్లిదండ్రులు తెలిపారు. మధ్యాహ్నం ప్రియాంకను మీ కుమారుడే హత్య చేశాడని గ్రామస్తులు చెప్పడంతో.. ‘మా వాడు మంచోడు.. ఎవరో ఇలా చేశారు’అంటూ విలపించారు. జులాయిగా నవీన్.. గుడిగండ్లకు చెందిన నవీన్ తండ్రి రెండేళ్ల క్రితమే చనిపోయాడు. అప్పటి నుంచి నవీన్ జులాయిగా తిరిగేవాడని గ్రామస్తులు తెలిపారు. నవీన్ తన బైక్‌ను స్పోర్ట్స్ బైక్‌లా మార్చుకోవడంతోపాటు హెడ్‌లైట్ తీసేసి ఆ ప్లేస్‌లో డేంజర్ అని బొమ్మ వేసుకున్నాడు. చెన్నకేశవులు, శివలతో కలిసి జులాయిగా తిరిగేవాడు. కుటుంబ పోషణ భారం కావడంతో పాషాతో కలిసి నవీన్ కూడా లారీ క్లీనర్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. ఈ పాడు పనేంటి చెన్నకేశవా? గుడిగండ్లకు చెందిన జయమ్మ, కుర్మయ్యల ఒకే ఒక్క కుమారుడు చెన్నకేశవులు. ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నవీన్‌తో పాటు చెన్నకేశవులు కూడా లారీ డ్రైవర్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం చెన్నకేశవులు భార్య గర్భిణి. పెళ్లయి ఇంట్లో భార్యను పెట్టుకుని ఈ పని చేశాడేంటి అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. జీతం తెస్తాడనుకుంటే జైలుకెళ్లాడు.. గుడిగండ్లకు చెందిన రాజప్ప, మణెమ్మ రెండో కుమారుడు శివ. నవీన్‌కుమార్, చెన్నకేశవులు, జక్లేర్‌కు చెందిన పాషాలు డ్రైవర్లు కావడంతో రెండు నెలల క్రితం వారి వద్ద క్లీనర్‌గా చేరాడు. కర్ణాటకలో గొర్రెల కాపరిగా పనిచేసే శివ తండ్రి ఈనెల 26న ఇంటికి వచ్చాడు. జీతం ఏమైందంటూ శివను అడగ్గా.. రెండు, మూడు రోజుల్లో తెస్తానని చెప్పి మంగళవారం బయలుదేరి వెళ్లాడు. తిరిగి గురువారం రాత్రి ఇంటికి వచ్చాడు. మావాడు జీతం తెచ్చి ఉంటాడని ఆ తల్లిదండ్రులు అనుకోగా.. తెల్లవారుజామున పోలీసులు వచ్చి తీసుకెళ్లడంతో హతాశులయ్యారు. -
అత్యంత అమానుషం
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో వరస దురంతాలు వెలుగు చూసి ఆర్నెల్లు కాలేదు. ఆ తర్వాత కూడా అడపా దడపా ఆడపిల్లలపై అఘాయిత్యాలు సాగుతూనే ఉన్నాయి. కానీ హైదరాబాద్ నగర శివారులో, రంగారెడ్డి జిల్లా తొండుపల్లి టోల్ ప్లాజాకు సమీపంలో బుధవారం రాత్రి పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డిని అపహరించి, సామూహిక అత్యాచారం చేసి, హతమార్చిన తీరు సమాజం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటనా స్థలి ఎక్కడో మారుమూల లేదు. అది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉంది. దానికి అత్యంత సమీపాన టోల్ ప్లాజా ఉంది. పక్కనే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ పోయే అతి పెద్ద జాతీయ రహదారి ఉంది. దానిపై నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. ఉన్నట్టుండి ఆచూకీ తెలియకుండా పోయిన కేసు కూడా కాదిది. తాను ఆపదలో చిక్కుకున్నానని ఆమె సకాలంలో గ్రహించింది. ఆ సంగతినే తన సోదరికి రాత్రి 9.22 నిమిషాలకు ఫోన్ చేసి చెప్పింది. హఠాత్తుగా ఆమె ఫోన్ స్విచాఫ్ కావడంతో కుటుం బసభ్యులు కూడా కీడు శంకించారు. రంగంలోకి దిగారు. కానీ ఇవేవీ ఆ నిస్సహాయురాలిని కాపాడ లేకపోయాయి. ఈ దారుణ ఉదంతం వెల్లడై 24 గంటలు గడవకముందే అదే శంషాబాద్ సమీపంలో శుక్రవారం మరో యువతిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ప్రియాంక హత్య అయినా, మరో మహిళ హత్య అయినా మన వ్యవస్థల పనితీరునూ, సమాజం పాటిస్తున్న విలువలనూ ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మన దేశంలో ఎన్నో కఠిన చట్టాలున్నాయి. దేశ రాజధాని నగరంలో 2012లో నిర్భయ ఉదంతం చోటుచేసుకున్నాక అత్యంత కఠినమైన చట్టం వచ్చింది. పోక్సో చట్టంలో ఉరిశిక్షతోసహా కఠిన శిక్షలు విధించడానికి వీలు కల్పించే సవరణ కూడా చేశారు. వీటితోపాటు తెలంగాణలో ఆడపిల్లల రక్షణ కోసం ‘షీ టీమ్’లు ఏర్పాటు చేశారు. ఆపత్స మయాల్లో ఫోన్ చేయడం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్లున్నాయి. తెలంగాణలో అయితే రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్ కనబడుతూనే ఉంటుంది. ఇన్ని చట్టాలున్నా, ఇన్ని రకాల జాగ్రత్తలు తీసు కుంటున్నా లైంగిక నేరాలు ఆగుతున్న దాఖలా లేదు. అవి నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. నేర గాళ్లు ఏ మాత్రం భయపడటం లేదు. గడప దాటి బయటికెళ్లే ఏ ఆడపిల్లకైనా ఈ దేశంలో వేధింపులు నిత్యానుభవం. అవి నగరాలా, పట్టణాలా, గ్రామాలా అన్న తేడా లేదు. వీధి చివరా, నడిరోడ్డుపైనా, నిర్మానుష్య ప్రదేశంలోనా అన్న తేడా లేదు. ఎక్కడైనా ఆడపిల్లలు భయపడుతూ బతుకీడ్వవలసిన పరిస్థితులే ఉంటున్నాయి. వెకిలిగా నవ్వడం, ఇష్టానుసారం కామెంట్ చేయడం, అసభ్యంగా తాకడం వంటి ఉదంతాలు కోకొల్లలు. అత్యంత అమానుషమైన ఘటనలు జరిగినప్పుడు మాత్రమే సమాజం మొత్తం కదిలిపోతుంది. వాటిపై వెనువెంటనే ప్రభుత్వాలు స్పందించడం మొదలెడతాయి. ఇప్పుడు ప్రియాంక విషాద ఉదంతమే తీసుకుంటే బుధవారం రాత్రి ఆమె కుటుంబం దాదాపు ఒంటరిగానే ఆరాటపడవలసి వచ్చింది. ఒక పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే మరో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లమని పంపించేశారని ప్రియాంక తండ్రి చెప్పారు. అక్కడ ఫిర్యాదు చేశాక కూడా పోలీసులు వెనువెంటనే కదలలేదంటున్నారు. తమ ఇంటి దీపం ఏమైందో తెలియక ఆత్రపడుతున్న ఆ కుటుంబానికి ‘లోకంలో మానవత్వం చచ్చిపోయిందా...’అని ఆ క్షణంలో అనిపించిందంటే అది పోలీసుల పనితీరుకు అద్దంపడుతుంది. బాధితుల పట్ల కనీస సహానుభూతి ప్రదర్శించలేని ఆ మనస్తత్వాలను సరిచేసేందుకు చర్యలు తీసుకోనంతకాలం ఈ స్థితి మారదు. పిల్లలు తప్పిపోయారని ఫిర్యాదు చేయడం కోసం వెళ్లేవాళ్లకూ, ముఖ్యంగా ఆడపిల్లల ఆచూకీ తెలియడం లేదని ఫిర్యాదు చేసేవారికీ పోలీస్స్టేషన్లలో ఎదురవుతున్న ప్రశ్నే ప్రియాంక కుటుంబసభ్యులకు కూడా ఎదురైంది. వారు పోలీసులను ఆశ్రయించినప్పుడు ‘ఏం జరిగిందో నిజాలు మాత్రమే చెప్పండి’ అనడం, ‘ఎవరితోనో వెళ్లివుంటుంది. రేపు వస్తది’ అని నిర్లక్ష్యంగా చెప్పడం బండబారుతున్న వ్యవస్థ తీరుకు నిదర్శనం. ‘వారు సకాలంలో స్పందించివుంటే మా అమ్మాయి మాకు దక్కేది’ అని రోదిస్తున్న ప్రియాంక కుటుంబసభ్యుల్ని ఓదార్చగలిగేది ఎవరు? నిజమే... చాలా తక్కువ వ్యవధిలోనే ప్రియాంక హంతకుల ఆచూకీని పోలీసులు రాబట్టగలిగారు. రాత్రికి రాత్రి దుండగుల్ని అదుపులోకి తీసుకున్నారు. పది టీంలు రంగంలోకి దిగి అణువణువూ గాలించాయి. స్వయానా సీనియర్ పోలీస్ ఉన్నతాధికారులు ఈ కేసుపై శ్రద్ధ పెట్టి పర్యవేక్షించారు. ఇవన్నీ పోలీసు వ్యవస్థ సామర్థ్యాన్ని వెల్లడి స్తాయి. అదే సమయంలో దాని బలహీనతల్ని కూడా పట్టిస్తాయి. ఉన్నత స్థాయిలో జోక్యం చేసు కుంటే తప్ప, ఉన్నతాధికార వర్గం ఉరకలెత్తిస్తే తప్ప సత్ఫలితాలు లభించవా అన్న సందేహం కలుగుతుంది. నేరం చోటుచేసుకున్న వెంటనే నేరగాళ్లను పట్టుకోవడంతోపాటు వారిపై వెంటవెంటనే సాక్ష్యా ధారాలు సేకరించి, సాధ్యమైనంత త్వరగా న్యాయస్థానాల్లో విచారణ మొదలయ్యేలా,అది త్వరగా పూర్తయి, శిక్షలుపడేలా చూసినప్పుడు మాత్రమే ఈ నేరాలు తగ్గుతాయి. అలాగే నేరాలు జరగడానికి ఆస్కారం ఉండే ప్రాంతాల్లో పకడ్బందీ గస్తీ నిరంతరాయంగా జరగాలి. ప్రియాంక విషాద ఉదంతం వెల్లడై 24 గంటలు గడవకుండానే... ఆ కేసు దర్యాప్తు కోసం ఆ ప్రాంతంలో పోలీసులు సంచరిస్తూనే వున్నా అక్కడికి సమీపంలో మరో యువతి హత్యకు గురైన తీరు చూశాక ఇది ఎంత అవసరమో అర్థమవుతుంది. దానికితోడు సమాజంలో, కుటుంబాల్లో ఉన్న లింగ వివక్ష, దానివల్ల కలుగుతున్న దుష్ఫలితాలపై పిల్లలకు అవగాహన కలిగించే పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలి. ఆడపిల్ల బలహీనురా లన్న భావన మృగాళ్లను తయారుచేస్తుంటే... ఆడపిల్లలను నిస్సహాయులుగా మారుస్తోంది. సామా జిక శాస్త్రవేత్తలు, మనస్తత్వ శాస్త్రవేత్తల సాయంతో ప్రభుత్వాలు బహుముఖ చర్యలు తీసుకున్నప్పుడే ఆడపిల్ల భద్రంగా ఉండగలుగుతుంది. -
ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు
సాక్షి, హైదరాబాద్: పశువైద్యురాలు ప్రియాంకారెడ్డి బుధవారం రాత్రి తొండుపల్లి ఓఆర్ఆర్ టోల్గేట్ వద్ద ఇరుక్కుపోయారు. తన స్కూటీ పంక్చర్ కావడంతో రోడ్డుపై ఒంటరిగా మిగిలారు. ఆ సమయంలోనో లేదా ఈ ప్రయాణం ప్రారంభించడానికి ముందో ఆమె పోలీసు అధికారిక యాప్ హాక్–ఐ లేదా పోలీసు కంట్రోల్ రూం నంబర్ 100ను సంప్రదించి ఉంటే హత్యకు గురయ్యేవారు కాదు. అయితే ఈ యాప్‌ను లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నా కేవలం వందల మందే వాడుతున్నారు. ‘హాక్–ఐ’లో ఉన్న ఎస్ఓఎస్లో ముందు రిజిస్టర్ చేసుకోవాలి. ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ‘ఎస్ఓఎస్’ను నొక్కితే పోలీసులు రంగంలోకి దిగి జీపీఎస్ ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. హాక్–ఐ మొబైల్ యాప్ ద్వారా ‘డయల్–100’కు సైతం ఫోన్ చేసే ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారులు, బాధితులు ఎవరైనా నేరుగా కాకపోయినా ఈ యాప్ ద్వారానైనా సంప్రదించే అవకాశం ఉంది. వేళకాని వేళల్లో లేదా ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం ‘హాక్–ఐ’లో ఏర్పాటు చేసిన విభాగమే ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్. ప్రయాణ ప్రారంభానికి ముందు యాప్‌లోని ఈ విభాగంలోకి ప్రవేశించి సదరు మహిళ/యువతి ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తున్నారో (డెస్టినేషన్) ఫీడ్ చేయాల్సి ఉంటుంది. వారు ఎక్కుతున్న బస్సు, ఆటో, క్యాబ్ నంబర్లను ఫొటో లేదా మ్యాన్యువల్‌గా నమోదు చేయాలి. జీపీఎస్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ యాప్ ద్వారా ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి అది పూర్తయ్యే వరకు కమిషనరేట్‌లోని ఐటీ సెల్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. నిర్దేశించిన డెస్టినేషన్ కాకుండా సదరు వాహనం వేరే మార్గంలో ప్రయాణిస్తే పోలీసులే గుర్తించి ప్రయాణికురాలిని సంప్రదిస్తారు. అటు వైపు నుంచి స్పందన లేకుంటే అప్రమత్తం కావాలని భావించి వెంటనే రంగంలోకి దిగుతారు. మార్గమధ్యంలో ఏదైనా ఇబ్బంది ఎదురైనా క్షణాల్లో ఫిర్యాదు చేసేందుకు ఓ బటన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికురాలు సురక్షితంగా గమ్యం చేరి సమాచారం ఇచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతుంది. ఈ మధ్యలో ఎప్పుడు అవసరమైనా నిమిషాల్లో పోలీసులు చేరుకుంటారు. ఈ యాప్‌తోపాటు డయల్ ‘100’, వాట్సాప్ (హైదరాబాద్: 9490616555, సైబరా బాద్: 9490617444) రాచకొండ: 9490617111) ద్వారానూ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా పొందవచ్చు. నిరంతర పర్యవేక్షణ... పోలీసులకు సంబంధించిన అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులు, సలహాలు, సూచనల్ని నిరంతరం పర్యవేక్షి స్తుంటాం. మహిళల కోసం ఏర్పాటు చేసి న విభాగాలను ఐటీ సెల్లో ఉండే సిబ్బంది 24 గంటలూ గమనిస్తూ అందుబాటులో ఉంటా రు. ఈ యాప్ తెలంగాణవ్యాప్తంగా సేవలు అందిస్తోంది. – ఐటీ సెల్ అధికారులు -
నమ్మించి చంపేశారు!
శంషాబాద్, షాద్‌నగర్ టౌన్, షాద్‌నగర్ రూరల్: స్కూటీ టైర్ పంక్చర్ అతికిస్తామంటూ నమ్మించి ఓ యువతిని హత్య చేసి, ఆ తర్వాత పెట్రోల్ పోసి తగులబెట్టిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో అదృశ్యమై షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద శవమై కనిపించింది. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లికి చెందిన శ్రీధర్‌రెడ్డి, విజయమ్మకు ఇద్దరు కూతుళ్లు. శ్రీధర్‌రెడ్డి పీఏసీఎస్ సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద కూతురు ప్రియాంకారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కొల్లూరులోని ప్రభుత్వ పశు వైద్యశాలలో వైద్యురాలిగా పనిచేస్తోంది. రెండో కూతురు భవ్య శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగి. వీరి కుటుంబం నాలుగేళ్లుగా శంషాబాద్‌లో నివాసముంటోంది. బుధవారం కొల్లూరులో విధులు ముగించుకున్న ప్రియాంక.. సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చింది. ముఖంపై ఏర్పడిన మచ్చలకు చికిత్స కోసం ఇంటి నుంచి స్కూటీపై సాయంత్రం 6 గంటలకు బయల్దేరింది. స్కూటీని తొండుపల్లి వద్ద ఉన్న టోల్ ప్లాజాకు కొద్ది దూరంలో ఆపి అక్కడి నుంచి మరో వాహనంలో గచ్చిబౌలిలోని ఓ క్లినిక్‌కు వెళ్లింది. తిరిగి రాత్రి 9 గంటల సమయంలో టోల్‌ప్లాజా వద్దకు చేరుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధపడింది. అయితే స్కూటీ పంక్చర్ అయినట్లు గుర్తించింది. పంక్చర్ వేయిస్తామంటూ.. స్కూటీ పంక్చర్ అతికించి ఇస్తామంటూ అక్కడే ఉన్న ఓ 20 ఏళ్ల గుర్తు తెలియని యువకుడు ప్రియాంక స్కూటీ తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి.. పంక్చర్ అతికించేవారు లేరని, మరో చోటుకు తీసుకెళ్తానని ప్రియాంకకు చెప్పాడు. అందుకు ఆమె అడ్డుచెబుతూ.. ముందుకు వెళ్లి తానే ఎక్కడైనా పంక్చర్ అతికించుకుంటానని చెప్పినా ఆ వ్యక్తి వినకుండా మధ్యలోనే స్కూటీ ఆగిపోతుందని చెప్పి పంక్చర్ అతికించేందుకు మరో చోటుకు తీసుకెళ్లాడు. భయమేస్తుందంటూ చెల్లికి ఫోన్.. ‘స్కూటీ పంక్చర్ అయ్యింది.. బాగుచేసుకొస్తానని ఓ వ్యక్తి తీసుకెళ్లాడు. పక్కన లారీలో ఎవరో ఉన్నారు. నాకు భయంగా ఉంది’అంటూ ప్రియాంక తన చెల్లెలికి రాత్రి 9.22 గంటల సమయంలో ఫోన్ చేసి చెప్పింది. చుట్టూ లారీ డ్రైవర్లు ఉన్నారని, వారిని చూస్తే భయమేస్తోందని, అంతా తననే చూస్తున్నారంటూ వివరించింది. ఒంటరిగా ఉన్నానని, కొద్దిసేపు మాట్లాడాలంటూ సోదరిని కోరింది. ఇలా సుమారు 6 నిమిషాల పాటు ప్రియాంక తన చెల్లెలితో ఫోన్లో సంభాషించింది. ఆ తర్వాత ప్రియాంక ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. చదవండి: ప్రియాంక హత్య కేసు; నిందితుల్లో ఒకడిది లవ్‌మ్యారేజ్ లారీని అడ్డుపెట్టి అత్యాచారం చేసి... హతమార్చారు నా బిడ్డలానే ప్రియాంకా బలైంది: నిర్భయ తల్లి నా కొడుకు అలాంటివాడు కాదు: పాషా తల్లి వీడిన ప్రియాంక మర్డర్ మిస్టరీ.. రాత్రంతా.. ప్రియాంకా రెడ్డి హత్య కేసులో పురోగతి ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! సంఘటన స్థలంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు చటాన్‌పల్లిలో శవమై.. గురువారం తెల్లవారుజామున షాద్‌నగర్ శివారులోని చటాన్‌పల్లి వద్ద మంటలను చూసిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి, కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే బుధవారం రాత్రి చెల్లెలితో మాట్లాడే సమయంలో ప్రియాంక ఫోన్ స్విచ్ఛాఫ్ అయిన తర్వాత రాత్రి 11 గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ప్రియాంక అదృశ్యం కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం షాద్‌నగర్‌లో మహిళ హత్య జరిగిన సంఘటన వెలుగుచూడటంతో పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టని స్థితిలో ఉన్న ప్రియాంక మెడలో ఉన్న బంగారు లాకెట్ ఆధారంగా ఆమెను పోలీసులుగుర్తుపట్టారు. ఎన్నో అనుమానాలు.. ప్రియాంకను వేరే ప్రాంతంలో హత్య చేసి చటాన్‌పల్లి వద్దకు తీసుకొచ్చారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద ఉన్న లారీ డ్రైవర్లు ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారా.. ఆమె ప్రతిఘటించడంతోనే హత్య చేసి నిప్పంటించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం రాత్రి సుమారు 9.30 సమయంలో ప్రియాంకరెడ్డి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. ఆ తర్వాతే ఆమెను దుండగులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే దుండగులు ప్రియాంకరెడ్డిని ఏడు గంటల పాటు తమ వద్ద ఉంచుకొని ఆ తర్వాత దారుణానికి ఒడిగటినట్లు తెలుస్తోంది. ప్రియాంకరెడ్డి కిడ్నాప్ అయిన ప్రాంతానికి, ఆమె మృతదేహం ఉన్న ప్రాంతానికి మధ్య సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రియాంకరెడ్డిని బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కిడ్నాప్ చేసిన దుండగులు గురువారం తెల్లవారుజామున 4 గంటల వరకు ఎక్కడికి తీసుకెళ్లి ఉంటారన్నది తెలియాల్సి ఉంది. కాగా, ప్రియాంక మృతదేహానికి వైద్యులు ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. కదలికలను గమనించిన వారే.. ప్రియాంకరెడ్డి తరచూ గచ్చిబౌలికి వెళ్లి వచ్చే సమయంలో టోల్గేట్ బూత్ సమీపంలోనే స్కూటీ నిలిపేది. బుధవారం సాయంత్రం మాత్రం టోల్గేట్ సిబ్బంది అక్కడ స్కూటీ పెట్టొద్దనడంతో పక్కనే ఉన్న ఔటర్ సర్వీసు రోడ్డు సమీపంలో పెట్టి వెళ్లింది. రోజూ ఆమె కదలికలను గమనిస్తున్న వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా.. లేదా లారీల డ్రైవర్లు పథకం ప్రకారమే ఇలా చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వీసు రహదారి వైపు సీసీ కెమెరాలు లేకపోవడంతో అక్కడ లారీ పార్కింగ్ చేసిన వారు ఎవరై ఉంటారనేది తెలియలేదు. ప్రియాంక అత్యాచారానికి గురైందని అనుమానిస్తున్న స్థలం టోల్‌ప్లాజాకు 60 మీటర్ల దూరంలో ఉంది. రాళ్లగూడ వైపు వెళ్లే సర్వీసు రహదారికి అరవై మీటర్ల దూరంలోనే ప్రహరీ ఉన్న అర ఎకరం స్థలంలోని ఓ ప్రహరీలో ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. చెల్లి మాట విని ఉంటే.. తన చెల్లెలు ఫోన్లో చెప్పినట్లు ప్రియాంక విని ఉంటే ప్రాణాలు దక్కేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద నిలబడి ఉంటే ఈ దారుణం జరిగి ఉండకపోవచ్చని చెబుతున్నారు. వాహనాలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో ఉంటే బాగుండేదని పోలీసులు కూడా పేర్కొంటున్నారు. స్కూటీ గుర్తింపు.. ప్రియాంకరెడ్డి స్కూటీని పోలీసులు షాద్‌నగర్ సమీపంలోని కొత్తూరులో గురువారం రాత్రి గుర్తించారు. అయితే దుండగులు స్కూటీ నంబర్ ప్లేటు తీసేసి దర్గా రోడ్డులో నాట్కో పరిశ్రమ సమీపంలో వదిలి వెళ్లారు. అయితే హత్య జరగడానికి ముందే ఇక్కడ వాహనాన్ని వదిలి వెళ్లారా లేదా ముందుగానే వదిలి వెళ్లారా అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు? ప్రియాంకను హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీలోని అనంతపురానికి చెందిన లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించట్లేదు. ప్రియాంక తన చెల్లితో మాట్లాడిన సమయంలో ఆ ప్రాంతంలోని ఫోన్ సిగ్నల్స్‌ను పోలీసులు ట్రేస్ చేశారని, ఆ సమయంలో వీరిద్దరి ఫోన్ కాల్స్ గుర్తించినట్లు, వారి కాల్‌డేటా ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు సమాచారం. ఇరవై ఏళ్ల యువకుడు వచ్చాడు.. జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వేసుకున్న 20 ఏళ్ల యువకుడు ఎర్రరంగు స్కూటీ తీసుకుని ఇక్కడికి వచ్చాడు. బండి పంక్చర్ అయిందని చెప్పాడు. కానీ బండిలో గాలి మాత్రమే నింపించుకున్నడు. తిరిగి శంషాబాద్ వైపే తీసుకెళ్లాడు. అతడితో పాటు ఎవరూ కనిపించలేదు. – శంషీర్, బండిలో గాలి నింపిన వ్యక్తి మంటల్లో కాలిపోతుంటే చూశా.. ఉదయం 5 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్తున్నా. ఆ సమయంలో మార్గమధ్యలో ఉన్న జాతీయ రహదారి బ్రిడ్జి కింద మంట మండుతున్న విషయాన్ని గమనించాను. పొలానికి వెళ్లి తిరిగి 6 గంటలకు వస్తున్నా. బ్రిడ్జి కింద మంటల్లో ఓ మనిషి కాలుపోతున్న విషయాన్ని గుర్తించాను. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాను. – సత్యం, లింగారెడ్డిగూడ, షాద్‌నగర్ లారీ డ్రైవర్లే హతమార్చారు లారీ డ్రైవర్లు అందరూ తననే చూస్తున్నారని, భయంగా ఉందంటూ చెల్లెలికి ఫోన్లో చెప్పింది. కొద్ది సేపటి తర్వాత ప్రియాంకా ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. నా కూతురిని లారీ డ్రైవర్లే హత మార్చి ఉంటారు. – శ్రీధర్‌రెడ్డి, మృతురాలి తండ్రి ప్రియాంకారెడ్డి హత్యకు ముందు.. ► మధ్యాహ్నం 2 గంటల తర్వాత కొల్లూరు నుంచి శంషాబాద్‌కు వచ్చింది. ► సాయంత్రం 4 గంటలకు శంషాబాద్‌లోని ఇంటికి చేరుకుంది. ► సాయంత్రం 5.45 గంటలకు ఇంటి నుంచి గచ్చిబౌలికి వెళ్లడానికి స్కూటీపై బయల్దేరింది. ► సాయంత్రం 6 గంటలకు తొండుపల్లి టోల్‌ప్లాజా సమీపంలో స్కూటీ నిలిపి గచ్చిబౌలి హాస్పిటల్‌కు వెళ్లింది. ► రాత్రి 9.10 గంటల సమయంలో క్యాబ్‌లో తిరిగి తొండుపల్లి టోల్‌ప్లాజా వద్దకు చేరుకుంది. ► 9.15 గంటల సమయంలో స్కూటీ తీస్తుండగా పంక్చర్ అయిందని గుర్తు తెలియని వ్యక్తులు బండి తీసుకెళ్లారు. ► 9.22 గంటల సమయంలో బైక్ తీసుకెళ్లిన వారి గురించి వారి చెల్లెలితో మాట్లాడింది. ► 9.30 గంటల తర్వాత ప్రియాంక ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. ► 9.30 నుంచి 10 గంటల సమయంలోనే ఆమె అత్యాచారానికి గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చెల్లితో ప్రియాంక సంభాషణ.. ప్రియాంక: పోయావా ఆఫీసుకి.. చెల్లి: వెళ్లాను.. ప్రియాంక: సరే నాది ఇప్పుడు అయిపోయింది. వచ్చిన ఇప్పుడే. కొద్దిసేపు నాతో మాట్లాడు.. చెల్లి: ఎందుకు ఏమైంది.. ప్రియాంక: మాట్లాడు.. కొంచెం సేపు మాట్లాడు నీకు తర్వాత చెప్తా. చెల్లి: ఏమైంది అక్కడేమైనా యాక్సిడెంట్ అయ్యిందా.. గచ్చిబౌలిలో యాక్సిడెంట్ అయ్యిందా. ప్రియాంక: అర్థం కాలేదు చెల్లి: యాక్సిడెంట్ అయ్యిందా ప్రియాంక: లేదు నాకు చాలా టెన్షన్‌గా ఉంది. ప్రియాంక: అక్కడ టోల్ గేటు దగ్గర బైక్ పెడత కదా.. అక్కడ పెట్టకూడదు పోలీసులు తీసుకుపోతున్నరని టోల్‌గేటు ఆయన చెప్పిండు.. ఇక్కడ ఔటర్ రింగుకు ఇంకో దారిలో పెట్టా.. ఇప్పుడే వచ్చాను స్కూటీ పంక్చర్ అయింది. చెల్లి: సరే వదిలేసి రా.. ఇంకేంటి ప్రియాంక: వదిలేస్తే రేపు పొద్దున ఎవరు తీసుకొస్తరే.. చెల్లి: మెకానిక్‌ను తీసుకెళ్లి తేవాలి. ప్రియాంక: మెకానిక్‌నా.. కొంచెం దూరం కూడా పోదానే.. పంక్చరైంది వెనుక టైరు. చెల్లి: ఏమో నాకు తెలీదే. ప్రియాంక: అయితే, చెప్తా విను.. ఇక్కడ ఓ లారీ ఉందే.. అందులో జనాలున్నరు. అందులో ఒకాయన చేపిచ్చుకొస్తా అని తీసుకెళ్లిండు. చెల్లి: తీసుకురాలేదా.. ప్రియాంక: తీసుకొచ్చిండు.. అది క్లోజ్ ఉంది. మళ్లీ ఇంకోషాప్లో చేసుకొస్తానని చెప్పి తీసుకు పోయిండు. నాకు భయమైతుంది పాపా.. చెల్లి: అక్కడ ఎవరు లేరా.. ప్రియాంక: వెహికిల్స్ ఉంటవి చూడు అక్కడ.. టోల్ అది ఉంటది చూడు.. నేను పోతా అంటే వాళ్లు వద్దు ఉండు అని అంటున్నా దయ్యాల్లాగా నిలబడిన్రు. చెల్లి: టోల్‌గేటు ఉంటది కదా అక్కడికి వెళ్లి నిలబడు. ప్రియాంక: మాట్లాడు నాకు భయమైతుంది. చెల్లి: టోల్‌గేటు కాడికి వెళ్లు. ప్రియాంక: వాళ్లు బయటనే ఉన్నరు. చెల్లి: ఎవరు ప్రియాంక: లారీస్ వాళ్లు ప్రియాంక: వీళ్లేందే సడన్‌గా ఎవరూ కనిపించకుండా పోయిన్రు. లేదు.. ఉన్నరు. నేను బండి స్టార్ట్ చేసి పోతుంటే పంక్చర్ అయింది.. తగిలిన్రు. బస్టాండ్‌లో చేపిచ్చుకుంటా అంటే వినకుండా.. మేడం చేపిచ్చుకొస్తమని వెంటబడిన్రు. దయ్యాల్లాగా.. చెల్లి: టోల్‌గేటు వద్దకు వెళ్లు. ప్రియాంక: అక్కడ నిలబడితే అందరు చూసుకుంట పోతరు.. వచ్చేటోళ్లు.. పోయేటోళ్లు.. చెల్లి: చూడనీ.. అయితే ఏమైతది ప్రియాంక: కొంచెంసేపు మాట్లాడు.. భయమైతుంది.. బైకు వచ్చేవరకు అయిదు నిమిషాలు. చెల్లి: ఇంత లేటుగా పోవడం అవసరమా..రేపు పోకూడదా.. ప్రియాంక: లేటు కాదే తల్లి.. ఓ పనైపోయింది. రేపు మీటింగు ఉందన్నరు.. సండే.. మండే టెంపుల్‌కు తీసుకుపోతున్నరు. అసలు టైమే ఉండటం లేదు. చెల్లి: సరే కొద్దిసేపైన తర్వాత మాట్లాడుతా.. ప్రియాంకారెడ్డి బైక్ పార్క్ చేసిన ఔటర్ రింగురోడ్డులోని తొండుపల్లి టోల్‌ప్లాజా ఇదే.. -
భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు
సాక్షి, హైదరాబాద్: ‘భయమవుతోంది పాప నాకు. ప్లీజ్ కొంచెం సేపు మాట్లాడు’ అంటూ ప్రియాంకారెడ్డి ఫోన్లో చివరిసారిగా తన సోదరితో మాట్లాడింది. వాళ్లను చూస్తుంటే భయమవుతోందని, ఏడుపు వస్తోందని తన చెల్లి భవ్యారెడ్డితో దీనంగా చెప్పింది. రాత్రిపూట రోడ్డు మీద ఒక్కదాన్నే ఉన్నానని, చాలా టెన్షన్‌గా ఉందని కన్నీళ్లు పెట్టుకుంది. కొంచెంసేపు తనతో మాట్లాడాలని సోదరిని ఫోన్లో కోరింది. తన స్కూటీ వెనుక టైరు పంక్చర్ కావడంతో అక్కడ ఉన్న లారీలోంచి ఓ వ్యక్తి వచ్చి పంక్చర్ వేయించుకొస్తానని బండి తీసుకెళ్లాడని ప్రియాంక చెప్పింది. తాను వెళ్లిపోతానంటే వద్దని తన వెంటబడ్డాడని భయంగా చెప్పింది. సమీపంలోని టోల్‌ప్లాజా వద్దకు వెళ్లాలని ప్రియాంకకు సోదరి సూచించగా అక్కడ నిలబడితే అందరూ తననే చూస్తారని సమాధానం ఇచ్చింది. ‘చాలా భయంగా ఉంది. ఈ దెయ్యం మొహపోడు నా బండి ఇంకా తీసుకురాలేదు. ఇక్కడ అస్సలు నిలబడాలని లేదు. బైక్ వచ్చే వరకు కాసేపు మాట్లాడు’ అంటూ సోదరితో ఫోన్లో మాట్లాడింది. తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాప్ అయిపోయింది. దీంతో భయాందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్దు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన స్థితిలో ప్రియాంకరెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రియాంకరెడ్డి దారుణ హత్యతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. (ప్రాథమిక వార్త: షాద్‌నగర్‌లో యువతి సజీవ దహనం) -
షాద్‌నగర్‌లో ప్రియాంకారెడ్డి సజీవ దహనం
సాక్షి, షాద్‌నగర్ : రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ యువతిని సజీవ దహనం చేశారు. షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్దు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన స్థితిలో యువతి మృతదేహం లభ్యమవ్వడం సంచలనం రేపుతోంది. మృతురాలు ప్రియాంకారెడ్డి అని, ఆమె వైద్యురాలని పోలీసులు గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం కొల్లూర్ గ్రామంలో ఆమె వెటర్నరీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నర్సయిపల్లి గ్రామం ఆమె స్వస్థలం కాగా.. ప్రస్తుతం శంషాబాద్‌లో వీరి కుటుంబం నివసిస్తున్నట్టు సమాచారం. రోజూ స్కూటీ మీద ప్రియాంకారెడ్డి విధులకు వెళ్లేది. బుధవారం కూడా విధులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆమె స్కూటీ పాడైంది. దీంతో భయపడుతూ ప్రియాంక తనకు ఫోన్ చేసిందని, అక్కడి స్థానికులు స్కూటీని రిపేర్ చేయిస్తామని తీసుకెళ్లి.. దుకాణాలు మూసిఉన్నాయని మళ్లీ తీసుకొచ్చారని తనకు చెప్పిందని, అక్కడ లారీ డ్రైవర్లు తిరుగుతూ ఉండటంతో భయంగా ఉందని చెప్పిందని ప్రియాంక సోదరి మీడియాకు తెలిపారు. అక్కడే ఉండవద్దని సమీపంలోని టోల్గేట్ వద్దకు వెళ్లమని తాను చెప్పినా.. వెళ్లలేదని, ఈ నేపథ్యంలో తన చెల్లెలు తిరిగిరాకపోవడం, ఇంతలోనే ఈ ఘోరం జరగడం తమను కలిచివేస్తోందని ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు. గుర్తుతెలియని దుండగులు ప్రియాంకపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. లారీ డ్రైవర్లు ఎక్కువగా సంచరించే ప్రాంతం కావడంతో వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రియాంకారెడ్డి సోదరి -
నిందితులను కఠినంగా శిక్షించాలి
-
లవ్ జిహాద్ హత్యకేసులో విస్తుపోయే నిజం
సాక్షి, జైపూర్ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన రాజస్థాన్ లవ్‌జిహాద్ హత్య కేసు దర్యాప్తు ఆధారంగా పోలీసులు షాకింగ్ విషయాలను వెల్లడించారు. నిందితుడు శంభు లాల్ లక్ష్యం వేరే వ్యక్తి అని.. కానీ, పొరపాటున అఫ్రజుల్ను చంపాడని పోలీసులు తెలిపారు. ‘శంభు లక్ష్యం అజ్జూ అనే వ్యక్తిని చంపటం. కానీ, అనుకోకుండా అఫ్రజుల్ బలయ్యాడు. ఈ విషయాన్ని విచారణలో శంభు వెల్లడించాడు. తనకు సోదరితో సమానం అని చెబుతున్న యువతిని శంభు ప్రేమిస్తున్నట్లు తేలింది. అందుకే పగతో అజ్జూను చంపేయాలనుకున్నాడు. ఆ క్రమంలో జరిగిన పొరపాటు మూలంగా అఫ్రజుల్ను చంపేశాడు ’’ అని రాజ్‌సమంద్ పోలీసులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే... రెగర్ మొహల్లా ప్రాంతానికి చెందిన యువతి మహమ్మద్ బబ్లూ షేక్ అనే వ్యక్తితో 2010లో వెళ్లిపోయింది. మాల్దాలో ఉంటున్న ఆమెను వెనక్కి రప్పించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించగా కుదరలేదు. దీంతో ఆమెను సోదరిగా చెప్పుకునే శంభులాల్ రంగంలోకి దిగాడు. తానే స్వయంగా వెళ్లి ఆమెతో మాట్లాడి వెనక్కి రప్పించాడు. అయితే కొంత కాలానికే అజ్జూ అనే మరోవ్యక్తి ఆమెను తిరిగి మాల్దాకు తీసుకెళ్లాడు. దీంతో మరోసారి ఆమెతో ఫోన్లో మాట్లాడి వెనక్కి రప్పించేందుకు యత్నించగా.. అజ్జూ-శంభు ఫోన్లోనే వాదులాడుకున్నారు. తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ యువతి స్వచ్ఛందంగా ఇంటికి వచ్చేసింది. చివరకు నాలుగైదు నెలల క్రితం అజ్జూ మళ్లీ ఆమె కోసం మొహుల్లాకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న శంభు ఇక అజ్జూను చంపేయటమే మార్గమని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో అజ్జూ కోసం శంభు వేట ప్రారంభించాడు. పొరపాటు అక్కడ దొర్లింది... అజ్జూ కూడా అఫ్రోజ్ మాదిరిగానే మాల్దా(పశ్చిమ బెంగాల్) నుంచి వలస వచ్చి రాజ్‌సమంద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. శంభు అజ్జూ కోసం గాలిస్తూ మార్కెట్లో ఆరాతీయటం ప్రారంభించాడు. అసలు విషయం తెలీని ఓ వ్యక్తి.. కూలి పనుల కోసం కాబోలు అన్న ఉద్దేశ్యంతో అఫ్రోజ్ నంబర్ ఇచ్చాడు. అప్పటిదాకా అజ్జూతో శంభుకి ముఖపరిచయం లేకపోవటం.. ఫోన్లో కూడా అజ్జూ గొంతును గుర్తుపట్టకపోవటంతో.. అన్నింటికి మించి అతని వివరాలను కూడా తెలుసుకోవటానికి శంభు ఆసక్తి చూపలేదు. డిసెంబర్ 6న ఉదయం అఫ్రోజ్‌కు ఫోన్ చేసి కాంపౌండ్ వాల్ పనుల కోసం మాట్లాడేందుకు రావాలంటూ శంభు పిలిచాడు. దీంతో వీరిద్దరూ కలుసుకుని పనుల గురించి మాట్లాడుకున్నారు. ఆపై పని ప్రాంతం చూపిస్తానంటూ కిలో మీటర్ దూరం తీసుకెళ్లి అక్కడ అఫ్రోజుల్పై దారుణానికి తెగబడ్డారు. ఆ తతంగం అంతా వీడియో తీసి అప్లోడ్ చేశాడు. అసలు విషయం పక్కదారి పట్టేందుకు అతను మతద్వేషిగా అభివర్ణించుకుంటూ వీడియోలను అప్లోడ్ చేశాడంటూ పోలీసులు వివరించారు. -
వాడు చంపుతానన్నాడు.. నేను చంపేశా!
జైపూర్ : రాజస్థాన్‌లో దారుణ హత్యకు పాల్పడిన శంభులాల్ రాయ్‌ఘర్ ఎట్టకేలకు నోరు మెదిపాడు. లవ్ జిహాద్ నుంచి యువతిని కాపాడేందుకే తాను అతన్ని చంపినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాదు తాను చేసింది నేరమే కాదని అతను వాదిస్తున్నాడు. ‘‘నేనేం తప్పు చేయలేదు. మా కాలనీకి చెందిన ఓ యువతితో అఫ్రాజుల్(అంతకు ముందు అతని పేరును మహ్మద్ భట్టా షేక్ అని పోలీసులు పేర్కొన్నారు) పారిపోయాడు. చిన్నతనం నుంచి ఆమె నాకు తెలుసు. ఆమె సోదరుడితో నేను కలిసి చదువుకున్నా కూడా. నేను ఆమెను వెనక్కి రప్పించేందుకు సహకరించబోయా. దానికి కోపంగా అఫ్రజుల్ నా కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించాడు. అందుకే అతన్ని చంపేశా. ఆ వీడియోను తీసింది నా అల్లుడే’’ అని దిల్వారా పోలీస్ స్టేషన్ లో శంభులాల్ వివరణ ఇచ్చుకున్నారు. ఇక రాజసమంద్ పోలీసులు ఆ విషయాన్ని ధృవీకరించారు. శుంభునాథ్ రాయ్‌ఘర్ చెప్పిన విషయాలనే కాదు.. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు పక్కగా చేపడతామని, పూర్తి సాక్ష్యాలు సేకరించి అసలు వాస్తవాలను త్వరలోనే వెల్లడిస్తాం అని ఉదయ్‌పూర్ ఐజీ ఆనంద్ శ్రీవాస్తవ తెలిపారు. -
మనిషిని చితక్కొట్టి..దహనం!
-
మనిషిని చితక్కొట్టి.. సజీవ దహనం..!
రాజస్థాన్‌లో చోటుచేసుకున్న అత్యంత భయానక ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. 'లవ్ జిహాద్' పేరిట ఓ వ్యక్తిని సజీవ దహనం చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడో కిరాతకుడు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ తింటున్నారు. ఈ ఘటనలో మరణించిన బాధితుడిని మహమ్మద్ భట్టా షైక్‌గా పోలీసులు గుర్తించారు. శంబూనాథ్ రాయ్‌గర్ అనే వ్యక్తి అతడిని కొట్టి చంపి.. సజీవ దహనం చేశాడు. నిందితుడిని గురువారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఈలోపు సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన మరో వీడియో సదరు నేరగాడు తాను చేసిన చర్యను సమర్థించుకోవడం గమనార్హం. లవ్ జిహాద్ నుంచి యువతిని కాపాడేందుకు తాను అలా చేశానంటూ అతను వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజ్‌సమంద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు చోటుచేసుకోకుండా జిల్లాలో ఐజీ ఆనంద్ శ్రీవాస్తవ క్యాంప్ చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాజ్‌సమంద్ జిల్లాలోని రాజ్‌నగర్ ప్రాంతంలో దేవి హెరిటేజ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సగం కాలి పడి ఉన్న మృతదేహం గురించి పోలీసులకు సమాచారం వచ్చింది. బాధితుడిని వ్యవసాయ పరికరంతో చితక్కొట్టిన నిందితుడు.. అనంతరం కిరోసిన్ పెట్టి తగులబెట్టాడు. ఈ మేరకు వీడియో తీసి.. ఎవరూ 'లవ్ జిహాద్'కు పాల్పడిన ఇదే గతి పడుతుందని అతను హెచ్చరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని, ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన మీడియాకు తెలిపారు. -
సజీవదహనం కేసు నిందితుడి అరెస్ట్
తెనాలి : తనతో సహజీవనం చేస్తున్న మహిళను, ఆమె ఏడాదిన్నర వయసున్న కుమారుడిని హత్య చేసి ఇంటికి నిప్పు పెట్టి పారిపోయిన నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను, నిందితుడు హత్యకు పాల్పడిన వైనాన్ని సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సీహెచ్ సౌజన్య వివరించారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన గండికోట మణికంఠకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. గతంలో గ్రామంలోని ఓ మహిళ మెడలోని గొలుసు చోరీ చేసేందుకు ప్రయత్నించి, ఆమె ప్రతిఘటించడంతో హత్య చేయబోయిన కేసులో మణికంఠ నిందితుడిగా ఉన్నాడు. భర్త ప్రవర్తన నచ్చని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో కాకుమాను మండలం లింగాయపాలెంలో బేలుదారుపనికి వెళ్తున్న మణికంఠకు, అక్కడ పనిచేసే దేవనపల్లి లక్ష్మి అనే వివాహితతో చనువు ఏర్పడింది. ఈ నెల మొదటి వారంలో ఆమెను, ఆమె ఏడాదిన్నర వయసున్న కుమారుడు కాశీని నందివెలుగులోని తన ఇంటికి తీసుకువచ్చి వాళ్లతో కలసి ఉంటున్నాడు. కాగా ఈ నెల 12వ తేదీ రాత్రి ఇరువురికి ఘర్షణ జరుగగా, అప్పటికే మద్యం సేవించి ఉన్న మణికంఠ.. లక్ష్మిపై , ఆమె కుమారుడిపై కిరోసిన్‌పోసి నిప్పటించాడు. అంతటితో ఆగకుండా ఇంటికి నిప్పు పెట్టి పరారయ్యాడు. ఈ ఘటనలో లక్ష్మి, ఆమె కుమారు అక్కడే సజీవదహనమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం నిందితుడు తెనాలి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాడన్న సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడకు చేరుకుని అతన్ని అరెస్ట్ చేశారు.