Priyanka Reddy Veterinary Doctor Case: ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు | Shadnagar Incident News - Sakshi
Sakshi News home page

ప్రియాంక హత్య కేసు: ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు

Published Fri, Nov 29 2019 3:20 AM | Last Updated on Fri, Nov 29 2019 10:27 AM

Police Says If Priyanka Approached Hawk Eye This would not have happened - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పశువైద్యురాలు ప్రియాంకారెడ్డి బుధవారం రాత్రి తొండుపల్లి ఓఆర్‌ఆర్‌ టోల్‌గేట్‌ వద్ద ఇరుక్కుపోయారు. తన స్కూటీ పంక్చర్‌ కావడంతో రోడ్డుపై ఒంటరిగా మిగిలారు. ఆ సమయంలోనో లేదా ఈ ప్రయాణం ప్రారంభించడానికి ముందో ఆమె పోలీసు అధికారిక యాప్‌ హాక్‌–ఐ లేదా పోలీసు కంట్రోల్‌ రూం నంబర్‌ 100ను సంప్రదించి ఉంటే హత్యకు గురయ్యేవారు కాదు. అయితే ఈ యాప్‌ను లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నా కేవలం వందల మందే వాడుతున్నారు. ‘హాక్‌–ఐ’లో ఉన్న ఎస్‌ఓఎస్‌లో ముందు రిజిస్టర్‌ చేసుకోవాలి. ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ‘ఎస్‌ఓఎస్‌’ను నొక్కితే పోలీసులు రంగంలోకి దిగి జీపీఎస్‌ ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు.

హాక్‌–ఐ మొబైల్‌ యాప్‌ ద్వారా ‘డయల్‌–100’కు సైతం ఫోన్‌ చేసే ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారులు, బాధితులు ఎవరైనా నేరుగా కాకపోయినా ఈ యాప్‌ ద్వారానైనా సంప్రదించే అవకాశం ఉంది. వేళకాని వేళల్లో లేదా ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం ‘హాక్‌–ఐ’లో ఏర్పాటు చేసిన విభాగమే ఉమెన్‌ ట్రావెల్‌ మేడ్‌ సేఫ్‌. ప్రయాణ ప్రారంభానికి ముందు యాప్‌లోని ఈ విభాగంలోకి ప్రవేశించి సదరు మహిళ/యువతి ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తున్నారో (డెస్టినేషన్‌) ఫీడ్‌ చేయాల్సి ఉంటుంది. వారు ఎక్కుతున్న బస్సు, ఆటో, క్యాబ్‌ నంబర్లను ఫొటో లేదా మ్యాన్యువల్‌గా నమోదు చేయాలి. జీపీఎస్‌ పరిజ్ఞానంతో పనిచేసే ఈ యాప్‌ ద్వారా ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి అది పూర్తయ్యే వరకు కమిషనరేట్‌లోని ఐటీ సెల్‌ పర్యవేక్షిస్తూ ఉంటుంది.

నిర్దేశించిన డెస్టినేషన్‌ కాకుండా సదరు వాహనం వేరే మార్గంలో ప్రయాణిస్తే పోలీసులే గుర్తించి ప్రయాణికురాలిని సంప్రదిస్తారు. అటు వైపు నుంచి స్పందన లేకుంటే అప్రమత్తం కావాలని భావించి వెంటనే రంగంలోకి దిగుతారు. మార్గమధ్యంలో ఏదైనా ఇబ్బంది ఎదురైనా క్షణాల్లో ఫిర్యాదు చేసేందుకు ఓ బటన్‌ ఏర్పాటు చేశారు. ప్రయాణికురాలు సురక్షితంగా గమ్యం చేరి సమాచారం ఇచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతుంది. ఈ మధ్యలో ఎప్పుడు అవసరమైనా నిమిషాల్లో పోలీసులు చేరుకుంటారు. ఈ యాప్‌తోపాటు డయల్‌ ‘100’, వాట్సాప్‌ (హైదరాబాద్‌: 9490616555, సైబరా బాద్‌: 9490617444) రాచకొండ: 9490617111) ద్వారానూ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా పొందవచ్చు.

నిరంతర పర్యవేక్షణ... 
పోలీసులకు సంబంధించిన అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులు, సలహాలు, సూచనల్ని నిరంతరం పర్యవేక్షి స్తుంటాం. మహిళల కోసం ఏర్పాటు చేసి న విభాగాలను ఐటీ సెల్‌లో ఉండే సిబ్బంది 24 గంటలూ గమనిస్తూ అందుబాటులో ఉంటా రు. ఈ యాప్‌ తెలంగాణవ్యాప్తంగా సేవలు అందిస్తోంది. – ఐటీ సెల్‌ అధికారులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement