
జైపూర్ : రాజస్థాన్‌లో దారుణ హత్యకు పాల్పడిన శంభులాల్ రాయ్‌ఘర్ ఎట్టకేలకు నోరు మెదిపాడు. లవ్ జిహాద్ నుంచి యువతిని కాపాడేందుకే తాను అతన్ని చంపినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాదు తాను చేసింది నేరమే కాదని అతను వాదిస్తున్నాడు.
‘‘నేనేం తప్పు చేయలేదు. మా కాలనీకి చెందిన ఓ యువతితో అఫ్రాజుల్(అంతకు ముందు అతని పేరును మహ్మద్ భట్టా షేక్ అని పోలీసులు పేర్కొన్నారు) పారిపోయాడు. చిన్నతనం నుంచి ఆమె నాకు తెలుసు. ఆమె సోదరుడితో నేను కలిసి చదువుకున్నా కూడా. నేను ఆమెను వెనక్కి రప్పించేందుకు సహకరించబోయా. దానికి కోపంగా అఫ్రజుల్ నా కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించాడు. అందుకే అతన్ని చంపేశా. ఆ వీడియోను తీసింది నా అల్లుడే’’ అని దిల్వారా పోలీస్ స్టేషన్ లో శంభులాల్ వివరణ ఇచ్చుకున్నారు.
ఇక రాజసమంద్ పోలీసులు ఆ విషయాన్ని ధృవీకరించారు. శుంభునాథ్ రాయ్‌ఘర్ చెప్పిన విషయాలనే కాదు.. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు పక్కగా చేపడతామని, పూర్తి సాక్ష్యాలు సేకరించి అసలు వాస్తవాలను త్వరలోనే వెల్లడిస్తాం అని ఉదయ్‌పూర్ ఐజీ ఆనంద్ శ్రీవాస్తవ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment