
పదవులు శాశ్వతం కాదు: మంత్రి అయ్యన్న
పదవులు శాశ్వతం కాదని ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు.
విశాఖపట్నం: పదవులు శాశ్వతం కాదని ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఉన్నస్థానంలో ఉన్న రోజులున్నాయని, కింద కూర్చున్న రోజులు కూడా ఉన్నాయని అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు అందరూ చుట్టూ చేరుతారని, పదవి లేకపోతే ఎవరూ మాట వినరని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా వారి వెంట కార్యకర్తలు వెళ్లకూడదని సూచించారు. 10 ఏళ్లు అధికారంలో లేనప్పుడు మన అధికారులను ఎక్కడికెక్కడో పంపారని, ఇప్పుడు తీసుకువస్తే తప్పేముందని మంత్రి అన్నారు.