సాక్షి, అమరావతి : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఎల్లు వచ్చి గోదారమ్మ’ అనే పాటకు ఆయన లయబద్ధంగా స్టెప్పులు వేశారు. అయ్యన్నపాత్రుడి కుమారుడి వివాహం శుక్రవారం విశాఖపట్నంలో జరిగింది. కొడుకు పెళ్లి రిసెప్షన్‌లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు డాన్స్ చేశారు. ‘దేవత’ సినిమాలో శోభన్ బాబు మాదిరి ఇద్దరు వ్యాఖ్యాలతో కలిసి అయ్యన్నపాత్రుడు స్టెప్పులేశారు. వ్యాఖ్యాతల చేతులు పట్టుకొని పాటకు తగిన స్టెప్పులేసి అలరించారు. ప్రసుత్తం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.