సాక్షి, విశాఖపట్నం: 30 నెలల్లో భోగాపురం ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. టీడీపీ హయాంలోఉత్తుత్తి శంకుస్థాపన చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ పాలనలో చంద్రబాబు అండ్ కో రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. రాజధాని భూముల్లో రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నారని ఏకిపారేశారు. రాజధాని ప్రకటన కంటే ముందు టీడీపీ నేతలు భూ దోపిడీకి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో అతిపెద్ద భూ కుంభకోణానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు.
అందుకే తనను జైలులో పెడతారని చంద్రబాబు భయపడుతున్నారని గుడివాడ ఎద్దేవా చేశారు. అందుకే విచారణ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈమేరకు అమర్నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
చదవండి: చంద్రబాబుకు బిగ్ షాక్.. ఈ కేసులో మొదటి నుంచీ ఏం జరిగిందంటే?
Comments
Please login to add a commentAdd a comment