సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అనేక ప్రాజెక్టులతో అభివృద్ధి చేస్తున్నామని ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటికే మూలపేట పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారని, ఆ పోర్టు ద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. మూలపేట పోర్ట్ పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. మరో రెండున్నరేళ్లలో మూలపేట పోర్టు పూర్తి కానుంది. రేపు(బుధవారం) భోగాపురం ఎయిర్‌పోర్ట్, డేటా సెంటర్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు.
‘‘రూ.3,500 కోట్లతో భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం జరగనుంది. 2025 సెప్టెంబర్ లోపు ఎయిర్‌పోర్ట్ పూర్తి చేయాలన్నది లక్ష్యం. టెక్ పార్క్ ద్వారా లక్షకుపైగా ఉద్యోగాల కల్పన లక్ష్యం. రూ.6,500 కోట్లతో భోగాపురం విశాఖ మధ్య 6 లేన్ల రోడ్డు నిర్మాణానికి కేంద్రమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. హైదరాబాద్-సైబరాబాద్ ట్విన్ సిటీస్ మాదిరిగా భవిష్యత్‌లో విశాఖ-విజయనగరం అభివృద్ధి చెందుతాయి’’ అని అమర్‌నాథ్ అన్నారు.
చదవండి: ‘చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కలిసినా కాపులు కలవరు’
‘‘ఎప్పుడైనా చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏదైనా ప్రాజెక్ట్ తీసుకువచ్చారా? 2019 ఫిబ్రవరి 15న ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసీ భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకు స్థాపన చేశారు. ఆ సమయంలో కనీసం భూ సేకరణ, రన్ వే కోర్టు క్లియరెన్స్‌లు తీసుకోలేదు. సిమెంట్ పలక ఉంటే చాలు.. చంద్రబాబు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసేస్తారు’’ అంటూ మంత్రి అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు.
చదవండి: ఏపీ వాసులకు అలర్ట్.. మూడురోజుల పాటు భారీ వర్షాలు
Comments
Please login to add a commentAdd a comment