అయోధ్య: అయోధ్య బీజేపీ ఎమ్మెల్యే, మేయర్, మాజీ ఎమ్మెల్యే తదితర 40 మంది భూకుంభకోణానికి పాల్పడినట్లు అయోధ్య అభివృద్ధి అథారిటీ(ఏడీఏ) ఆరోపించింది. వీరంతా స్థానికంగా ఇళ్ల ఫ్లాట్ల అక్రమ క్రయవిక్రయాలకు పాల్పడంతోపాటు, అనధికారికంగా కాలనీలను నిర్మించినట్లు ఏడీఏ తెలిపింది. కుంభకోణంతో సంబంధమున్న మేయర్ రిషికేశ్ ఉపాధ్యాయ, ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా, మాజీ ఎమ్మెల్యే గోరఖ్‌నాథ్ బాబా తదితర 40 మంది పేర్లను శనివారం విడుదల చేశామని ఏడీఏ వైస్ చైర్మన్ విశాల్ సింగ్ చెప్పారు. వీరిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ వ్యవహారంపై ఎస్‌పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కాషాయపార్టీ అవి నీతి నీడ పడకుండా కనీసం అయోధ్యనైనా కాపాడాలన్నారు. బీజేపీ నేతలు అయోధ్యలో 30 వరకు కాలనీలను అక్రమంగా ఏర్పాటు చేసి, ప్రభుత్వ ఖజానాకు వందలాది కోట్ల రూ పాయల నష్టం కలిగించారని ఆరోపించారు.
చదవండి: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ?
Comments
Please login to add a commentAdd a comment