సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో మాజీ అడ్వకేట్ జనరల్‌పై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ అడ్వకేట్ మమత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన హైకోర్టు ధర్మాసనం, కౌంటర్ దాఖలు చేయాలని మాజీ అడ్వకేట్ జనరల్తరఫు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.(చదవండి: హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి)
కాగా, రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో మాజీ అడ్వకేట్ జనరల్, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కుమార్తెలు, మిగిలిన నిందితులు కలిసి జరిపిన భూముల కొనుగోళ్ల వెనుక భారీ కుంభకోణం ఉందంటూ ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం విదితమే. అయితే ఈ కేసులో ఎవ్వరినీ అరెస్టుచెయ్యొద్దని.. అలాగే, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వార్తలు ప్రచురణ, ప్రసారం చేయరాదంటూ పత్రికలను, టీవీలను, సోషల్ మీడియాను నియంత్రిస్తూ ఈ నెల 15న హైకోర్టు ఉత్వర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment