సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో అణచివేతలు సహజమని.. అసత్యాలతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండో సారి అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఉద్యమ భావజాలం లేదని.. తనకు రెండో సారి పదవి ఇచ్చేందుకు సంకోచించారని ఈటల వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ సమావేశాల సమయంలోనే కేసీఆర్‌ను కలిశానని, కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించానని ఆయన తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారమే తనపై కుట్ర జరిగిందని.. తాను ఎక్కడా భూములు ఆక్రమించలేదని పేర్కొన్నారు. ‘‘నాపై ఆరోపణలు వచ్చిన వెంటనే నన్నే పిలిచి అడగొచ్చు కదా?. కేసీఆర్‌కు తెలియకుండా ప్రభుత్వంలో చీమ చిటిక్కుమంటుందా?. మంత్రి హోదాలో ఉండి నా సమస్యలే పరిష్కరించుకోలేకపోయా. నాకు పార్టీ పెట్టే ఆలోచన లేదు. భవిష్యత్ కార్యాచరణపై నాకే క్లారిటీ లేదు. ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని’’ ఈటల అన్నారు.
చదవండి: ఈటల భూ వివాదం: కమలాపూర్‌లో హై టెన్షన్...
ఈటలపై భూకబ్జా ఆరోపణలు: వివరాలు వెల్లడించిన కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment