విజయవాడ : విజయవాడ నగరంలోని గాంధీనగర్ 59వ డివిజన్ మహిళా కార్పొరేటర్ శైలజ పట్ల టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు దురుసుగా ప్రవర్తించారు. దీంతో కార్పొరేటర్ శైలజా నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగవీటి రాధా దృష్టికి తీసుకెళ్లారు.
శైలజకు వెంటనే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు క్షమాపణలు చెప్పాలని రాధా డిమాండ్ చేశారు. గురువారం రాత్రి ఎమ్మెలే బోండా ఉమా.. 59వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భగా శైలజా పట్ల బోండా ఉమా దురుసుగా ప్రవర్తించారు.