బోండా ఉమ భూకబ్జా ఎపిసోడులో కీలక మలుపు! | Bonda Uma Land Grabbing episode takes a new turn | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 22 2018 5:32 PM | Last Updated on Thu, Feb 22 2018 7:21 PM

Bonda Uma Land Grabbing episode takes a new turn  - Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుటుంబం భూకబ్జా ఎసిసోడులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ భూభాగోతంపై ఫిర్యాదు చేసిన బాధితుడు కేసిరెడ్డి సురేష్‌ బాబు ఫిర్యాదు మేరకు ఆర్డీవో విచారణ చేపట్టనున్నారు. ఈ నెల 24న విచారణకు హాజరై బోండా ఉమపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు  సమర్పించాలని ఈ మేరకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు.

కాగా 1951లో సూర్యనారాయణ అనే  స్వాతంత్య్ర సమరయోధుడికి ప్రభుత్వం పదెకరాల స్థలాన్ని కేటాయించింది. 2016లో నకిలీ పత్రాలు సృష్టించి బోండా ఉమ కబ్జాకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సూర్యనారాయణ మనువడు సురేష్‌ 2017, ఫిబ్రవరి 10న విజయవాడ సింగ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సురేష్‌ సీఐడీ అధికారులను ఆశ్రయించారు. సీఐడీ అధికారుల దర్యాప్తులో ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూబాగోతం వెలుగులోకి వచ్చింది. మరోవైపు తనపై నమోదు అయిన కేసులు కొట్టివేయాలంటూ బోండా ఉమ సతీమణి సుజాత హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు 8వారాల స్టే విధించింది. ఆలోపు కౌంటర్‌ దాఖలు చేయాలంటూ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో బోండా సుజాత ఏ-8 ముద్దాయిగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement