
సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లాది విష్ణు, తాను వేరు కాదు.. ఇద్దరూ ఒక్కటేనని వెల్లంపల్లి స్పష్టం చేశారు. అలాగే, బోండా ఉమా హద్దు మీరి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, వెల్లంపల్లి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మల్లాది విష్ణుతో కలిసి విజయవాడ సెంట్రల్‌లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం. మల్లాది విష్ణు, నేను వేరు కాదు.. ఇద్దరం ఒక్కటే. సామాజిక సమీకరణాల్లో భాగంగానే మార్పులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండగా పాటిస్తాం. సీఎం వైఎస్ జగన్ పథకాలు, సంక్షేమ పాలనే వైఎస్సార్‌సీపీని, మమ్మల్నిని గెలిపిస్తాయి. టీడీపీ నేత బోండా ఉమ హద్దు మీరి మాట్లాడుతున్నాడు. బోండా ఉమ హద్దు మీరితే సహించేది లేదు. ముందు వాళ్ల సీట్లు కన్ఫర్మ్ చేసుకోవాలి అని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment