విజయవాడ : కాపు భవనాలకు చంద్రన్న పేరు పెట్టడాన్ని రాజకీయం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోండ ఉమ శుక్రవారం విజయవాడలో ఆరోపించారు. కాపు భవనాలకు చంద్రన్న పేరు పెడితే తప్పు ఏంటి అని ప్రశ్నించారు. కాపునాడు, కాపు సంఘాల కోరిక మేరకే చంద్రన్న పేరు పెట్టామని ఆయన చెప్పారు. కాపు సామాజిక వర్గంలో గొప్ప వ్యక్తులు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం మాత్రం కాపు భవనాలకు చంద్రన్న పేరు పెట్టాలని నిర్ణయించిందని బోండ ఉమ అన్నారు.