nallapa reddy prasanna kumar reddy
-
చివరి రక్తపు బొట్టు వరకు వైఎస్ జగన్‌తోనే..
విడవలూరు (నెల్లూరు): సీఎం వైఎస్ జగన్‌కు తనను దూరం చేయాలని ఏబీఎన్, టీవీ–5 చానల్స్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాటలను వక్రీకరించి పదేపదే ప్రసారం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. తన చివరి రక్తపు బొట్టు వరకు వైఎస్ జగన్‌తోనే తన రాజకీయ జీవితం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూఈ నెల 26న గృహ నిర్మాణాలపై జరిగిన మంత్రుల సమీక్ష సమావేశంలో సీఎం చేస్తున్న అభివృద్ధి యజ్ఞం గురించి తాను గొప్పగా మాట్లాడితే.. ఆ మాటల్ని తొలగించి, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు వక్రీకరించి చూపడం దారుణమన్నారు. ఆ చానళ్లు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. -
ఇసుక దీక్షా...కార్తీక ఉపవాసమా?
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: చంద్రబాబునాయుడు ఈ నెల 14వ తేదీ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇసుక దీక్ష చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం దళితవాడలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇసుక దోపిడీ చేసిన విషయాన్ని ప్రజలు మరువలేదన్నారు. తహసీల్దార్ వనజాక్షి విషయంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహరించిన తీరును ప్రజలంతా గమనించారన్నారు. అధికారులపై దాడులు చేసి ఇసుకను కొల్లగొట్టిన చరిత్రను మరిస్తే ఎలా చంద్రబాబూ అని ఆయన ప్రశ్నించారు. అటువంటి చంద్రబాబు ఇసుక దీక్ష చేస్తాననడం విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కార్తీకమాసం కావడంతో ఉపవాసదీక్ష చేసి దాన్ని ఇసుక దీక్షగా చేయనున్నాడని ఎద్దేవా చేశారు. వరుస వర్షాలతో నదుల్లో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇసుక కొరత వచ్చిందన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఒక్క పిచ్చి వ్యక్తి ఇలా ఉంటే మరో పిచ్చి వ్యక్తి పవన్‌కల్యాణ్ మాటలు విచిత్రంగా ఉన్నాయన్నారు. వైజాగ్‌లో రెండు కిలో మీటర్లు పాదయాత్ర పూర్తికాకుండానే వాహనం ఎక్కిన వ్యక్తి పవన్‌కల్యాణ్ అన్నారు. 3,600 కిలో మీటర్లు పైగా పాదయాత్ర చేసిన తమ నాయకుడు జగన్మోహన్రెడ్డిని విమర్శించడం సిగ్గు చేటన్నారు. పిచ్చిప్రేలాపనులు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబు రెడ్డి, కోశాధికారి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మండల కనీ్వనర్ నలుబోలు సుబ్బారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు మోసగాడు.. నమ్మకండి
సాక్షి, ఇందుకూరుపేట: సీఎం చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడమే పని. ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు. త్వరలో జరిగే ఎన్నికల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపిస్తే అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తారు’ అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కుడితిపాలెం గ్రామంలో మంగళవారం ప్రసన్న పర్యటించారు. స్థానిక నేత టంగుటూరు ఉదయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రసన్న మాట్లాడుతూ టీడీపీ రాక్షసపాలన అంతమొందించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. జగన్ ప్రజల మధ్య ఉంటూ వారికోసం ఉద్యమాలు, దీక్షలు చేశారన్నారు. ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారన్నారు. వైఎస్సార్ హయాంలో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. ఈ ఐదేళ్లలో వారిలో ఆ ఆనందం చూడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు గిట్టుబాటు ధర ఇచ్చేవారు కరువయ్యారని చెప్పారు. సోమశిల, కండలేరలో నీరున్నా పంటలు పండించుకోలేకపోయారని తెలిపారు. అన్నదాతలకు నీరందించాలనే ఉద్దేశం మంత్రులకు లేకుండాపోయాయన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన పథకాలను బాబు కాపీ కొట్టాడన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను మరిపించగల సత్తా జగన్‌కు ఉందన్నారు. మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి తెలుగు తమ్ముళ్లు కనిపించలేదన్నారు. ఒక వ్యక్తికి పెత్తనం ఇచ్చి సీనియర్లను సైతం అవమానింపజేసిన విషయం తెలియాదా?, ఆ రిపోర్ట్‌లను సీఎం తెప్పించుకోలేదా అని ప్రశ్నించారు. జగన్ కార్యకర్తలను గౌరవించే వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావులూరు శ్రీనివాసులురెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి విజయ్‌కుమార్, నాయకులు అడపాల ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బీవీ రమణయ్య, మాజీ జెడ్పీటీసీ కైలాసం ఆదిశేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకుడు ఉదయకుమార్‌రెడ్డి కేక్ కట్ చేసి ప్రసన్నకుమార్‌రెడ్డికి తినిపించారు. -
నాలుగున్నరేళ్ల నిర్ణయాలపై సీబీఐ విచారణకు సిద్ధమా
-
16న వైఎస్సార్సీపీ కోవూరు నియోజకవర్గ ప్లీనరీ
► వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ► నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 16న ఉదయం 9 గంటలకు వైఎస్సార్సీపీ కోవూరు నియోజకవర్గ ప్లీనరీని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ప్లీనరీ నిర్వహణకు కోవూరులోని రుక్మిణి కల్యాణ మండపాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్లీనరీకి నెల్లూరు, తిరుపతి ఎంపీలు రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌రావు, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు హాజరవుతారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. పార్టీ నాయకులు నిరంజన్‌బాబురెడ్డి, రాధాకృష్ణారెడ్డి, మల్లికార్జునరెడ్డి, బాలశంకర్‌రెడ్డి, సుబ్బరామిరెడ్డి, సు బ్బారెడ్డి, నరసింహులురెడ్డి, సుబ్రహ్మణ్యం, జనార్దన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి,మలికార్జున,నాగరాజు,చిరంజీవి పాల్గొన్నారు.