ఇసుక దీక్షా...కార్తీక ఉపవాసమా? | MLA Prasanna Kumar Reddy Fires On Chandrababu's Sand Protest | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దీక్షపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ధ్వజం

Published Thu, Nov 7 2019 11:47 AM | Last Updated on Thu, Nov 7 2019 11:47 AM

MLA Prasanna Kumar Reddy Fires On Chandrababu's Sand Protest - Sakshi

మాట్లాడుతున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి

సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: చంద్రబాబునాయుడు ఈ నెల 14వ తేదీ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇసుక దీక్ష చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం దళితవాడలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్‌ నాయకత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇసుక దోపిడీ చేసిన విషయాన్ని ప్రజలు మరువలేదన్నారు. తహసీల్దార్‌ వనజాక్షి విషయంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వ్యవహరించిన తీరును ప్రజలంతా గమనించారన్నారు. అధికారులపై దాడులు చేసి ఇసుకను కొల్లగొట్టిన చరిత్రను మరిస్తే ఎలా చంద్రబాబూ అని ఆయన ప్రశ్నించారు. అటువంటి చంద్రబాబు ఇసుక దీక్ష చేస్తాననడం విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.

కార్తీకమాసం కావడంతో ఉపవాసదీక్ష  చేసి దాన్ని ఇసుక దీక్షగా చేయనున్నాడని ఎద్దేవా చేశారు. వరుస వర్షాలతో నదుల్లో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇసుక కొరత వచ్చిందన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఒక్క పిచ్చి వ్యక్తి ఇలా ఉంటే మరో పిచ్చి వ్యక్తి పవన్‌కల్యాణ్‌ మాటలు విచిత్రంగా ఉన్నాయన్నారు. వైజాగ్‌లో రెండు కిలో మీటర్లు పాదయాత్ర పూర్తికాకుండానే వాహనం ఎక్కిన వ్యక్తి పవన్‌కల్యాణ్‌ అన్నారు. 3,600 కిలో మీటర్లు పైగా పాదయాత్ర చేసిన తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం సిగ్గు చేటన్నారు. పిచ్చిప్రేలాపనులు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబు రెడ్డి, కోశాధికారి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మండల కనీ్వనర్‌ నలుబోలు సుబ్బారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement