16న వైఎస్సార్‌సీపీ కోవూరు నియోజకవర్గ ప్లీనరీ | ysrcp plenary meeting on 16th | Sakshi
Sakshi News home page

16న వైఎస్సార్‌సీపీ కోవూరు నియోజకవర్గ ప్లీనరీ

Published Fri, Jun 2 2017 8:43 AM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

16న వైఎస్సార్‌సీపీ కోవూరు నియోజకవర్గ ప్లీనరీ - Sakshi

16న వైఎస్సార్‌సీపీ కోవూరు నియోజకవర్గ ప్లీనరీ

► వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
► నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి


కోవూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 16న ఉదయం 9 గంటలకు వైఎస్సార్‌సీపీ కోవూరు నియోజకవర్గ ప్లీనరీని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ప్లీనరీ నిర్వహణకు కోవూరులోని రుక్మిణి కల్యాణ మండపాన్ని  గురువారం ఆయన  పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్లీనరీకి నెల్లూరు, తిరుపతి ఎంపీలు రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌రావు, జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి,  పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు హాజరవుతారని తెలిపారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. పార్టీ నాయకులు నిరంజన్‌బాబురెడ్డి, రాధాకృష్ణారెడ్డి, మల్లికార్జునరెడ్డి, బాలశంకర్‌రెడ్డి, సుబ్బరామిరెడ్డి, సు బ్బారెడ్డి, నరసింహులురెడ్డి, సుబ్రహ్మణ్యం, జనార్దన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి,మలికార్జున,నాగరాజు,చిరంజీవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement