కోవూరు (నెల్లూరు) : నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని రైస్ మిల్లులపై శనివారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో రైస్ మిల్లుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 70 లక్షల వరకు ఉంటుందని విజిలెన్స్ ఎస్పీ తెలిపారు.