
దుఃఖాన్ని దిగమింగి..
కోవూరు, ఒకవైపు పదో తరగతి పరీక్షలు.. మరోవైపు విధి పెట్టిన కఠిన పరీక్ష. తండ్రి అకాల మరణం చెందడంతో పుట్టెడు దు:ఖాన్ని దిగమింగి పదో తరగతి పరీక్షకు హాజరైంది ఓ విద్యార్థిని. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కొత్తవంగల్లుకు చెందిన నీలిమ కోవూరులోని వశిష్ట ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదువుతోంది.
స్థానిక సెయింట్‌పాల్స్ పరీక్ష కేంద్రంలో బుధవారం ఇంగ్లిష్ పేపర్-2 పరీక్షకు సిద్ధమవుతుండగా ఆమె తండ్రి పెద్దిరెడ్డి ప్రకాశ్‌రెడ్డి హత్యకు గురయ్యాడు. అయితే తండ్రి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకుని ఆమె పరీక్షకు హాజరైంది. తండ్రి అంత్యక్రియలు పూర్తికాకుండానే పరీక్షకు హాజరైన నీలిమను చూసి సహ విద్యార్థులు, అధ్యాపకులు, బంధువులు కంటతడి పెట్టారు.