ఏ సినిమా అయినా సరే ఫేమ్, క్రేజ్ లాంటివి హీరోహీరోయిన్లకే వస్తాయి. అయితే కొన్నిసార్లు వీళ్లతో పాటు సైడ్ క్యారెక్టర్స్ చేసినోళ్లు కూడా ఓ మాదిరిగా గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఈమె కూడా అప్పట్లో పలు హిట్ సినిమాల్లో కనిపించింది. ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తినే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ప్రస్తుతం సినిమాలు చేస్తున్నప్పటికీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మారిపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
పైన ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు నీలిమ రాణి. గుర్తుచ్చినట్లే ఉంది కానీ ఐడియా రావట్లేదు కదా! చెన్నైలో పుట్టి పెరిగిన ఈమె.. పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైంది. స్కూల్ చదువుతున్నప్పుడే ఈమెకు ఛాన్సులొచ్చాయి. అలా తెలిసీ తెలియని వయసులోనే చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించింది. కమల్ హాసన్ 'క్షత్రియ పుత్రుడు' చిత్రంతో అరంగేట్రం చేసింది.
(ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?)
దాదాపు పదేళ్ల గ్యాప్‌లో చైల్డ్ ఆర్టిస్టుగా నాలుగు సినిమాలు చేసిన నీలిమ.. ఆ తర్వాత రూట్ మార్చింది. సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. 2003 నుంచి మొదలుపెడితే స్టిల్ ఇప్పటికీ అటు సినిమాలు ఇటు సీరియల్స్‌లో నటిస్తూనే ఉంది. నటి,నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్టు, హోస్ట్.. ఇలా డిఫరెంట్‌గా క్రేజ్ సంపాదించింది. కెరీర్ మొత్తంలో ఈమెకు విలన్ తరహా పాత్రలు బాగా పేరు తెచ్చాయని చెప్పొచ్చు.
కార్తీ 'నా పేరు శివ', విశాల్ 'పొగరు' లాంటి సినిమాలు చూస్తే మీకు ఈమె కనిపిస్తుంది. అలానే తెలుగులో 'వసుంధర', 'ఇది కథ కాదు', 'తాళి కట్టు శుభవేళ' లాంటి సీరియల్స్‌లోనూ నీలిమ సందడి చేసింది. వ్యక్తిగత జీవితానికి వస్తే.. తమిళ సినిమాల్లోనే అసోసియేట్ డైరెక్టర్‌గా చేస్తున్న ఎసాయి వానన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమెకు ప్రస్తుతం ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే చాలారోజుల తర్వాత ఈమె ఫొటో, సోషల్ మీడియాలో కనిపించడంతో తొలుత మనోళ్లు గుర్తుపట్టలేకపోయారు. ఐడియా వచ్చిన తర్వాత ఈమె ఆమెనే కదా అని మాట్లాడుకున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment