neelima
-
ఆ హిట్ సినిమాల్లో నటించిందీ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా మరి?
ఏ సినిమా అయినా సరే ఫేమ్, క్రేజ్ లాంటివి హీరోహీరోయిన్లకే వస్తాయి. అయితే కొన్నిసార్లు వీళ్లతో పాటు సైడ్ క్యారెక్టర్స్ చేసినోళ్లు కూడా ఓ మాదిరిగా గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఈమె కూడా అప్పట్లో పలు హిట్ సినిమాల్లో కనిపించింది. ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తినే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ప్రస్తుతం సినిమాలు చేస్తున్నప్పటికీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మారిపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు నీలిమ రాణి. గుర్తుచ్చినట్లే ఉంది కానీ ఐడియా రావట్లేదు కదా! చెన్నైలో పుట్టి పెరిగిన ఈమె.. పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైంది. స్కూల్ చదువుతున్నప్పుడే ఈమెకు ఛాన్సులొచ్చాయి. అలా తెలిసీ తెలియని వయసులోనే చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించింది. కమల్ హాసన్ 'క్షత్రియ పుత్రుడు' చిత్రంతో అరంగేట్రం చేసింది. (ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) దాదాపు పదేళ్ల గ్యాప్‌లో చైల్డ్ ఆర్టిస్టుగా నాలుగు సినిమాలు చేసిన నీలిమ.. ఆ తర్వాత రూట్ మార్చింది. సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. 2003 నుంచి మొదలుపెడితే స్టిల్ ఇప్పటికీ అటు సినిమాలు ఇటు సీరియల్స్‌లో నటిస్తూనే ఉంది. నటి,నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్టు, హోస్ట్.. ఇలా డిఫరెంట్‌గా క్రేజ్ సంపాదించింది. కెరీర్ మొత్తంలో ఈమెకు విలన్ తరహా పాత్రలు బాగా పేరు తెచ్చాయని చెప్పొచ్చు. కార్తీ 'నా పేరు శివ', విశాల్ 'పొగరు' లాంటి సినిమాలు చూస్తే మీకు ఈమె కనిపిస్తుంది. అలానే తెలుగులో 'వసుంధర', 'ఇది కథ కాదు', 'తాళి కట్టు శుభవేళ' లాంటి సీరియల్స్‌లోనూ నీలిమ సందడి చేసింది. వ్యక్తిగత జీవితానికి వస్తే.. తమిళ సినిమాల్లోనే అసోసియేట్ డైరెక్టర్‌గా చేస్తున్న ఎసాయి వానన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమెకు ప్రస్తుతం ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే చాలారోజుల తర్వాత ఈమె ఫొటో, సోషల్ మీడియాలో కనిపించడంతో తొలుత మనోళ్లు గుర్తుపట్టలేకపోయారు. ఐడియా వచ్చిన తర్వాత ఈమె ఆమెనే కదా అని మాట్లాడుకున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) View this post on Instagram A post shared by Neelima Rani (@neelimaesai) -
Dr. Neelima Arya: ‘షి నీడ్స్’ నీలిమ!
ఉరుకుల పరుగుల జీవితంలో మన ప్రయాసలే కనిపిస్తాయి. ఒకసారి ఆగి చుట్టూ చూస్తే.. ఇన్నాళ్లూ మనం మన కోసమే తప్ప చుట్టూ ఉన్న వారి సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదనే స్పృహ కలుగుతుంది. కొందరు మనకెందుకులే అని మళ్లీ తమ పనుల్లో మునిగిపోతారు. డాక్టర్ నీలిమా ఆర్య లాంటివాళ్లు మాత్రం సున్నితమైన సమస్యలపై దృష్టి పెట్టి వాటికి సరైన పరిష్కారాలు వెదుకుతారు. హైదరాబాద్ వాసి నీలిమా ఆర్య నిరుపేద అమ్మాయిలకు లో దుస్తులను అందిస్తూ, శుభ్రతపైన అవగాహన కల్గిస్తూ వారి భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేస్తున్నారు. ఏడాదిలో రెండు లక్షల మంది అమ్మాయిలకు లో దుస్తులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నీలిమా ఆర్యను కలిసినప్పుడు ఆమెకు వచ్చిన ఈ ఆలోచన గురించి ఇలా పంచుకున్నారు. ‘‘మా సొంతూరు బాపట్ల. అమ్మానాన్నలకు పెద్ద కూతురిని. ఇంగ్లీష్ లిటరేచర్‌లో మాస్టర్స్ చేశాను. మా నాన్నగారు ఆర్మీ ఉద్యోగి కావడంతో నా చదువు అంతా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా భోపాల్‌లో జరిగింది. చదువు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చాం. ఇక్కడ పదేళ్లపాటు ఇంగ్లిష్ లెక్చరర్‌గా వర్క్ చేశాను. ఆ తర్వాత తిరిగి భోపాల్‌కి వెళ్లాను. అక్కడ నుంచి సౌదీ గవర్నమెంట్‌కు ఆంగ్ల ప్రొఫెసర్‌గా వర్క్ చేశాను. ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి, మీడియా రంగంలో ఉండటంతో చాలా సామాజిక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. సమాజానికి నా వంతుగా ఏదైనా చేయాలనే తపన అప్పుడే మొదలైంది. అమ్మానాన్నల దేశ సేవ స్ఫూర్తి కూడా నాలో ఉండటం అందుకు కారణమై ఉంటుంది. ► ఐదు ప్రాజెక్ట్స్‌తో సేవా రంగం ఐదేళ్ల క్రితం ఐదు ప్రాజెక్ట్స్‌తో ‘యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా’ ఫౌండేషన్‌ను ప్రారంభించాను. దీంట్లో భాగంగా ఎవరూ ఆకలితో పడుకోకూడదు అనే ఆలోచనతో మొదటిది ఫీడ్ ద నీడ్ ప్రాజెక్ట్ చేశాను. రోడ్‌సైడ్ ఫ్రిడ్జ్‌లను ఏర్పాటు చేసి, నిరుపేదలకు ఆహారం అందేలా ఏర్పాటు చేశాం. ఆ తర్వాత ‘షీ నీడ్’ ద్వారా ముఖ్యంగా గ్రామీణ అమ్మాయిలకు, మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందజేశాం. ‘మిషన్ భద్రత’ పేరుతో ఒక్కో సెట్లో ఆరు నాణ్యమైన ఫ్యాబ్రిక్‌తో తయారుచేసిన లో దుస్తులను ఉంచి, ఏడాది నుంచి నిరుపేద అమ్మాయిలకు అందజేస్తున్నాం. వచ్చే ఏడాది వరకు రెండు లక్షల మంది అమ్మాయిలకు లో దుస్తులను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రముఖ డిజైనర్ రవిత మేయర్ ఈ లో దుస్తులను డిజైన్ చేస్తున్నారు. కొన్ని సేవాసంస్థల సహకారంతో ఇండియా మొత్తంలో ఎవరికి అవసరం ఉందో గుర్తించి, వారికి లో దుస్తులను అందజేస్తాం. వీటితర్వాత రైతులు, నిరుద్యోగులు, వయసుపైబడినవారి కోసం సాయం అందించాలనేది మా ఉద్దేశ్యం. ► లో దుస్తుల ప్రాముఖ్యత.. నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని, వారికి అత్యవసరంగా కావాల్సినవి ఏమిటి అనే ఆలోచనలు ఎప్పుడూ చేస్తుంటాం. షీ నీడ్ ప్రాజెక్ట్ లో భాగంగా భవన నిర్మాణాలు జరిగే చోట, స్లమ్స్‌లలో, కూలీల పిల్లలను చూసినప్పుడు వారికి లో దుస్తుల సమస్య ఉన్నట్టు గుర్తించాం. 3 నుంచి 13 ఏళ్ల అమ్మాయిల వరకు లో దుస్తుల గురించి సరైన అవగాహన చేయగలిగితే వారిలో పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీనిద్వారా భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించగలం. అలాగే, శానిటరీ ప్యాడ్స్ వాడాలన్నా సరైన లో దుస్తులు ఉండాలి. నిజానికి గ్రామీణ అమ్మాయిలు, మహిళలకు సురక్షితమైన శానిటరీ ప్యాడ్స్, లో దుస్తులు అందుబాటులో ఉండవు. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు క్షేమంగా ఉంటుందనే విషయాన్ని మనం విస్మరించకూడదు. ఈ విషయాన్ని పదే పదే ఆ కుటుంబాలకు తెలియజేయడానికి కూడా ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. ►సాధికారతలో భాగంగా.. ఆర్య రసోయి–క్లౌడ్ కిచెన్ ద్వారా శాకాహార, మాంసాహార వంటకాలను అందిస్తున్నాను. ఎడ్యుకేటర్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా, ఆంట్రప్రెన్యూర్‌గా, ఇద్దరు పిల్లల తల్లిగా నా బాధ్యతలు కొనసాగిస్తూనే సమాజానికి నా వంతు సహకారాన్ని అందించాలనే లక్ష్యంతో కొనసాగతున్నాను. ధనం కన్నా ముందు జీవితాన్ని క్రమశిక్షణాయుతంగా మలుచుకోవడంలోనే విజయం దాగుంది అని నమ్ముతాను. ఆ క్రమశిక్షణే నన్ను నడిపిస్తుందని నమ్ముతాను’ అని వివరించారు నీలిమా ఆర్య. – నిర్మలారెడ్డి -
హ్యాపీ జర్నీ
సంక్రాంతి సెలవులు పూర్తయ్యాయి. స్కూళ్లు తిరిగి మొదలయ్యాయి. వేసవి సెలవుల కోసం ఎదురు చూపులూ మొదలయ్యాయి. పరీక్షలు పూర్తవడమే తరువాయి, ఓ వారమైనా ఎటైనా వెళ్లి వస్తే తప్ప మనసు రీచార్జ్ కాదు. కొత్త ఏడాదికి సిద్ధం కాదు. ఇదిలా ఉంటే కరోనా వచ్చింది, వెళ్లింది, మళ్లీ వచ్చింది, వెళ్లింది. వేవ్‌ల నంబరు పెరుగుతోంది. మరో వేవ్‌కి సిద్ధంగా ఉండమనే సూచనలు షురూ అవుతున్నాయి. ఇలాంటప్పుడు ‘క్షేమంగా వెళ్లి, సంతోషంగా రావాలి’ అంటే ఏం చేయాలి? దేశవిదేశాల్లో విస్తృతంగా పర్యటించిన హైదరాబాద్, సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ నీలిమ... కరోనా జాగ్రత్తల గురించి సాక్షితో పంచుకున్న వివరాలివి. వర్క్ ఫ్రమ్ వెకేషన్! ‘‘కరోనా నా ట్రావెల్ లైఫ్‌ను పెద్ద మలుపు తిప్పింది. నేను 2015 నుంచి కరోనా లాక్డౌన్ వరకు 60 దేశాల్లో పర్యటించాను. ఇండియా టూర్ వార్ధక్యం వచ్చిన తర్వాత అనుకునేదాన్ని. లాంగ్ వీకెండ్ వస్తే ఏదో ఒక దేశానికి వెళ్లిపోయేదాన్ని. కరోనాతో విదేశాలకు విమాన సర్వీసులు నిలిపి వేయడంతో మనదేశంలో పర్యటించడం మొదలుపెట్టాను. ఈశాన్య రాష్ట్రాలు, రాజస్థాన్ మినహా ఇండియాని దాదాపుగా చూసేశాను. ఈ సంక్రాంతికి కూడా ఓ వారం అనుకుని వెళ్లిన పాండిచ్చేరి వెకేషన్‌ని నెలకు పొడిగించుకున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్‌ని వర్క్ ఫ్రమ్ వెకేషన్‌గా మార్చుకున్నాను. నేను చూసినంత వరకు జనంలో కరోనా భయం దాదాపుగా పోయిందనే చెప్పాలి. దేశంలో 99 శాతం వ్యాక్సిన్ వేయించుకున్నారు. కో మార్బిడ్ కండిషన్ ఉన్న వాళ్లు డాక్టర్ సలహా తీసుకుని బూస్టర్ డోస్ కూడా వేయించుకున్న తర్వాత మాత్రమే టూర్లు ప్లాన్ చేసుకోవడం మంచిది. ఈ సమస్యలు లేని వాళ్లయితే ఏ మాత్రం సందేహం లేకుండా పర్యటనలు చేస్తున్నారు. అనేక పర్యాటక ప్రదేశాల్లో మాస్క్ లేకపోతే ప్రవేశం లేదనే బోర్డులున్నాయి, కానీ మాస్క్ నిబంధన మీద పట్టింపుగా కనిపించలేదు. అలాగని నిర్లక్ష్యం చేయకుండా రద్దీ ఉన్న చోట్ల తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే. ప్రకృతి పిలుస్తోంది! కరోనా భయం ఓ పక్క వెంటాడుతూనే ఉంది, కాబట్టి పర్యటనలకు ప్రకృతి ఒడినే ట్రావెల్ డెస్టినేషన్‌గా మార్చుకోవడం మంచిది. జలపాతాలు, సముద్ర తీరాలు, నదీతీరాలు, ట్రెకింగ్, స్కీయింగ్ జోన్లను ఎంచుకోవాలి. ఈ ప్రదేశాల్లో మనుషుల రద్దీ తక్కువగా ఉంటుంది. మాస్కు లేకుండా హాయిగా విహరించగలిగిన ప్రదేశాలివి. హిమాలయాల్లో ట్రెకింగ్‌కి మంచి లొకేషన్లున్నాయి. స్పితి వ్యాలీ, త్రియుండ్ కుండ్, కీర్‌గంగ, రూప్‌కుండ్, బ్రిబ్లింగ్, థషర్ మషర్ ట్రెక్, బ్రమ్‌తాల్, పిన్ పార్వతి, హమ్తా పాస్ ట్రెక్‌లను దాదాపుగా అందరూ చేయవచ్చు. యూత్‌కి హిమాలయాల్లో పన్నెండు రోజులపాటు సాగే సర్పాస్ ట్రెక్ మంచి థ్రిల్‌నిస్తుంది. నేను కశ్మీర్– గుల్మార్గ్, ఉత్తరాఖండ్– ఔలిలలో ఐస్‌స్కీయింగ్, ఆరోవిల్లెలో సర్ఫింగ్ కరోనా విరామాల్లోనే చేశాను. చార్‌థామ్ యాత్రలో నాకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు, కానీ యాత్ర ముగించుకుని ఫ్లయిట్ ఎక్కిన తర్వాత భయం వేసింది. ఆ టూర్ అంతటిలో తుమ్ములు, దగ్గులు వినిపించింది ఫ్లయిట్లోనే. శాంతియాత్ర లాక్డౌన్ విరమించిన తర్వాత నా ట్రావెల్ లిస్ట్‌లో ఈజిప్టు, టర్కీ దేశాలు చేరాయి. పాండిచ్చేరి బీచ్‌లో సర్ఫింగ్, ఆరోవిల్లెలో మెడిటేషన్ నాకు అత్యంత సంతోషాన్నిచ్చాయి. జీవితంలో శాంతికంటే మరేదీ ముఖ్యంకాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అందుకే అరోవిల్లెకి మరో లాంగ్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నాను. ఆ తర్వాత యూఎస్‌కి వెళ్లి నా వందదేశాల టార్గెట్‌ని పూర్తి చేయాలనేది కోరిక’’ అని చెప్పారు గమనంలోనే గమ్యాన్ని వెతుక్కుంటున్న నీలిమ. వర్క్ చేస్తూ వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నారామె. ఇలాంటి పర్యాటక ప్రియుల వల్లనే ‘వర్కేషన్’ అనే పదం పుట్టింది. కేర్‌ఫుల్‌గా వెళ్లిరండి! కరోనా జాగ్రత్తలు పాటిస్తూ చేతులను తరచు శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటూ, ఆహారపానీయాల పరిశుభ్రత పాటిస్తూ హాయిగా పర్యటించవచ్చనేది నా అభిప్రాయం. అయితే పర్యాటక ప్రదేశాల్లో షాపింగ్ కోసం మార్కెట్లలో ఎక్కువ సేపు గడపకపోవడమే శ్రేయస్కరం. నేను గమనించిన ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే... కాశీ అనగానే అది అరవై దాటిన తర్వాత వెళ్లే ప్రదేశం అనుకునే దాన్ని, ఇటీవల అది యూత్ ట్రావెల్ డెస్టినేషన్ అయింది. అక్కడ డిఫరెంట్ వైబ్స్ ఉన్నాయి. – పొనుగోటి నీలిమారెడ్డి, ట్రావెలర్ – వాకా మంజులారెడ్డి -
సమంత ‘శాకుంతలం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
డైరెక్టర్ గుణశేఖర్ కూతురు నీలిమ రిసెప్షన్ వేడుక ( ఫొటోలు)
-
ఘనంగా గుణశేఖర్ కుమార్తె వివాహం.. ఫోటోలు వైరల్
ప్రముఖ దర్శక-నిర్మాత గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో శుక్రవారం రాత్రి 12 గంటల 31 నిమిషాలకు (తెల్లవారితే శనివారం)ఈ పెళ్లి జరిగింది. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ విద్య, వ్యాపారవేత్త, శ్రీ శక్తి అధినేతలు డా. రామకృష్ణ పింజల, సత్య పింజల కుమారుడు, వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతో నీలిమ గుణ ఏడడుగులు వేశారు. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రుద్రమదేవి సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించిన నీలిమ శాకుంతలం(సమంత లీడ్ రోల్లో నటించారు)సినిమాతో నిర్మాతగా మారారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పెళ్లికూతురిలా ముస్తాబైన గుణశేఖర్ కూతురు.. ఫోటోలు వైరల్
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కూతురు నీలిమ గుణ పెళ్లి కూతురిలా ముస్తాబైంది. మరికాసేపట్లో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. నేడు(శుక్రవారం)ఫలక్ నుమా ప్యాలెస్‌లో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. రవి ప్రఖ్యా అనే బిజిమెన్మ్యాన్ను నీలిమ వివాహం చేసుకోనుంది. ఇటీవలె వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో గ్రాండ్‌గా జరిగింది. కాగా నీలిమ గుణ కూడా సినీ రంగంపై ఆసక్తితో నిర్మాతగా మారారు. తన తండ్రి గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమ దేవి సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న శాకుంతలం సినిమాను నీలిమ నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. -
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడి ఇంట్లో శుభకార్యం
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడి ఇంట్లో పెళ్లి గంట మోగింది. ఆయన పెద్ద కుమార్తె నీలిమ త్వరలోనే వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నారు. నీలిమ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. రవి ప్రక్యా అనే అబ్బాయితో ఏడడుగులు నడవనుంది. ఈ వేడుకలో వారి కుటుబసభ్యులు, ప్రముఖ సినీనటులు హాజరయ్యారు. ఈ విషయాన్ని గుణశేఖర్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. నీలిమ సైతం తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'నా జీవిత ప్రయాణం మొదలైంది' అంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో నీలిమ నిర్మాతగా మారారు. గతంలో గుణశేఖర్ తెరకెక్కించిన ‘రుద్రమ దేవి’కి చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన ఆమె.. ప్రస్తుతం ‘శాకుంతలం’ చిత్రానికి నిర్మాతగా చేస్తున్నారు. Today marks a special day to us as we celebrate the Lagnapatrika of my elder daughter @neelima_guna with #RaviPrakhya best wishes to this couple 💐 https://t.co/XIRCLkQFJK — Gunasekhar (@Gunasekhar1) October 8, 2022 💛✨ the beginning of forever ✨💛#RaviPrakhya #NeelimaGuna pic.twitter.com/C7IyaoW7Vg — Neelima Guna (@neelima_guna) October 8, 2022 -
డాక్టర్ నీలిమపై ఎందుకంత ప్రేమ?
అనంతపురం: అనంతపురం మెడికల్ కళాశాల డెర్మటాలజీ విభాగంలో వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్న చల్లా నీలిమ బదిలీ ఉత్తర్వుల అమలులో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలంటూ ఆమెను రిలీవ్ చేయడం లేదు. గత నెల 17న జరిగిన బదిలీల్లో చల్లా నీలిమను విశాఖపట్నానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మళ్లీ ఆమెకు అందించిన ఉత్తర్వులను రద్దు చేసి, తిరిగి అనంతపురానికి కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి అనంతపురంలో డెర్మటాలజీ పోస్టు గత నెల 20న ఖాళీ కాగా.. ఇదే పోస్టులో నీలిమను నియమిస్తూ గత నెల 17వ తేదీనే ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలా నియమిస్తారంటూ అర్హులైన వైద్యులు విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఉన్నతాధికారులను ప్రశ్నించారు. దీంతో ఆమెకు అందించిన ఉత్తర్వులను రద్దు చేశారు. అనంతపురం మెడికల్ కళాశాల నుంచి వెంటనే రిలీవ్ చేయాలని గత నెల 27న డీఎంఈ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: (అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం) కానీ ఆమెను అనంతపురం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మైరెడ్డి నీరజ రిలీవ్ చేయడం లేదు. దీని వెనుక మతలబు ఏమిటో అర్థం కావడం లేదు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా... నీలిమను రిలీవ్ చేయొద్దని ఉన్నతాధికారులు మౌఖికంగా తెలిపారని సమాధానమిచ్చారు. లిఖిత పూర్వక ఉత్తర్వులను అమలు చేయాల్సిన ప్రిన్సిపాల్.. మౌఖిక ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
ఆ దంపతులేమయ్యారు?.. దారి తప్పారా లేక మరేదైనా..!
సాక్షి, ప్రొద్దుటూరు: ఎగువ అహోబిలంలో కనిపించకుండా పోయిన దంపతుల కోసం పోలీసులు విస్తతంగా గాలిస్తున్నారు. ప్రొద్దుటూరు మండలంలోని నంగనూరుపల్లెకు చెందిన పల్లెబోయిన నరసింహులు, నీలిమా అనే దంపతులు ఈ నెల 21న కర్నూలు జిల్లాలోని అహోబిలం క్షేత్రానికి వెళ్లి కనిపించకుండా పోయారు. మూడు రోజులైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు 23న ఆళ్లగడ్డ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఎగువ అహోబిలం సమీపంలోని కారంజ నరసింహస్వామి ఆలయం సమీపంలో నరసింహులుకు చెందిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దంపతులిద్దరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లి దారి తప్పి తప్పారా లేక మరేదైనా జరిగి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో దంపతుల అదృశ్యానికి సంబంధించిన సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందించారు. వారి సాయంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చదవండి: (వదినతో వివాహేతర సంబంధం.. అన్నకు తెలిసి..) ప్రతి నెలా అహోబిలం వెళ్లేవారు.. నంగనూరుపల్లె గ్రామానికి చెందిన నరసింహులు ప్రొద్దుటూరులోని కోనేటికాల్వ వీధిలో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. వారికి సంతానం లేదు. గతంలో చీరల దుకాణం ఉండగా కొన్ని నెలల క్రితం మరొక రెడిమేడ్ షాపును ప్రారంభించారు. రెండు షాపుల నిర్వహణ బాధ్యతలను భార్యాభర్తలే చూసుకునేవారు. గతంలో ఇంట్లోనే బట్టల వ్యాపారం చేస్తుండగా ఏడేళ్ల నుంచి కోనేటికాల్వ వీధిలో ఇల్లు బాడుగకు తీసుకొని వ్యాపారం చేస్తున్నారు. షాపు నిర్వహిస్తున్న ఇంటిపైనే నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు మాత్రం నంగనూరుపల్లెలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. దంపతులిద్దరూ ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజున అహోబిలం వెళ్తుంటారు. ముందు రోజు రాత్రి వెళ్లి దర్శనం ముగించుకొని మరుసటి రోజు రాత్రికి ఇంటికి వచ్చేవారు. ఈ క్రమంలో ఈ నెల 21న బైక్‌లో నరసింహులు, నీలిమా అహోబిలం వెళ్లారు. ఇప్పటివరకు ఇంటికి రాకపోవడంతో దుస్తుల కొనుగోలుకు వెళ్లారేమోనని కుటుంబ సభ్యులు భావించారు. ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజు అహోబిలం వెళ్తారని గుర్తుకు వచ్చి అక్కడికి వెళ్లి గాలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగు రోజులైనా వారి జాడ కనిపించకపోవడంతో గ్రామంలోని బంధువులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: (పెళ్లైన యువకుడి నిర్వాకం.. బిడ్డకు జన్మనిచ్చిన..) ఆర్థిక సమస్యలపైన అనుమానం.. వ్యాపారం కోసం నరసింహులు అనేక మంది వద్ద అప్పు తీసుకున్నట్లు గ్రామంలో చర్చ జరుగుతోంది. స్వగ్రామంలోనే అప్పులిచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. బాకీలు రూ. కోట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా రెండు బట్టల షాపులు మూసి ఉండటంతో అప్పులిచ్చిన వారు నంగనూరుపల్లెలోని నరసింహులు ఇంటి వద్దకు వెళ్తున్నారు. వారికి జవాబు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతనికి ఆర్థిక సమస్యలు ఉన్న విషయాన్ని కూడా కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ పోలీసులకు తెలిపారు. ఈ కోణంలో పోలీసు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
సమంత తల్లి కావాలనుకుంది కానీ.. సంచలన నిజాలు వెల్లడించిన నీలిమ
నాగచైతన్య, సమంత తమ వైవాహిక జీవితానికి ఫుల్స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమంతపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. సామ్ పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని.. ఇప్పటికే రెండు సార్లు అబార్షన్ చేయించుకుందని..అందుకే చైతన్య విడాకులు ఇచ్చాడనే పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీటిపై సమంత సీరియస్ అయింది. ‘నన్ను కొందరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, నాకు అఫైర్స్ ఉన్నాయని, అబార్షన్స్ చేయించుకున్నానని, నేను అవకాశవాదినని అంటున్నారు. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతో కూడుకున్నది. కొంత స్వాంతన పొందడానికి నన్ను ఒంటరిగా వదిలేయండి’ అని సామ్ విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉంటే.. చై-సామ్ విడాకులపై ‘శాకుంతలం’ నిర్మాత నీలిమ గుణ షాకింగ్ విషయాలను వెల్లడిచింది. సమంత పిల్లల్ని కనేందుకు అంతా సిద్దం చేసుకుందని, కానీ ఆగస్ట్ నెలలోనే ఏదో జరిగి విడాకులు తీసుకున్నారని చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. చై-సామ్ విడాకులపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. (చదవండి: అఫైర్స్, అబార్షన్ వార్తలపై స్పందించిన సమంత) ‘శాకుంతలం సినిమా కోసం మా నాన్న(దర్శకుడు గుణశేఖర్) సమంతను సంప్రదించాడు. అయితే అప్పటికే ఆమె సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయింది. ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నామని, ఇప్పట్లో మూవీ చేయనని చెప్పింది. కానీ, శాకుంతలం కథ నచ్చడంతో కొన్ని కండిషన్స్ పెట్టి ఓకే చెప్పింది. త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చెప్పింది. ఈ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకోవాలని సమంత నిర్ణయం తీసుకుంది. ఆమె తల్లి కావాలని కోరుకుంది. జూలై, ఆగస్ట్‌లోకెల్లా షూటింగ్ పూర్తిచేయాలని సామ్ కోరడంతో.. మేము ఓకే చెప్పి అలానే ప్లాన్ చేసుకున్నాం. ఆమె సినిమాలకు విరామం ఇచ్చి, పిల్లల్ని కనేందుకు ప్లాన్ చేసుకుంది. తన ప్రాధాన్యత అదేనని చెప్పింది. కానీ ఇప్పుడు చై-సామ్‌లు విడిపోవడం షాకింగ్‌గా ఉంది’ అని నీలిమా చెప్పుకొచ్చింది. -
ఇండియా చేరుకున్న కౌశల్ భార్య.. ' జై పారాసిటమాల్' అంటూ..
బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయిన నటడు కౌశల్ మండా. అప్పటివరకు బుల్లితెరపై యాంకర్‌గా, నటుడిగా గుర్తింపు పొందినా బిగ్‌బాస్‌తో ఎనలేని క్రేజ్ దక్కించుకున్నాడు. బిగ్‌బాస్ రెండో సీజన్లో విన్నర్‌గా నిలిచి లక్షలాది మంది అభిమాలను సంపాదించుకున్నాడు. షో నుంచి బయటకు వచ్చాక ‘కౌశల్ ఆర్మీ’పేరుతో కొన్ని రోజులు వార్తల్లో కూడా నిలిచాడు. ఆ తర్వాత కాంట్రవర్సి లను కూడా ఎదుర్కొన్నాడు. ఇటీవల భార్య నీలిమ ఆరోగ్యంపై కౌశల్ చేసిన పోస్టులు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నీలిమ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. యూకేలో ఉద్యోగం చేస్తున్నానని, ఆ సమయంలో తాను కోవిడ బారినపడినట్లు నీలిమ పేర్కొంది. అయితే అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, తనకు సరైన ట్రీట్మెంట్ అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి వైద్య సిబ్బంది తనకు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ మాత్రమే ఇచ్చారని వివరించింది. దీంతో నీలిమ త్వరగా కోలుకోవాలంటూ కౌశల్ అభిమానులు సహా పలువరు నెటిజన్లు కోరుకున్నారు. తాజాగా నీలిమ కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ వచ్చిన 8వ రోజే తనకు నెగిటివ్ రావడంతో ఆమె వెంటనే ఇండియాకు చేరుకున్నారు. ఈ విషయాన్ని కౌశల్ దృవీకరించారు. నేషనల్ హెల్త్ సర్వీసెస్( NHS )నుంచి తనకు సర్టిఫికెట్ వచ్చింది. దీంతో నీలిమ భారత్‌కు చేరుకుంది. మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు..జై పారాసిటమాల్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి నీలిమ సైతం కృతఙ్ఞతలు తెలిపారు. ఇక కౌశల్ పోస్టుతో అతని అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) చదవండి : బిగ్‌బాస్ ఫేమ్ నోయల్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా? ఇండియాలో కన్నా ఇక్కడే దారుణం: కౌశల్ భార్య -
సరైన వైద్యం లేదు, పరిస్థితి దారుణం: కౌశల్ భార్య
కౌశల్ మండా.. బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అతడు ఇటీవల తన భార్య నీలిమ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. 'ఏదో సాధించాలని వెళ్లిపోయావు.. ఏదో ఒకటి సాధించాలని జీవితంతో పోరాడుతున్నావు, నీకున్న ధైర్యంతో అది సాధిస్తావని తెలుసు, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా, లవ్ యూ, మిస్ యూ నీలిమ' అంటూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టాడు. దీంతో కౌశల్ భార్యకు ఏమైందంటూ అభిమానులు కలవరపడ్డారు. ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నీలిమ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసింది. "నేను యూకేలో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడ పనిచేసే చోట ఏడు రోజుల క్రితం నాకు కరోనా సోకింది. ఇండియాలో చాలా దారుణమైన, భయంకర పరిస్థితులు ఉన్నాయని అనుకుంటారు. కానీ ఇక్కడే ఘోరంగా ఉంది. కోవిడ్ పాజిటివ్ అని తేలాక శ్వాస సమస్యలు ఎదురయ్యాయి. ఛాతీలో నొప్పితో పాటు ఆయాసం కూడా వచ్చింది. నా పరిస్థితి బాగోలేదు, ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని చెప్తే వారు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ మాత్రమే ఇచ్చారు. పెద్దగా పట్టించుకోలేదు" "నిజానికి యూకేలో ట్రీట్మెంట్ గొప్పగా ఉంటుందనుకున్నా, కానీ ఇది నిజంగా ఓ చేదు అనుభవం. ఎమర్జెన్సీ అనగానే ఇండియాలో త్వరగా అడ్మిట్ చేసుకుని వైద్యం అందిస్తారు. కానీ ఇక్కడలా కాదు. ఈ విషయంలో నాకు చాలా భయమేసింది. ఇండియాలోనే కరోనాకు మంచి వైద్యం అందిస్తారు. కాబట్టి మీరెవరూ భయపడొద్దు. మీ అందరి ప్రార్థనల వల్ల ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. ఆక్సిమీటర్‌తో నా పల్స్ చెక్ చేసుకుంటున్నాను. నేను త్వరలోనే భారత్‌కు తిరిగొస్తాను" అని నీలిమ చెప్పుకొచ్చింది. చదవండి: భార్యపై కౌశల్ ఎమోషనల్ పోస్ట్.. అభిమానుల ఆందోళన Nikhil: తొమ్మిది సార్లు ప్రయత్నించినా విఫలం.. నిఖిల్ ఆసహనం -
నెల రోజుల్లోనే కి‘లేడీ’ చేతివాటం
అచ్చుగుద్దినట్లు ఫోర్జరీ సంతకాలతో దాదాపు రూ.42 లక్షలు స్వాహా చేసిన కి‘లేడి’ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన మండల కేంద్రమైన బుచ్చిరెడ్డిపాళెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ వైద్యశాలలో 2017 జూన్ నెలలో జూనియర్ అసిస్టెంట్‌గా నీలిమ అనే మహిళ చేరింది. విధుల్లో చేరిన నెల నుంచే తన చేతివాటాన్ని ప్రదర్శించింది. ఇక్కడికి రాక ముందు నెల్లూరులోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్న ఆమెను బుచ్చిరెడ్డిపాళెం సీహెచ్‌సీకి బదిలీ చేశారు. అనంతరం అక్కడి లోపాలను తెలుసుకున్న ఆమె తనకు తిరుగులేదని గ్రహించి ప్రభుత్వ నిధులపై కన్నేసింది. నిధుల దోపిడీకి పాల్పడింది. ('బాధ్యులెవరో త్వరలోనే తేలుతుంది') విడవలూరు (బుచ్చిడ్డిపాళెం): నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం సామాజిక ఆరోగ్య కేంద్రానికి మూడు ఖాతాల నుంచి ప్రభుత్వ నిధులు జమవుతుంటాయి. అందులో బుచ్చిరెడ్డిపాళెంలోని ఆంధ్రాబ్యాంకులో డీడీఓ ఖాతా ఉంది. ఈ ఖాతాలోకి వైద్యులు, ఇతర ఉద్యోగుల జీతభత్యాలు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ తదితర నిధులు వస్తుంటాయి. అలాగే బుచ్చిరెడ్డిపాళెంలోని సిండికేట్ బ్యాంకులో హెచ్‌డీఎస్ ఖాతా ఉంది. ఈ ఖాతాలో వైద్యశాలకు చెందిన పరికరాలు, పారిశుద్ధ్యం, మందులు, అత్యవసర పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి నిధులు వస్తుంటాయి. అలాగే అదే బ్యాంకులో ఉన్న ఎన్‌ఆర్‌హెచ్‌ఎంఎస్ ఖాతాలకు కాన్పులు చేయించుకున్న మహిళలకు, ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న వారికి, ఆశా కార్యకర్తలకు ఇచ్చే పారితోషకం కింద నిధులు వస్తుంటాయి. ఈ మూడు ఖాతాల నుంచి జూనియర్ అసిస్టెంట్ నీలిమ దాదాపు రూ.42 లక్షలు మింగేసింది. ముఖ్యంగా డీడీఏ ఖాతా నుంచి రూ.30 లక్షలు, హెచ్‌డీఎస్ ఖాతా నుంచి రూ.9.6 లక్షలు, ఎన్‌ఆర్‌హెచ్‌ఎంఎస్ ఖాతా నుంచి రూ.2.4 లక్షలను స్వాహా చేసినట్లు విచారణలో బయటపడింది. తీగ లాగితే కదిలిన డొంక ఏడాదిగా వైద్యశాలలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఆడిట్ కోసం పలు రికార్డులను పరిశీలించాలని, వాటిని తీసుకురావాలని వైద్యశాల సూపరింటెండెంట్ ఖాదర్‌బాషా నీలిమను ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అడుగుతున్నాడు. అయితే అప్పటికే దాదాపు లక్షల రూపాయలు స్వాహా చేసిన నీలిమ పలుమార్లు రికార్డులు తన వద్ద లేవని, డీహెచ్ఎంఎస్ కార్యాలయంలోని ఫైనాన్స్ ఆఫీసర్ వద్ద ఉన్నాయని తెలిపింది. కొన్నిసార్లు రికార్డుల్లో కొన్ని జమ చేయలేదని, వాటిని జమ చేసి త్వరలోనే ఇస్తానని కాలయాపన చేసింది. అయితే మార్చి నెలలో వైద్యశాలలో జరిగిన సాధారణ సమావేశంలో నీలిమపై ఉద్యోగులంతా పలు అంశాలపై ఫిర్యాదు చేయడంతో ఆమెకు మెమో కూడా ఇచ్చారు. అయితే ఇంతవరకు ఆ మెమోకి సమాధానం ఇవ్వలేదు. మార్చి అనంతరం కరోనా నివారణ చర్యల్లో అధికారులంతా నిమగ్నమై ఉండడంతో తనను ఇక అడగరని భావించిన నీలిమ నకిలీ బ్యాంకు స్టేట్మెంట్లను సృష్టించింది. అంతేకాకుండా వాటిని ప్రభుత్వానికి చెందిన ఈ–మెయిల్లో భద్రపరచాల్సి ఉండగా, తన వ్యక్తిగత ఈ–మెయిల్లో భద్రపరచుకుని అధికారులకు చూపింది. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు ఖాదర్‌బాషా ఆమె వ్యవహార శైలిపై నిఘా ఉంచారు. తమ జీతాలకు సంబంధించిన డీడీఓ ఖాతాను పరిశీలించగా అక్కడ నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ముఖ్యంగా తమ జీతాల నుంచి ఆదాయపన్ను, జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌కు నిధులు పంపాల్సిన బాధ్యత నీలిమపై ఉంది. అయితే ఇక్కడ నకిలీ చలానాలను సృష్టించి ఆదాయపన్నుతోపాటు ఇతర పన్నులు కూడా చెల్లించానని నమ్మబలికేది. అయితే పన్ను చెల్లిస్తే తమ మొబైల్‌కు మెసేజ్ వస్తుందని పలుమార్లు ఉద్యోగులు నీలిమను అడిగినా ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకునేది. దీంతో వైద్యులు ఈ నెలలో నెల్లూరులోని బారకాస్ వద్ద ఉన్న ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించగా తమ బ్యాంకు నుంచి వైద్యశాలలోని ఉద్యోగుల పేరు మీద ఎలాంటి చలానాలు పంపలేదని తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు బుచ్చిరెడ్డిపాళెంలోని సిండికేట్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్ ఖాతాలపై కూడా విచారణ చేశారు. రూ.లక్షల్లో నిధులు డ్రా నీలిమ ఎప్పుడు పడితే అప్పుడు బ్యాంకుల వద్దకు వెళ్లి రూ.లక్షల్లో నిధులు డ్రా చేసేది. ముఖ్యంగా బ్యాంక్ చెక్కులను తీసుకుని నిధులు డ్రా చేసేది. బ్యాంక్ అధికారులు అంత మొత్తాన్ని చెల్లించే సమయంలో చెక్కుపై ఉన్న సంతకాన్ని కూడా చూడకుండా ఎలా చెల్లించారనే ప్రశ్న ఇప్పుడు తెర మీదకు వచ్చింది. కేవలం వారం వ్యవధిలోనే రెండుసార్లు రూ.లక్షల్లో డ్రా చేస్తున్నా బ్యాంక్ అధికారులు వైద్యశాల సూపరింటెండెంట్‌ను ఎందుకు సంప్రదించలేదనే ప్రశ్న తలెత్తుతోంది. అంతేకాకుండా సిండికేట్ బ్యాంక్‌లో ఉన్న ఎన్‌ఆర్‌హెచ్‌ఎంఎస్ ఖాతా నుంచి రూ.3.6 లక్షలు డ్రా చేసిన నీలిమ ఇటీవల కాలంలో తిరిగి రూ.1.9 లక్షలు తిరిగి జమ చేసింది. అయితే ఈ ఖాతాలో కేవలం ప్రభుత్వం నుంచి మాత్రమే నిధులు జమవుతాయి. వ్యక్తిగతంగా ఇందులో జమ చేసేందుకు వీలులేదు. కానీ నీలిమ ఈ ఖాతాలో నగదు ఎలా జమ చేసిందో బ్యాంక్ అధికారులకే తెలియాలి. ఫోర్జరీతో నిధులు స్వాహా నీలిమ అవినీతికి అడ్డులేకుండా పోయింది. ముఖ్యంగా వైద్యశాలకు చెందిన చెక్‌బుక్ అయిపోయిందని చెప్పి ముందుగానే బ్యాంక్‌లో తెలిపేది. వారు చెక్‌బుక్ పోస్టు ద్వారా వైద్యశాలకు పంపేవారు. అయితే ఈ చెక్‌బుక్ సూపరింటెండెంట్‌కు చేరకుండానే మధ్యలోనే ఆమె దానిని తీసుకుని వైద్యులకు మాత్రం ఇంకా చెక్‌బుక్ రాలేదని చెప్పేది. అనంతరం ఆ చెక్‌లపై వైద్యుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.లక్షలు స్వాహా చేయడంతో వైద్యులంతా విస్తుపోతున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి మూడు ఖాతాల నుంచి దాదాపు రూ.42 లక్షలు స్వాహా చేసిన జూనియర్ అసిస్టెంట్ నీలిమ అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి. అంతేకాకుండా ఫోర్జరీ సంతకాలతో ఇంత మొత్తం నగదును డ్రా చేసినందుకు ఆమెకు సహకరించిన వారిని కూడా ఉన్నతాధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే నీలిమ అవినీతిపై బుచ్చిరెడ్డిపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. – ఖాదర్‌బాషా, సూపరింటెండెంట్,బుచ్చిరెడ్డిపాళెం సీహెచ్‌సీ -
ఇమడలేకే లొంగిపోయాను!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు గతి తప్పాయని, ప్రజలకు దూరమైన మావోయిస్టులు వారిపైనే దాడులకు పాల్పడుతూ, అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారని ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు సత్వాజీ అలియాస్ సుధాకర్, అలియాస్ కిరణ్ అలియాస్ శశికాంత్ పేర్కొన్నారు. బుధవారం సుధాకర్ ఆయన భార్య అరుణ (అలియాస్ నీలిమ అలియాస్ మాధవి)తో కలసి డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయాడు. తాము లొంగిపోవడానికి కారణాలను సుధాకర్ మీడియాకు వివరించారు. ‘బిహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో ప్రజలకు పార్టీ పూర్తిగా దూరమైంది. అక్కడి పార్టీ శ్రేణుల్లో కుటుంబ పాలన, బంధుప్రీతి, అక్రమ వసూళ్లు పెరిగిపోయాయి. తెలంగాణలో మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పని చేసిన నాకు ఎక్కడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కానరాలేదు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా బిహార్, జార్ఖండ్‌లో పనిచేసిన సమయంలో అడుగడుగునా సిద్ధాంతాల ఉల్లంఘన కన్పించింది. తొలుత ఇది కిందిస్థాయి వరకే పరిమితమైందనుకున్నా.. అగ్రనాయకుల దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లా. వారికి కూడా అక్కడి అకృత్యాలపై నియంత్రణ లేదన్న సంగతి చాలా ఆలస్యంగా నాకు అర్థమైంది. పార్టీ విధానం మారాలని, ప్రజలకు దూరమవుతున్నామని పలుమార్లు సీనియర్లకు చెప్పి చూశాను. అయినా లాభం లేకపోయింది. పైగా ప్రజలపైనే దాడులు, వారి వద్దే అక్రమ వసూళ్లు నాలో కలత రేపాయి. పార్టీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో శారీరక వేధింపుల్లేవు. కానీ సంప్రదాయ సమాజంలో అనాదిగా వస్తున్న పితృస్వామ్యమే అక్కడా తిష్టవేసింది. దీనివల్ల మహిళా సభ్యులకు వివిధ రూపాల్లో ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోలీసులకు పట్టుబడ్డ సమయంలో మా సోదరుడి వద్ద దొరికిన రూ.25 లక్షలు పార్టీవే. దానికి అన్ని లెక్కలు పార్టీ అకౌంట్స్ వద్ద ఉన్నాయి. నేనెప్పుడూ నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం డబ్బు వసూళ్లకు పాల్పడలేదు. నన్ను పార్టీ సస్పెండ్ చేయలేదు. పార్టీ విధానాలు నచ్చకే తప్పుకొంటున్నట్లు ఏడాదిగా చెబుతున్నా. నా భార్యతో కలిసి బయటకి వస్తున్నట్లు లేఖ రాసి వచ్చా’అని వివరించారు. అనారోగ్యం, విభేదాలే కారణం: అరుణ పార్టీలో పలువురి ఆధిపత్య ధోరణి నచ్చకే తాము బయటికి వచ్చామని అరుణ వివరించారు. వాస్తవ సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకంగా పార్టీ నడుచుకుంటోందని, దీనిపైనే విభేదించే పార్టీని వీడినట్లు తెలిపారు. పార్టీలో మహిళలపై శారీరకంగా అఘాయిత్యాలు జరగట్లేదని, అయితే ఆధిపత్యం చెలాయించడం, ఒత్తిళ్లు చేయడం వల్లే పలువురు మహిళా మావోయిస్టులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. వేధింపులతోనే మహిళా మావోలు ఆత్మహత్యలు: డీజీపీ మావోయిస్టు పార్టీ బలహీనపడిందని, మిలీషియా సంఖ్య 500కు పడిపోయిందని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. అగ్రనేతల్లో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని పేర్కొన్నారు. మహిళా దళ సభ్యులపై అకృత్యాలు పెరిగిపోయినట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు. ఈ కారణంగానే పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అయితే ఇవేమీ ఇంతకాలం వెలుగుచూడలేదన్నారు. ‘సత్వాజీ లొంగుబాటు వెనుక చాలా పెద్ద తతంగమే నడిచింది. ఏడాది కింద అతడి సోదరుడు లొంగిపోయిన సమయంలోనే పార్టీ తీరుపై సెంట్రల్ కమిటీ సభ్యుడు సత్వాజీ అలియాస్ సుధాకర్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుసుకున్నాం. ఈ క్రమంలోనే ‘ఇంటర్ స్టేట్ పోలీస్ కో–ఆర్డినేషన్ అండ్ కో–ఆపరేషన్’లో భాగంగా తెలంగాణ పోలీసులు జార్ఖండ్ పోలీసులకు ఈ సమాచారాన్ని చేరవేసి వారి సహకారంతో సత్వాజీ లొంగుబాటు సఫలీకృతం చేయగలిగాం. మావోయిస్టు పార్టీ అధినాయకత్వంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కీలకమైన దండకారణ్యంలోనూ ముఖ్యనేతలు సోనూ, దేవూజీల మధ్య, స్థానిక గిరిజన నేతలకు తెలంగాణ నాయకులకు మధ్య విభేదాలున్నాయి. మావోయిస్టు అగ్రనేత సంబాల కేశవరావు భార్య రామక్క (అలియాస్ శారద) 2010లో వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంది. బస్తర్‌కు చెందిన డీవీసీఎం చందన, కమాండర్ చుక్కీ, కోదాడకు చెందిన దళ సభ్యురాలు గడ్డం భాగ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న వారిలో ఉన్నారు. పార్టీ విధానాలు గతి తప్పుతున్న క్రమంలో చాలామంది పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా మావోయిస్టుల్లో కొనసాగుతున్న వారు లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. సుధాకర్ దంపతులపై ఉన్న రివార్డు (సుధాకర్‌పై రూ.25 లక్షలు, అరుణపై రూ.10 లక్షలు) మొత్తం రూ.35 లక్షలను వీరికే ఇస్తాం. ఆ డబ్బుతో వీరు కొత్త జీవితం మొదలుపెట్టొచ్చు. ఇక ఇతనిపై ఉన్న ఎన్ఐఏ కేసు మాత్రం సుధాకర్ న్యాయపరంగా ఎదుర్కోవాల్సిందే’అని డీజీపీ వివరించారు. సమావేశంలో ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, అడిషనల్ డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. అరుణ నేపథ్యమిదీ.. బిహార్, జార్ఖండ్ స్టేట్ కమిటీ సభ్యురాలుగా కొనసాగిన వైదుగుల అరుణ (అలియాస్ మాధవి, నీలిమ)ది వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం మామడపురం గ్రామం. 3వ తరగతి చదువుతున్నపుడే ఈమెకు బాల్య వివాహం జరిగింది. ఆ పెళ్లి అరుణకు ఇష్టం లేదు. 8వ తరగతిలో తమ గ్రామానికి వచ్చి విప్లవపాటలు పాడే మావోయిస్టు దళానికి ఆకర్షితురాలై దళంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1998లో సుధాకర్‌ను వివాహం చేసుకున్నారు. సుధాకర్ ప్రస్థానం ఇదీ! నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన సుధాకర్‌ది బీద కుటుంబం. 7వ తరగతి వరకు గ్రామంలోనే చదువుకున్న సుధాకర్.. నిర్మల్‌లో 8 నుంచి ఇంటర్‌వరకు చదివాడు. 1983లో ఇంటర్ చదువుతున్న క్రమంలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ)లో చేరి చదువు ఆపేశారు. ఆర్ఎస్యూ జిల్లా కమిటీ కార్యదర్శి కటకం సుదర్శన్ వద్ద చేరి దళంలో కొరియర్‌గా చేరారు. ఇర్రి మోహన్‌రెడ్డి వద్ద ఆయుధాల తయారీలో శిక్షణ పొందాడు. బెంగళూరులోని స్థావరంలో ఆయుధాలు తయారుచేసి దేశంలోని పలు దళాలకు చేరవేసేవాడు. 1986లో అరెస్టయి 1989 వరకు జైలు శిక్ష అనుభవించారు. జైలులో ఉన్న సమయంలో వరవరరావుతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటి కొచ్చాక వరవరరావుతో కలసి రైతు కూలీ సంఘంలో పనిచేశారు. 1990లో చెన్నారెడ్డి హయాంలో మావోలపై నిషేధం ఎత్తివేసినపుడు అజ్ఞాతం నుంచి బయటకొచ్చారు. ఇంద్రవెల్లి అమరుల స్మారక స్తూపం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించాడు. పోలీసుల ఒత్తిడితో తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లారు. అక్కడి నుంచి 1990లో దళంలో సభ్యుడిగా చేరిన సుధాకర్ 1999 నాటికి ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీలో, సబ్ కమిటీ ఆన్ మిలిటరీ అఫైర్స్‌లో సభ్యుడిగా ఎదిగాడు. 2001–03లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఛత్తీస్‌గఢ్‌లో, 2003–13 వరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా మిలిటరీ కమిషన్‌లో పనిచేశారు. 2013లో పదోన్నతిపై సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఈస్టర్న్ రీజనల్ బ్యూరో (ఈఆర్బీ)కి బదిలీ అయి బిహార్ రీజినల్ కమిటీలో పనిచేశారు. -
అమ్మా చూడాలి నిన్నూ నాన్నను చూడాలి
నలభై ఆరేళ్ల నాటి ‘పాపం పసివాడు’ చిత్రంలోని పాట ఇది. అందులో చిన్నారి ఏడారిలో చిక్కుకుపోయి అమ్మానాన్న కోసం అలమటిస్తూ ఈ పాట పాడతాడు. మనం, మన పిల్లలం ఒకే ఇంట్లో ఉంటున్నాం. అయినప్పటికీ మన పిల్లలు.. ‘అమ్మా చూడాలి.. నిన్నూ నాన్నను చూడాలి..’ అని మనసులో గానీ బాధగా అనుకోవడం లేదు కదా! ఒకప్పుడు నలుగురైదుగురు పిల్లలు. మరి ఇప్పుడో! ఒకరో ఇద్దరో!! అయినా అప్పటితో పోలిస్తే ఇప్పుడే పిల్లలతో తల్లిదండ్రులు గడిపే సమయం కుంచించుకుపోయింది. అది ఒప్పుకోకుండా.. తామెంత బిజీగా ఉన్నా అదంతా పిల్లల కోసమే కదా అంటారు తల్లిదండ్రులు. అయితే పిల్లలు కోరుకునేది పేరెంట్స్ అందించే ఆస్తి అంతస్తులు కాదని ప్రేమాభిమానాలని అంటారు నీలిమ. పిల్లలకు సంపద కాదు సమయం ఇవ్వడం ముఖ్యం అని అనుభవ పూర్వకంగా తెలుసుకున్న వాస్తవాన్ని అందరికీ తెలియజెప్పాలని ఆశిస్తూ... ‘మామ్ అండ్ మీ’ పేరుతో హైదరాబాద్ వేదికగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నీలిమ. ‘సాక్షి’తో ఆమె పంచుకున్న విశేషాలివి.‘‘ఫిజియోథెరపీ కోర్సు చేసి, డాక్టర్‌గా సేవలందించాలనుకున్నా. అయితే పెళ్లి అయ్యాక నా భర్త రవికుమార్ ప్రోత్సాహం, అత్తింటివారి సహకారంతో ‘ఎస్మార్ట్’ పేరుతో షాపింగ్‌మాల్స్ ప్రారంభించాను. స్వల్పకాలంలోనే వ్యాపారం విస్తరించడంతో బిజినెస్‌లో కూరుకుపోయాను. బిజినెస్‌తో పాటు సర్కిల్ విస్తరించడం, సోషల్ సర్వీస్, ఇంకా అనేక రకాల యాక్టివిటీస్ కూడా చుట్టుముట్టాయి. బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్, టైమ్స్ ఆఫ్ ఇండియా బెస్ట్ బ్రాండ్ అవార్డ్, మిసెస్ అర్బన్, వుమ్యానియా ఇన్స్పైర్, టీసీఈఐ నుంచి స్త్రీ శక్తి అవార్డ్‌లూ వచ్చాయి. అదే సమయంలో చిన్న వయసులో ఉన్న నా కిడ్స్‌కి నేను దూరం అవడం మొదలైంది. నాకు పిల్లలు కాస్త ఆలస్యంగా పుట్టారు. దీనితో పిల్లలతో గడిపే సమయాన్ని మిస్సవ్వడం అనేది ఇంకా ఎక్కువ బాధగా అనిపించేది. రకరకాలుగా ప్రయత్నించాను వారితో గడపాలని. అయినా వీలవలేదు. కొన్ని రోజులు మధనపడ్డాను. చివరకు అందరూ వారిస్తున్నా వినకుండా ఆకస్మిక నిర్ణయం తీసుకుని మాల్స్ క్లోజ్ చేసి, ఇంటి నుంచే ‘నీ మ్యాక్స్’ పేరిట ఆన్లైన్ వ్యాపారానికి శ్రీకారం చుట్టాను. దీనివల్ల కస్టమర్లకు తక్కువ ఖరీదుకే ఇవ్వడంతో పాటు పిల్లల్ని నేను మిస్సవుతున్నాననే బాధ కూడా తగ్గిపోయింది. మామ్ అండ్ మీ ఆలోచన ‘‘నాలో అంతర్మధనం సాగుతున్న సమయంలోనే తెలిసిన వారింట్లో పేరెంట్స్, పిల్లల మధ్య దూరం పెరిగి వారు కూడా నాలాగే సంఘర్షణకు లోనవడం చూశాను. ఆ పరిస్థితుల నేపథ్యం నుంచి పుట్టిందే ‘మామ్ అండ్ మీ’ ఆలోచన. మనందరికీ పిల్లలతో గడిపే సమయం చాలా అమూల్యమైనదని తెలుసు. కొన్ని అరుదైన సందర్భాలు మిస్ అయితే తిరిగి రావనీ తెలుసు. అయినప్పటికీ రకరకాల కారణాలతో అది సాధ్యపడడం లేదు. దీన్ని సుసాధ్యం చేయాలనే పిల్లల కేంద్రంగా ఈవెంట్స్ నిర్వహించే ఓగ్ సిటీ సంస్థను స్థాపించాను. దీని ఆ«ధ్వర్యంలో ఆసక్తికరమైన కార్యక్రమాలు డిజైన్ చేస్తూన్నాను. ఈ కార్యక్రమాలన్నీ పేరెంట్స్–పిల్లలు కలిపి గడపక తప్పని పరిస్థితిని కల్పిస్తాయి. వారి మధ్య బాండింగ్‌ని, ఒకరి మీద ఒకరికి ఉండే ఇష్టాన్ని పరస్పరం తెలియజేస్తాయి. తద్వారా తాము ఏం కోల్పోతున్నామో పెద్దలకు మరింత బాగా అర్థమవుతుంది. అర్థమయ్యాక ఇక పేరెంట్స్ తమ బిజీని తప్పకుండా తగ్గించుకుంటారనే నమ్మకం నాకుంది’’ అని అంటూ.. తను డిజైన్ చేసిన కార్యక్రమాల గురించి వివరించారు నీలిమ. కిడ్చెఫ్స్ ‘‘పిల్లల్లో వండటం పట్ల ఆసక్తి పెంచడానికి దీనిని నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా తల్లిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు వండి పెద్దలకు వడ్డిస్తారు. కలిసి తినడమే అరుదైపోతున్న రోజుల్లో కలిసి వండటం అనేది మరింత పిల్లలకూ పెద్దలకూ చాలా ఆనందాన్ని అందిస్తుంది.’’ ఫ్యాషన్ షో ‘‘తల్లితో, తండ్రితో కలిసి పిల్లలు ర్యాంప్‌వాక్ చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పిల్లలను మించిన అందం తల్లిదండ్రులకు మరేం ఉంటుంది? తమ పేరెంట్స్‌తో కలిసి వేదిక పంచుకోవడాన్ని మించిన ఆనందం పిల్లలకు ఎక్కడ దొరుకుతుంది? అందుకే ఈ ర్యాంప్‌వాక్ చేశాక వారిలో కలిగిన ఉత్సాహం మాటల్లో చెప్పలేనిది.’’ కేలెండర్ ‘‘ఇటీవలే మామ్ అండ్ మీ, డాడ్ అండ్ మీ పేరుతో కేలెండర్ రూపొందించాం. దీనిలో అనుబంధానికి నిర్వచనంలా అనిపించే పేరెంట్స్, పిల్లల చిత్రాలు ఉంటాయి. దీనిని డిసెంబర్ 5న విడుదల చేశాం. ఈ కేలెండర్ కోసం ప్రత్యేకంగా కొందరు తల్లిదండ్రులు, పిల్లలను ఆడిషన్ల తర్వాత ఎంపిక చేశాం. తొలి కేలెండర్‌కు నటి దివ్యవాణి (పెళ్లి పుస్తకం ఫేమ్), ఆమె కుమార్తె అంబాసిడర్‌గా వ్యవహరించారు’’ అని నీలిమ తెలిపారు. త్వరలోనే కిడ్స్–పేరెంట్స్ కలిసి పాల్గొనడానికి వీలుగా అందాల పోటీలు, వేయి మంది విజయవంతమైన బాలలను ఒకే వేదికపైకి తెచ్చే గిన్నిస్ బుక్ రికార్డ్ ఫీట్... వంటివి నీలిమ ప్లానింగ్‌లో ఉన్నాయి. – ఎస్.సత్యబాబు -
చేలల్లో నీలిమ
జర్నలిస్టు, రచయిత్రి అయిన నీలిమ ఈ మధ్యే ‘విడోస్ ఆఫ్ విదర్భ’ అనే పుస్తకం రాసింది. ఆక్స్ఫర్డ్ ప్రచురణ. ఈ పుస్తకం ఇటీవలే విడుదలైంది.తెలంగాణ వ్యవసాయ పరిస్థితులు, రైతుల స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడితే చాలా విషయాలను పంచుకుంది. వాటిలోని విశేషాంశాలివి. 2001.. జూలై. ఫూలన్ దేవి హత్య జరిగిన రెండు రోజుల తర్వాత ఆమె హత్యకు పాల్పడ్డ షేర్ సింగ్ రాణా లొంగిపోనున్నాడనే వార్తలు మొదలయ్యాయి. అప్పటికే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్‌లో మంచిపేరు తెచ్చుకున్న ముప్పై ఏళ్ల యంVŠ జర్నలిస్ట్ ఒక అమ్మాయి తన ప్రశ్నలతో షేర్ సింగ్ రాణాను ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అతను డెహ్రాడూన్ వైపు గాని, రూర్కీ వైపు గాని వెళ్లి ఉండొచ్చు అని పోలీసుల ఊహాగానాలు. ఆ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్స్ అన్నీ అలెర్ట్ అయ్యాయి. కానీ ఆ అమ్మాయిలో ఏదో సందేహం? అతను ఆ రెండు ప్రాంతాల వైపు కాకుండా... తనింటికి దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌లోనే సరెండర్ అవుతాడని. అందుకే అతని ఇంటికి దగ్గర్లో ఉన్న పోలీస్‌స్టేషన్ మీదే దృష్టి పెట్టింది. ఆమె అనుమానం నిజమైంది. వెంటనే ఆ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ షేర్ సింగ్ రాణా ఉన్నాడు! గబగబా ప్రశ్నల పరంపర సంధించింది. పదిహేను నిమిషాలకు మిగతా మీడియాకు ఉప్పంది, అక్కడికి వచ్చి వాలింది. కానీ రాణాను మొదట పట్టుకున్న ఘనత ఆమెకే దక్కింది. ఆమె కెరీర్లో ఇలాంటివి ఎన్నో! 2జీ స్పెక్ట్రమ్, నార్కోటిక్స్ నుంచి రాజకీయ కుట్రల దాకా ఎన్నెన్నో రిపోర్టింగ్స్.. చెప్పుకుంటూ వెళితే చాలానే! ఆమే నీలిమ. ‘ది స్టేట్స్‌మన్’లో తొలి ఉద్యోగం కోట నీలిమ పుట్టింది విజయవాడలో. పెరిగింది ఢిల్లీలో. తండ్రి కేవీఎస్ రామశర్మ. ఆయనా జర్నలిస్టే. నేషనల్ హెరాల్డ్‌కి ఎడిటర్‌గా పనిచేశారు. తల్లి ఉమా శర్మ. రచయిత్రి. ప్రపంచాన్ని ఎలా చూడాలో నాన్న ద్వారా నేర్చుకుంది నీలిమ. అమ్మ వల్ల ఊహాత్మక శక్తి పెరిగింది. ఈ రెండూ తన వృత్తికి ఎంతగానో ఉపయోగపడ్డాయి అంటుంది నీలిమ. అసలు తను జర్నలిస్ట్ అవడానికి ప్రేరణ మాత్రం తండ్రి నుంచే వచ్చింది అని చెప్తుంది. ఢిల్లీలో చదువు. అమెరికాలో పీహెచ్డీ చేసింది. జర్నలిస్ట్‌గా మొదట పెన్ను పట్టింది ‘‘ది స్టేట్స్‌మన్’’ పత్రికలో. తర్వాత ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది సండే గార్డియన్లకు పనిచేసింది. ప్రస్తుతం ది హఫింగ్టన్ పోస్ట్, డైలీ ఓ, డీఎన్ఏ, న్యూస్ 18లకు కాలమిస్ట్‌గా వ్యాసాలు రాస్తోంది. ఆమె దృష్టి అంతా పాలిటిక్స్, పాలసీస్, జెండర్, రైతుల మీదే. పత్రికల విధానాలు నచ్చలేదు! 2001–02 మధ్య.. హఠాత్తుగా రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతున్నట్టు గమనించింది నీలిమ. దేశానికి అన్నం పెట్టే రైతు బలవంతంగా ప్రాణం తీసుకునేదాకా వెళ్లాడంటే ఎంత దారుణమైన పరిస్థితులున్నట్టు! వాళ్లకోసం విధానాలు రూపొందించే యంత్రాంగానికి క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసా? రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుందో కనీసం రైతులకన్నా తెలుసా? వీటి గురించి కదా తను రిపోర్ట్ చేయాలి. వీటిని కదా.. మీడియా బ్యానర్లు రాయాలి. కానీ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంది. నిజాన్ని చెప్పాలి అంటే తాను పనిచేస్తున్న పత్రికల పాలసీకి భిన్నంగా నడవాలి. అందుకే రాజీనామా చేయాలనుకుంది నీలిమ. వెంటనే నెలవారీ ఖర్చులు, ఈఎమ్ఐలు, కట్టవలసిన లోన్లు కళ్లముందు కనిపించాయి. ఉద్యోగం వదిలేసి పూర్తిగా రైతుల ఆత్మహత్యల రీసెర్చ్ మీదే ఉండాలంటే ఇంకో ఇన్కమ్ సోర్స్కావాలి. అదేంటి? ఈ సంఘర్షణతో మరో రెండేళ్లు గడిచాయి. ఉద్యోగం మాని, విదర్భకు నీలిమ పెయింటర్ కూడా. ఉపనిషత్ల సారమే ఆమె పెయింటింగ్స్ థీమ్. దేశవిదేశాల్లో ఎగ్జిబిషన్స్ పెడ్తుంది. అప్పుడనిపించింది.. ఆదాయం కోసం ఈ కళనే ఉపయోగించుకోవాలని. రైతుల ఆత్మహత్యల పరిస్థితుల మీద రీసెర్చ్‌ను ఖరారు చేసుకుంది. 2004లో ఉద్యోగానికి రాజీనామా చేసి మహారాష్ట్రలోని విదర్భ బయలుదేరింది. అంతకుముందు మన దేశ వ్యవసాయం, పద్ధతులు, నష్టాలు వగైరా అన్నిటి మీద వచ్చిన పుస్తకాలు, శాస్త్రీయ పరిశోధనలన్నిటినీ అక్కడ చదివింది. తన పరిశోధనను సాగించింది. ఆ శోధననంతా పాఠ్యాంశంగా చెబితే ప్రజలకు పట్టదనీ గ్రహించింది. అందుకే వాటిని కథల రూపంలో, నవలల రూపంలో రాసింది. అలా రాసిన మొదటి పుస్తకం ‘‘రివర్‌స్టోన్స్’’. వ్యవసాయాన్ని, రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వ పాలసీలు ఎంత నిర్లక్ష్యం చేశాయో నవలారూపంలో వివరించిన పుస్తకం అది. 2007లో అచ్చయింది. రెండో పుస్తకం ‘‘డెత్ ఆఫ్ ఎ మనీలెండర్’’ 2009లో వచ్చింది. పల్లెల్లో పేదరికాన్ని పట్టించుకోకుండా వదిలేసిన మెయిన్ జర్నలిజం మీద ఎక్కుపెట్టిన అక్షరాస్త్రం ఆ పుస్తకం. 2013లో మూడో పుస్తకం ‘‘షూస్ ఆఫ్ ది డెడ్’’ని రాసింది. పొలిటికల్ బుక్‌గా అది బాగా పాపులర్ అయింది. పల్లెల్లోని యువత, నగరంలోని యువత మధ్య ఉండే వ్యత్యాసాన్ని.. దానికి కారణమైన వ్యవస్థకు నీలిమ అద్దం పట్టిందీ నవలలో. 2016లో ‘‘ది హానెస్ట్ సీసన్’’ను రాసింది. పార్లమెంట్ నాలుగు గోడల మధ్య జరిగే డీల్స్‌ను బహిర్గతం చేసిందీ పుస్తకంలో. ఆమె రాసిన ‘‘షూస్ ఆఫ్ ది డెడ్’’నవలను ప్రముఖ తమిళ దర్శకుడు వెట్టిమారన్ సినిమాగా కూడా రూపొందించబోతున్నాడు. ఇదీ కోట నీలిమ రచయిత్రిగా మారిన తీరు. ది గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ నీలిమ పుస్తకాలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉన్నాయి. కారణం తనకు తెలుగు అంత గొప్పగా రాయడం రాకపోవడమే అంటారు. ‘‘చిన్నప్పుడు మా నాన్న గారు మాకు తెలుగు నేర్పే విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. ఏదైనా తెలుగు పుస్తకం ఇచ్చి చదవమని చెప్పేవారు. చాలా హార్డ్‌గా ఉంది నాన్నా అంటే అవునా అంటూ ‘వేయి పడగలు’ వంటి భారీ పుస్తకాన్ని తెచ్చి ముందు పెట్టేవారు. మేం మొహం తేలేస్తే.. ‘ఇప్పుడు ముందు ఇచ్చిన పుస్తకం తేలిగ్గా అనిపిస్తుంది కదా.. చదవండి’ అనేవారు. అలా తెలుగు నేర్పే విషయంలో ఎంత పట్టుదలగా ఉండేవారో.. పుస్తకాలు చదివే విషయంలో కూడా అంతే ఇదిగా ఉండేవారు. నా ఎనిమిదో యేటనే చార్ల్స్ డికెన్స్ ‘‘ది గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్’ పుస్తకం ఇచ్చారు. అర్థంకాలేదు. మళ్లీ నాలుగేళ్లకు ఇచ్చారు చదవమని. అలా ఉంటుంది ఆయన ట్రైనింగ్. ఈ రోజు ఇలా ఉన్నామంటే అమ్మా, నాన్నే కారణం’’ అని గుర్తు చేసుకుంది నీలిమ. తెలుగు నేర్పాలని తండ్రి అంత ప్రయత్నించినా.. ఢిల్లీలో పెరగడం, వృత్తిరీత్యా ఇంగ్లిష్ భాషకే పరిమితమవడం వల్ల తెలుగు మీద పట్టు రాలేదు నీలిమకు. అందుకే తన పుస్తకాలను తెలుగులో అనువదించేందుకు.. ఇంకా చెప్పాలంటే ఇతర భారతీయ భాషల్లో అనువదించేందుకూ ప్రయత్నిస్తోంది. సమస్యలపై ‘స్టూడియో అడ్డా’ ప్రస్తుతం తెలంగాణ రైతు సమస్యలు, చేనేత కార్మికుల అవస్థలు, గల్ఫ్ వలసల గురించీ అధ్యయనం చేయడానికి హైదరాబాద్ వచ్చింది. ‘‘తెలంగాణలోనూ రైతుల ఆత్మహత్యలు భయం కలిగిస్తున్నాయి. ముందు నేను తెలంగాణ పల్లెలన్నీ తిరగాలనుకుంటున్నాను’’ అంది నీలిమ. ఇంకోవైపు ‘‘స్టూడియో అడ్డా’’ అనే సంస్థనూ స్థాపించి.. సోషల్ ఫారమ్‌గా మలిచింది. ఎవరైనా ఆ సంస్థలో ఎన్రోల్ చేసుకోవచ్చు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న అన్ని అంశాలు, సమస్యలు చర్చిస్తారు. ఆర్ట్ ఎగ్జిబిషన్స్నూ ఆమె కండక్ట్ చేస్తోంది. ఇదీ కోట నీలిమ మల్టీ టాస్కింగ్. విడోస్ ఆఫ్ విదర్భ నాలుగు పుస్తకాలు రాశాక నీలిమ ఆలోచన మారింది. ఇంత రీసెర్చ్‌లో ఆమెకు విషయాలన్నీ చెప్పింది చనిపోయిన రైతుల భార్యలు, తల్లులే. బరువు, బాధ్యతలను వదిలేసి ఆత్మహత్యతో రైతులు సాంత్వన పొందితే వాటన్నిటినీ నెరవేరుస్తున్నది ఈ ఆడవాళ్లే. అప్పులు తీర్చి, పిల్లలకు చదువులు చెప్పించి, పెళ్లిళ్లు చేసి జీవనాన్ని వెళ్లదీస్తున్నారు. అలాంటి వాళ్ల స్ట్రగుల్‌ని కదా చెప్పాలి అనుకుంది. అందుకే ‘‘విడోస్ ఆఫ్ విదర్భ’’గా పుస్తకాన్ని తెచ్చింది. ‘‘ఈ పుస్తకం రాయడానికి నాలుగేళ్లు పట్టింది. ముందు 100 కేస్‌స్టడీస్ తీసుకున్నా.. అందులోంచి 50 ఎంచుకొని అందులోంచి మళ్లీ పద్దెనిమిది తీసుకున్నా. ఆ పద్దెనిమిది మంది జీవితాలు ఒకేరకంగా లేవు. ఒక్కొక్కరూ ఒక్కోరకంగా జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. ఎవరూ ఎక్కడా ఆత్మగౌరవాన్ని కోల్పోలేదు. ధైర్యంగా నిలబడ్డారు. వాళ్లను చూస్తే.. వాళ్ల కథలు వింటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. వాళ్లకున్నంత సెల్ఫ్ ప్రైడ్, సెల్ఫ్‌రెస్పెక్ట్ అర్బన్ విమెన్, ఈవెన్ వర్కింగ్ క్లాస్ విమెన్‌కి కూడా ఉండదనిపించింది. చాలా నార్మల్ లేడీస్.. చదువు లేదు.. బయటి ప్రపంచం తెలియదు.. ఆర్థికంగా ఎలాంటి అండలేని వాళ్లు.. అయినా వాళ్లు నిలబడ్డ తీరు.. అద్భుతం! వాళ్ల భర్తలు చేసిన పనే వాళ్లు చేసి ఉంటే ఎన్ని కుటుంబాలు రోడ్డున పడేవి?’’ అంటూ తన పుస్తక నేపథ్యాన్ని వివరించింది నీలిమ. – సరస్వతి రమ -
నేనొక ప్రపంచం
దేశాల మధ్యలో ఉండేవి గీతలే!మాసిపోని.. మార్చలేని.. చెరపలేని ముళ్లకంచెల్లాంటి గీతలే!!అలాగే మనుషుల మధ్యలో కూడామాసిపోని.. మార్చలేని.. చెరపలేని గోడల్లాంటి గీతలే!!మనిషి లోపలుండే హద్దులు.. సరిహద్దులు.. అభిప్రాయాలు.. అపోహలు.. ఇవి ఎలాంటి గీతలు? ఈ గీతలకు నీలిమ దగ్గర ఓ పేరుంది....‘అట’!‘నేను నా గమ్యం కావాలంటే ప్రపంచమే నా ప్రయాణం కావాలి’ అంటారామె అర్థం చేసుకుంటే మీరే ప్రపంచం!! ‘చిన్న ప్రాణి చీమ. ఆహారం సేకరించడం పుట్టలో దాచుకోవడం అనే శ్రమలోనే జీవితాన్ని గడిపేస్తుంది. పెద్ద జీవి మానవుడు కూడా అంతే. సంపాదించుకోవడం దాచుకోవడంతోనే జీవితాన్ని గడిపేస్తాడు. చీమకు, మనకు మధ్య ఏం తేడా ఉన్నట్టు? మనం ఇంకేదైనా చేయాలి కదా..’ ఓ ఆధ్యాత్మిక గురువు చెప్పిన ఈ మాట ఆమె మీద చాలా ప్రభావం చూపింది. ‘చీమకు, మనుషులకే కాదు.. నాకూ ఇతరులకూ కూడా తేడా ఉండాలి. ఆ తేడా ఎక్కడుంది? అందరిలాగే నేనూ చదువుకున్నా. అందరిలాగే ఉద్యోగం చేస్తున్నా. అందరిలాగే కలలున్నాయి. మరి తేడా ఎక్కడుంది? యెస్.. కలలను సాకారం చేసుకోవడానికి చాలామందికి ధైర్యం లేదు.. అది నాకుంది. దాన్ని ప్రదర్శించాలి’ అని అనుకుందామె. మూడున్నరేళ్ల కిందట.. ఓ ఫైన్ డే. బ్యాక్‌ప్యాక్ వేసుకొని ‘అమ్మా.. నేనట్లా ఓ మూడునాలుగు దేశాలు చుట్టొస్తా’ అంటూ ప్రయాణం మొదలుపెట్టింది ఆమె. ఈ యేడు జనవరితో 52 దేశాలను చుట్టివచ్చింది. ప్రపంచంలోని దేశాలను చూడాలనే వాండర్లస్ట్ (భ్రమణ కాంక్ష)ను తీర్చుకోవాలని ఆమె నిర్ణయించుకున్నప్పుడు కనీసం వంద దేశాలు అనే టార్గెట్‌ను పెట్టుకుంది. కాని ఈ మూడున్నరేళ్లలో ఇన్ని దేశాలు చూశాక ఆ కాంక్ష పెరిగి అన్ని దేశాలను చూడాల్సిందే అని టార్గెట్ పరిధిని పెంచుకుంది. ఆమె పేరు నీలిమా రెడ్డి. కాని నీల్ రెడ్డిగా పరిచయం. దేశాలు తిరిగి ఊరికే ఉండట్లేదు. Neel Travelogues అనే యూ ట్యూబ్ చానెల్‌నూ నిర్వహిస్తోంది. సోలో ట్రావెలర్‌గా తాను తిరిగిన దేశాల్లోని చారిత్రాత్మక కట్టడాలు, ఆ దేశ చరిత్ర, అక్కడి సంస్కృతి, ప్రజలు, వింతలు, విడ్డూరాలు, విశేషాలు, భౌగోళిక ప్రత్యేకతల గురించిన వీడియోలు తీసి అందులో పొందుపరుస్తోంది. అంతేకాదు తనలా సోలో ట్రావెల్ చేయాలనుకున్న అమ్మాయిలు, అబ్బాయిలకు ట్రావెల్ టిప్స్నూ అందిస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా తన సంపాదనలోని మూడొంతుల ఆదాయాన్ని వరల్డ్ టూర్‌కే ఖర్చు చేస్తోంది. ఆమెకు కొన్ని ప్రశ్నలు: డబ్బు సరే.. సెలవులు గట్రా ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? నేను మైక్రోసాఫ్ట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నా సుపీరియర్స్ అందరికీ ట్రావెలింగ్ గురించి, మెయిన్‌గా నా వాండర్ లస్ట్ గురించి బాగా తెలుసు. నేను ఎవ్రీ త్రీ మంత్స్కి ట్రిప్ ప్లాన్ చేసుకుంటా. మినిమమ్ టెన్ డేస్ మాగ్జిమమ్‌గా టూ వీక్స్ లీవ్ తీసుకుంటా. అయితే ఈ త్రీ మంత్స్ ఆఫీస్ వర్క్‌కే నా టైమ్‌ను డెడికేట్ చేస్తా. ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోను. వీక్ ఆఫ్ వాడుకోను. టోటల్‌గా వర్క్ మీదే శ్రద్ధ పెడతా. అలా కష్టపడి పని చేసి నా పని పెండింగ్‌లో లేకుండా చూసుకొని లీవ్ పెడతా. నా పై అధికారులు అభ్యంతరం లేకుండా లీవ్ ఇస్తారు. ఆడవాళ్లకు సొంత ఊళ్లళ్లోనే భద్రత లేదు.. తెలియని దేశాలలో ఎలా? భయముంటే సొంతూరైనా ప్రపంచమైనా ఒకటే. తెలియని ప్రదేశం హైదరాబాద్‌లో ఉప్పల్ అయినా వరల్డ్‌లో ఉక్రెయిన్ అయినా ఒక్కటే. ఎక్కడికి వెళ్లాలన్నా ముందు కాన్ఫిడెన్స్ కావాలి. అవేర్నెస్, నాలెడ్జ్ తప్పనిసరి. డేంజర్‌ను ప్రతి మనిషి, ముఖ్యంగా ఆడవాళ్లు బాగా సెన్స్ చేయగలరు. ఆ ఇన్స్టింక్ట్ మనల్ని ఎప్పటికప్పుడు వార్న్ చేస్తూనే ఉంటుంది. అయినా కొత్త ప్రదేశానికి వెళ్తున్నామంటే ఎంతైనా కాస్త జాగ్రత్తగానే ఉంటాం కదా. నేను ఇన్ని దేశాలు తిరిగా. భద్రతకు సంబంధించి నాకెక్కడా ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాలేదు. లక్కీగా ఇంటర్నెట్ ఉండనే ఉంది. ముందుగానే నేను వెళ్లబోయే దేశానికి సంబంధించిన వివరాలన్నీ సెర్చ్ చేసుకుంటాను. సోలో ట్రావెలర్స్ కోసం కౌచ్ సర్ఫింగ్, హాస్టల్ వరల్డ్ లాంటి వెబ్‌సైట్స్ ఉన్నాయి. అకామిడేషన్లాంటి వాటికి అవెంతో హెల్ప్ చేస్తాయి. సాధారణంగా బయటి దేశాల్లో ఫారినర్స్‌ను కనీసం టీజ్ చేయడం కూడా నేను చూడలేదు. అందులో ఆడవాళ్లంటే హెల్ప్ చేయడానికి ముందుంటారు. నేనైతే మగవాళ్లు కూడా వెళ్లని ప్రదేశాలకు వెళ్లాను. అడ్వంచరస్ టూర్స్ చేశాను. ఎక్కడా ఎలాంటి ప్రాబ్లమ్నూ ఎదర్కోలేదు. ప్రాబ్లమ్స్ అంటే బస్ మిస్ కావడం, ట్రైన్ మిస్ కావడం లాంటివే. నాకు తెలిసీ ఈ భద్రతకు సంబంధించి నిజాలకన్నా మనకు అపోహలే ఎక్కువుంటాయి. ఎగ్జాంపుల్.. నేను బ్రెజిల్, పెరూ వెళ్తున్నప్పుడు చాలా మంది అక్కడ డ్రగ్స్, క్రైమ్ ఎక్కువ అలాంటి చోట్లకు వెళ్తావా? అంటూ కామెంట్ చేశారు. అక్కడికి వెళ్లాక బ్రెజిలియన్స్ నేను ఇండియన్ అని తెలుసుకొని మీ ఇండియాలో ఫారిన్ అమ్మాయిలకు సెక్యూరిటీ లేదట కదా. రేప్ చేసి చంపేస్తారట కదా’ అని అడిగారు. అలాగే ఇంకో కంట్రీవాళ్లు నేను హైదరాబాద్‌లో ఉంటానని చెప్పగానే ఓమైగాడ్.. హైదరాబాద్‌లో కమ్యూనల్ రెయిట్స్ ఎక్కువట కదా. హిందూ, ముస్లింలు రోడ్ల మీదే గొడవపడ్తారట కదా అని అడిగారు. సో నేను చెప్పొచ్చేదేంటంటే ఈ ‘అట’ భాషను ఎంత ఇగ్నోర్చేస్తే అంత మంచిది. ప్రతి దేశానికి ఇతర దేశం పట్ల ఓ అపోహ ఉంటుంది. ఎక్స్ప్లోర్ చేస్తే అది అబద్ధమని తేలుతుంది. సో.. నిరభ్యంతరంగా అమ్మాయిలు సోలో ట్రావెల్ చేయొచ్చు. బాగా నచ్చిన ప్రదేశాలు? అన్నీ నచ్చాయి. ఏ దేశానికదే.. ఏ ప్రాంతానికదే ఓ స్పెషల్. ప్రతీ ప్లేస్ ఎన్నో కొత్త విషయాలను నేర్పింది నాకు. కొత్త అనుభవాలనిచ్చింది. కొత్త సంస్కృతి.. కొత్త మనుషులు.. కొత్త భాష.. అసలు ఆ మాటకొస్తే కొత్త అనేదే ఎక్సయిట్మెంట్. ఆఫ్రికాలో ఏడు దేశాలను (కెన్యా నుంచి సౌత్ ఆఫ్రికా దాకా) చూడ్డానికి ట్రక్‌లో వెళ్లా. దాన్ని ఓవర్‌ల్యాండ్ ట్రక్ ట్రిప్ అంటారు. గెరిల్లా సఫారీని చూశా. బల్లికే భయపడే నేను అనకొండను మెడలో వేసుకున్నా. సెవెన్ కలర్ హిల్స్.. సెవెన్ వండర్స్.. ఎన్నని చెప్పను? ఈ ప్లానెట్ ఇంత అందమైందా అని అనిపించే అందమైన ప్రదేశాలెన్నిటినో చూశా. కొరియా అందమైన దేశం. అక్కడి వాళ్లకు ఇంగ్లిష్ రాదు.. మనకు కొరియా రాదు. అయినా చిన్న ఇబ్బంది కూడా లేకుండా ఆ దేశాన్ని తిరిగొచ్చా. ఆ దేశం అలాంటిది. భాషరాని వాళ్లు.. ఆ మాటకొస్తే మాటలు రాని వాళ్లూ హాయిగా తిరిగొచ్చు. కొరియన్ లాంగ్వేజ్ రాని వాళ్ల కోసం కలర్స్, సింబల్స్, సైన్స్‌తో కమ్యూనికేట్ చేస్తారు. టికెట్ వెనకే అన్ని వివరాలనూ ఇస్తారు. ఇలాంటివెన్నో. ట్రావెల్ చేయక ముందు మీకు.. చేశాక మీకు ఉన్న తేడా? వచ్చిన మార్పు? చాలా చాలా అంటే చాలా! నేను కావలి (నెల్లూరు జిల్లా) అనే ఊళ్లో పుట్టి పెరిగి, తెలుగు మీడియంలో మామూలు చదువు చదివిన అమ్మాయిని. నిజం చెప్పాలంటే హైదరాబాద్‌లో జాబ్‌లో చేరినా తక్కువ ఆత్మవిశ్వాసంతోనే ఉండేదాన్ని. సోలో ట్రావెల్ మొదలు పెట్టాక ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను వెళ్లిన చోటున్న స్థానిక తెగలను, ఆ సంస్కృతిని అధ్యయనం చేయడం ఇష్టం. ఆ అవగాహన అంతా నాలో ఆత్మవిశ్వాసంను పెంచుతూనే ఉంది. రష్యన్, స్పానిష్ భాషలను నేర్చుకున్నా. సహనం పెరిగింది. మనుషులను అర్థం చేసుకునే విషయంలోనూ మార్పు వచ్చింది. అంతకుముందు ఆఫీస్‌లో టీమ్‌లో నా కొలీగ్స్‌తో చాలా గొడవలొచ్చేవి. ఇప్పుడు రావట్లేదు. టీమ్‌ను మేనేజ్ చేసుకోవడం తెలుస్తోంది. యాంగర్, క్రైసిస్ మేనేజ్మెంట్ తెలుస్తున్నాయి. అంతకుమందు చిన్న విషయాలు కూడా పెద్దగా కనిపించేవి. ఇప్పుడు పెద్ద విషయాలు కూడా చాలా తేలిగ్గా అనిపిస్తున్నాయి. సొల్యూషన్ ఈజీ అవుతోంది. వేరే వాళ్ల షూలో కాలుపెట్టి ఆలోచించడం అలవాటైంది. జడ్జిమెంటల్‌గా ఉండకూడదనీ తెలిపింది. అందుకే ఇప్పుడు ఎవరైనా ఇంకెవరిగురించైనా కామెంట్ చేస్తుంటే నేను వినను. ఈవెన్ మా అమ్మయినా ఎవరి గురించైనా చెప్తే అమ్మా.. ఊరుకో అని వార్న్ చేస్తున్నాను. ఒక పాజిటివ్ అట్యూటూడ్ అలవడింది. ఇక్కడ మీకొక్కటి చెప్పాలి. నాకు ఒక అక్క. తను తెల్లగా ఉంటుంది. నేను నల్లగా ఉంటాను. బ్లాక్ వల్ల చిన్నప్పటి నుంచి ఒకరమైన హ్యూమిలియేషన్కు గురయ్యా. కాని వరల్డ్‌టూర్ నా రంగు పట్ల నాకు విపరీతమైన ఇష్టాన్ని పెంచింది. నన్ను ప్రేమించుకోవడం.. నన్ను నేను ప్రెయిజ్ చేసుకోవడం నేర్పింది. లైఫ్‌ను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చెప్తోంది. అందుకే ఐ లవ్ ట్రావెలింగ్. మీ ఇంట్లోవాళ్లు? ముందు భయపడ్డారు. తర్వాత అలవాటు పడ్డారు. మా ఇంట్లో వాళ్లే కాదు నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా. కనీసం వంద దేశాలన్నా తిరగాలి అని చెప్పినప్పుడు ఎగతాళి చేశారు. ఇప్పుడు 198 అంటే తిరుగుతావులే.. ఆల్ ది బెస్ట్ అంటున్నారు. ప్రపంచం ఏమనుకున్నా పట్టించుకోవద్దు.. ఇదే నా ఫిలాసఫీ. దాన్నే ఫాలో అవుతాను. ట్రావెల్ ఈజ్ మై రిలీజియన్. అంతే. అడ్వంచర్ అన్నారు.. ఎగ్జాంపుల్ చెప్తారా? చాలా ఉన్నాయి. అటకామా వెళ్లా. బ్రెజిల్లో అమేజాన్ వెళ్లా. మీకో విషయం తెలుసా? అమేజాన్ వెళ్లడానికి బ్రెజిలియన్సే వెనకాముందు అవుతుంటారు. రీసెంట్గా జాంబియాలోని విక్టోరియా ఫాల్స్ పైనున్న డెవిల్స్ ఫూల్కి వెళ్లా. అది చాలా డెంజేరస్ ప్లేస్. సొంత రిస్క్ మీదే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. నార్త్ కొరియో వెళ్లా. ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్కి వెళ్లా. అట్లాగే ఇండోనేషియాలోని టాగీన్ ఐల్యాండ్కీ వెళ్లా. జనరల్‌గా ఇండియన్స్ ఎవరూ వెళ్లరట అక్కడికి. నన్ను చూసి సర్ప్రైజ్ ఫీలయ్యారు. అక్కడే నేను స్కూబా డైవింగ్‌లో సర్టిఫైడ్ కూడా అయ్యాను. స్కై డైవింగ్ కూడా చేస్తా. ఆరు ఖండాలు చూశా. అంటార్కిటా వెళ్లాలనీ ఉంది. అయితే దీనికి స్పాన్సర్స్ కోసం ట్రై చేస్తున్నా. స్పాన్సర్స్ దొరికితే రేపే వెళ్లిపోతా. అంత ఈగర్‌గా ఉన్నా. – సరస్వతి రమ -
నిర్మాతగా నీలిమ
తమిళసినిమా: నటిగా తనదైన ముద్రవేసుకున్న నీలిమ తాజాగా నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. దేవర్‌మగన్ చిత్రంలో నాజర్ కూతురి పాత్రలో బాలనటిగా సినీరంగప్రవేశం చేసిన నీలిమ ఆ తరువాత నాన్‌మహాన్ అల్ల, మురణ్, తిమిరు,సంతోష్సుబ్రమణియం, మొళి మొదలగు 50 చిత్రాలకు పైగా వివిధ పాత్రల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అదే విధంగా బుల్లితెరపైనా వాణిరాణి, తామరై, తలైయనై పూక్కళ్ తదితర 80 సీరియళ్లలో నటించారు. అలా తన 20ఏళ్ల నట పయనంలో తదుపరి ఘట్టంగా నిర్మాత అవతారమెత్తారు. ఇసైపిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలుత బుల్లితెరపై నిరం మారాద పూక్కళ్ అనే సీరియల్‌ను తన భర్త ఇసైవనన్తో కలిసి నిర్మిస్తున్నారు. దీని గురించి నీలిమ తెలుపుతూ నిర్మాతనవ్వాలన్నది తన 20 ఏళ్ల కల అని, అది ఇప్పటికి నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఈ సీరియల్ వచ్చే సోమవారం నుంచి శుక్రవారం వరకూ మధ్యాహ్నం 2.00 గంటలకు జీ తమిళ్ చానల్లో ప్రసారం కానుందని తెలిపారు. ఇందులో మురళి, నీష్మా, అస్మిత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. ఇనియన్ దినేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీరియల్‌కు విసు చాయాగ్రహణను, అర్జునన్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. దీన్ని నాగర్‌కోవిల్, మట్టం,కన్యాకుమారి ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు వెల్లడించారు. ఇదే విధంగా త్వరలో చిత్ర నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు నటి నీలిమ తెలిపారు. -
స్త్రీ చైతన్యమే ఈమె పరుగు లక్ష్యం!
ఇటీవలే ఎవరెస్టు అధిరోహించిన తెలుగు అమ్మాయి నీలిమ పూదోట. ధైర్యసాహసాలకు పెట్టింది పేరైన ఈ ధీర వనిత.. విజయవాడ నుంచి విశాఖకు 350 కిలోమీటర్లు పరుగెత్తి రికార్డు సృష్టించింది. ఇంత దూరం పరుగుపెట్టడమే కష్టమనుకుంటే.. పాదరక్షలు లేకుండా ఒట్టి పాదాలతోనే పరుగు కొనసాగించి మరింత సంచలనం సృష్టించింది నీలిమ. ఇదేదో పబ్లిసిటీకి చేసిన కార్యమని ఎంత సర్దిచెప్పుకున్నా.. ఆమె మారథాన్ లక్ష్యమేంటో తెలుసుకుంటే మాత్రం మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేం..! దేశంలో.. ఆ మాటకొస్తే.. ప్రపంచంలోనే అతి వేగంగా వ్యాప్తి చెందుతోన్న జబ్బు రొమ్ము క్యాన్సర్. మహిళలను మానసికంగా శారీరకంగా కుంగదీస్తోన్న ఈ మహమ్మారిపై అవగాహన పెంచేందుకే నీలిమ ఇంత సాహసం చేసింది. రొమ్ము క్యాన్సర్ దరిచేరకుండా మహిళల జీవన శైలి మారేలా చైతన్య పరచాలి. అందుకోసమే నడుం బిగించింది ‘పింకథాన్’. మెట్రో నగరాల్లో త్రీకే, ఫైవ్ కే, టెన్ కే రన్ నిర్వహిస్తూ మహిళలను, యువతులను ఉత్సాహంగా పాల్గొనేలా చేస్తున్నారు నిర్వాహకులు. అందులో భాగంగానే నీలిమ ఒట్టి కాళ్లతో లాంగ్ రన్ చేయాలని నిశ్చరుుంచుకుంది. అలా విజయవాడ నుంచి విశాఖకు 350 కిలోమీటర్లు పరిగెత్తి అరుదైన రికార్డు నెలకొల్పింది. ఏదైనా అనుకుంటే చేసేయడం నీలిమకు మొదట్నుంచీ ఉన్న అలవాటు. పింకథాన్‌లో పాల్గొనడానికి నీలిమ 5 నెలలు ప్రాక్టీస్ చేసింది. సూర్యోదయం కంటే ముందే పరుగు ప్రారంభించి సాయంత్రానికి ఆగిపోయేది. ఇదొక్కటే కాదు.. నీలిమ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అన్నీ రికార్డులే. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెంకు చెందిన నీలిమ మంచి రైటర్, డాన్సర్. హార్స్ రైడింగ్ తెలుసు. పాటలు కూడా పాడుతుంది. ఏదైనా చేయాలని అనుకుంటే పట్టువదలని విక్రమార్కుడిలా మారుతుంది. ఆమెకు తల్లిదండ్రులూ ఏనాడూ అడ్డుచెప్పలేదు. మొన్నటికి మొన్న బెంగళూరు నుంచి హైదరాబాద్ 570 కి.మీ. దూరం సైకిల్ మీద ప్రయాణించింది. తాజాగా పింకథాన్ లో బేర్‌ఫుట్ రన్నర్‌గా మరో అరుదైన ఫీట్ సాధించింది. నీలిమ సంకల్ప బలం ముందు ముళ్లబాటలు కూడా పూల బాటలవుతున్నారుు. ఈమె ప్రయాణం మరింత దూరం సాగాలని కోరుకుందాం..! -
వ్యాయామంతో వ్యాధులు దూరం
ఎవరెస్ట్ అధిరోహకురాలు నీలిమ బ్రెస్ట్ కాన్సర్పై అవగాహన పెంచేందుకు పింక్‌థాన్ విజయవాడ నుంచి విశాఖకు పరుగు తొండంగి : ఒకనాడు ప్రపంచంలో అత్యున్నతమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, తెలుగు వారి కీర్తిని ఇనుమడింపజేసిన పాదాలు.. నేడు అనేక మంది మహిళలకు మృత్యుశాసనాన్ని రాస్తున్న మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు పరుగుతీస్తున్నాయి. గుంటూరుకు చెందిన ఎవరెస్ట్ అధిరోహకురాలు పూదోట నీలిమ మహిళలకు బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన కల్పించాలన్న సంకల్పంతో విజయవాడ నుంచి విశాఖకు చేపట్టిన పింక్«థాన్‌పరుగు బుధవారం మండలంలోని బెండపూడి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. మహిళల్లో అనేకులు బ్రెస్ట్ క్యాన్సర్, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నారన్నారు. ఎటువంటి వ్యాధులనైనా కొద్దిపాటి శారీరక వ్యాయామంతో దూరం చేసుకోవచ్చన్నారు. మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈనెల 12న విజయవాడ నుంచి పింక్‌థాన్(మహిళలు మాత్రమే చేసే పరుగు) ప్రారంభించానన్నారు. రోజుకు సరాసరి యాభై కిలోమీటర్ల చొప్పున వారంరోజుల పాటు పింక్‌థాన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 18 కల్లా విశాఖ చేరుకుంటానన్నారు. ఈనెల 20న అక్కడ విజయా మెడికల్స్ ఆధ్వర్యంలో జరిగే అవగాహనా కార్యక్రమంలో పాల్గొంటానన్నారు. కాగా తనతో పాటు 10 కిలోమీటర్లు పింక్‌థా¯ŒSలో పాల్గొన్న వారికి ఉచితంగా పలు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతోపాటు వ్యాయామం ద్వారా కలిగే ప్రయోజనాలను చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమం చేపట్టానన్నారు. అంనతరం విశాఖకు పింక్ థా¯ŒSను కొనసాగించారు. -
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహనకు పింక్‌రన్
విజయవాడ (లబ్బీపేట) : బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌కు చెందిన యువతి నీలిమ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే విజయవాడ నుంచి విశాఖపట్నం వరకూ షూ, చెప్పులు లేకుండా పింక్‌రన్‌ను ప్రారంభించింది. బందర్ రోడ్డులోని పీవీపీ మాల్ వద్ద శనివారం వేకువజామున 4 గంటలకు ఈ పరుగును ప్రారంభించిన ఆమె వారం రోజుల్లో విశాఖ చేరుకోనుంది. అక్కడ పింక్‌రన్–2016 పేరులో ఈనెల 20న నిర్వహించనున్న కార్యక్రమంలో ఆమె పాల్గొంటుంది. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే నివారించడం సాధ్యమని, సరైన అవగాహన లేకపోవడం వల్లే మహిళలు మృత్యువాత పడుతున్నారన్నారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే షూ, చెప్పులు లేకుండా రన్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. -
నీలిమకు ఏపీ సీఎం ఆర్థికసాయం
హైదరాబాద్: ఎవరెస్ట్ అధిరోహణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థినికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ఈ వివరాలను ఏపీ ప్రభుత్వ సమాచార, ప్రజా సంబంధాలశాఖ ఓ లేఖలో పేర్కొంది. శనివారం నాడు విద్యార్థినికి చెక్ ఇచ్చి ఆమెను అభినందించారు. ఎవరెస్ట్ అధిరోహించనున్న ఇంజినీరింగ్ విద్యార్థి నీలిమ స్వస్థలం గుంటూరు జిల్లా తురకాపాలెం. నేపాల్ భూకంపం నేపథ్యంలో గతంలో ఆమె చేపట్టిన యాత్ర మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. రెస్క్యూ టీమ్స్ ఆమెను కాపాడటంతో నేపాల్ దుర్ఘటన నుంచి బయటపడింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నీలిమ తన యాత్రను ప్రారంభించనుంది. తన ఎవరెస్ట్ యాత్రకుగానూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని నీలిమ హర్షం వ్యక్తం చేసింది. -
గైనిక్ కౌన్సెలింగ్
నా వయసు 20 ఏళ్లు. పెళ్లయి రెండేళ్లు అయ్యింది. పెళ్లయిన ఆర్నెల్లకు గర్భం వచ్చింది. మూడో నెలలో కొంచెం బ్లీడింగ్ కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాను. స్కానింగ్ చేసి ‘ముత్యాలగర్భం పెరుగుతోంది’ అని తీసేశారు. ఇంకోసారి స్కానింగ్ చేసి, మళ్లీ గర్భం దాల్చాలంటే కనీసం ఒక ఏడాదైనా ఆగాలన్నారు. అసలు ఈ ముత్యాల గర్భం ఎందుకు ఏర్పడుతుంది? మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? - నీలిమ, మెదక్ గర్భాశయంలో పిండం నిర్మాణ లోపం వల్ల, నిర్వీర్యమైన అండంతో ఒక శుక్రకణం కలిసి ఫలదీకరణ చెంది ముత్యాల గర్భంగా ఏర్పడుతుంది. కొన్నిసార్లు గర్భాశయంలో బిడ్డ ఏర్పడకుండా, బిడ్డకు ఆహారాన్ని అందించే మాయ (ప్లాసెంటా), చిన్న చిన్న ముత్యాల్లాంటి నీటి బుడగలుగా మార్పు చెందుతుంది. ఇవి పెరిగిపోతూ, గర్భాశయం మొత్తాన్ని ఆక్రమిస్తాయి. ఇలా పెరిగే గర్భాన్ని ముత్యాల గర్భం అంటారు. కొంతమందిలో మాయ కొంత భాగం ముత్యాలుగా మారుతుంది. వీరిలో బిడ్డ కూడా ఏర్పడుతుంది. కానీ అది సరిగా ఎదగకపోవచ్చు. అవయవలోపాలు ఉండవచ్చు. ముత్యాలగర్భం వచ్చినవారిలో 2-3 నెలల్లో కొంచెం లేదా ఎక్కువగా బ్లీడింగ్ లేదా నీటిబుగ్గలతో కలిసిన ద్రవం, దాంతోపాటు కొంచెం పలుచగా రక్తం చారికలు కనిపించవచ్చు. కాబట్టి దీనిని ముందుగానే అంటే 2-3 నెలల్లోనే స్కానింగ్ ద్వారా నిర్ధారణ చేసుకొని, సెక్షన్ క్యురెటాజ్ ద్వారా తీయించేసుకోవడం మంచిది. ఇందులో గర్భాశయం చాలా మెత్తబడి ఉంటుంది. అందువల్ల క్యురెటాజ్ చేసేటప్పుడు అధిక రక్తస్రావం, గర్భాశయానికి చిల్లు పడే అవకాశాలు ఉంటాయి. తర్వాత కూడా కొందరిలో నీటిబుగ్గలు కొద్దిగా ఉండిపోయి, మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు డాక్టర్ పర్యవేక్షణలో మళ్లీ స్కానింగ్, బీటా హెచ్‌సీజీ రక్తపరీక్ష చేయించుకుంటూ, మూడు నెలల నుంచి ఆర్నెల్ల పాటు డాక్టర్ ఫాలోఅప్‌లో ఉండాలి. ఏడాదివరకు గర్భం రాకుండా జాగ్రత్తపడాలి. మలిసారి గర్భందాల్చినప్పుడు రెండు శాతం మందిలో మళ్లీ ముత్యాలగర్భం రావచ్చు. గర్భం కోసం ప్రయత్నం చేసే మూడు నెలల ముందునుంచే దంపతులు ఇద్దరూ మితాహారం, పౌష్టికాహారం తీసుకుంటూ, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడాల్సి ఉంటుంది. గర్భం వచ్చాక రెండో నెల చివర్లోనే స్కానింగ్ చేయించుకని, అది సాధారణ గర్భమా లేక ముత్యాల గర్భమా అని నిర్ధారణ చేసుకోని, తగిన తదుపరి చర్యలు తీసుకోవడం మంచిది. డాక్టర్ వేనాటి శోభ సీనియర్ గైనకాలజిస్ట్ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
'అయినా.. ఎవరెస్ట్ ఎక్కి తీరుతా.. '
న్యూఢిల్లీ: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లి భూకంపంలో చిక్కుకున్న పర్వతా రోహకురాలు నీలిమ శుక్రవారం ఢిల్లీకి చేరుకుంది. భూకంపం సృష్టించిన విధ్వంసంతో నేపాల్ సహా ఇతర ప్రాంతాలు అతులాకుతలమైయిన సంగతి తెలిసిందే. అయితే భూకంపం వచ్చిన సమయంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లిన 3++ బృందం చిక్కుకుంది. ఈ బృందంలో ఒకరైన పర్వతరోహకురాలు నీలిమ ఆరు రోజుల తరువాత సురక్షితంగా ఢిల్లీకి చేరింది. ఈ సందర్భంగా ఆమె ఎవరెస్ట్ అధిరోహణ సమయంలో తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియాకు వెల్లడించింది. భూకంపం వచ్చినప్పుడు ఎవరెస్టుపై 4,700 అడుగుల ఎత్తులో ఉన్నామని చెప్పింది. భూకంప ధాటికి తాము చేరుకోవాల్సిన బేస్ క్యాంప్ ధ్వంసమైపోయినట్టు తెలిపింది. అలాగే పెద్ద ఎత్తున మంచు చెరియలు విరిగిపడ్డాయని చెప్పింది. అయితే అదృష్టం కొద్ది తాము బేస్ క్యాంప్‌కు కొద్ది దూరంలో ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డామని తెలిపింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎవరెస్ట్ నుంచి కిందికి దిగామని పేర్కొంది. చివరికి అక్కడి ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది తమను కాఠ్మాండ్కు చేర్చారని నీలిమ తెలిపింది. అంతేకాకుండా భూకంప విధ్వంసం కళ్లార చూసినప్పటికి ఎవరెస్ట్ ఎక్కాలని ఆశ ఇంకా ఉందంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ప్రాణం అనేది ఎక్కడున్నా పోతుంది.. ఈసారి ఎవరెస్ట్ ఎక్కి తీరుతా.. నా సాహస యాత్రను కొనసాగిస్తా' అంటూ పర్వతారోహకురాలు నీలిమ తన దృఢ నిశ్చయాన్ని వెల్లడించింది.