సరైన వైద్యం లేదు, పరిస్థితి దారుణం: కౌశల్‌ భార్య | Kaushal Manda Wife Neelima Release Video About Her Health | Sakshi
Sakshi News home page

ఇండియాలో కన్నా ఇక్కడే దారుణం: కౌశల్‌ భార్య

Jun 3 2021 10:52 AM | Updated on Jun 3 2021 5:39 PM

Kaushal Manda Wife Neelima Release Video About Her Health - Sakshi

ఇండియాలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటారు. కానీ ఇక్కడే ఘోరంగా ఉంది. కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలాక శ్వాస సమస్యలు..

కౌశల్‌ మండా.. బిగ్‌బాస్‌ రియాలిటీ షో ద్వారా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న​ అతడు ఇటీవల తన భార్య నీలిమ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. 'ఏదో సాధించాలని వెళ్లిపోయావు.. ఏదో ఒకటి సాధించాలని జీవితంతో పోరాడుతున్నావు, నీకున్న ధైర్యంతో అది సాధిస్తావని తెలుసు, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా, లవ్‌ యూ, మిస్‌ యూ నీలిమ' అంటూ సోషల్‌ మీడియాలో వరుస పోస్టులు పెట్టాడు. దీంతో కౌశల్‌ భార్యకు ఏమైందంటూ అభిమానులు కలవరపడ్డారు. ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నీలిమ సెల్ఫీ వీడియోను రిలీజ్‌ చేసింది.

"నేను యూకేలో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడ పనిచేసే చోట ఏడు రోజుల క్రితం నాకు కరోనా సోకింది. ఇండియాలో చాలా దారుణమైన, భయంకర పరిస్థితులు ఉన్నాయని అనుకుంటారు. కానీ ఇక్కడే ఘోరంగా ఉంది. కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలాక శ్వాస సమస్యలు ఎదురయ్యాయి. ఛాతీలో నొప్పితో పాటు ఆయాసం కూడా వచ్చింది. నా పరిస్థితి బాగోలేదు, ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని చెప్తే వారు కేవలం పారాసిటమాల్‌ టాబ్లెట్‌ మాత్రమే ఇచ్చారు. పెద్దగా పట్టించుకోలేదు"

"నిజానికి యూకేలో ట్రీట్‌మెంట్‌ గొప్పగా ఉంటుందనుకున్నా, కానీ ఇది నిజంగా ఓ చేదు అనుభవం. ఎమర్జెన్సీ అనగానే ఇండియాలో త్వరగా అడ్మిట్‌ చేసుకుని వైద్యం అందిస్తారు. కానీ ఇక్కడలా కాదు. ఈ విషయంలో నాకు చాలా భయమేసింది. ఇండియాలోనే కరోనాకు మంచి వైద్యం అందిస్తారు. కాబట్టి మీరెవరూ భయపడొద్దు.  మీ అందరి ప్రార్థనల వల్ల ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. ఆక్సిమీటర్‌తో నా పల్స్‌ చెక్‌ చేసుకుంటున్నాను. నేను త్వరలోనే భారత్‌కు తిరిగొస్తాను" అని నీలిమ చెప్పుకొచ్చింది.

చదవండి: భార్యపై కౌశల్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. అభిమానుల ఆందోళన

Nikhil: తొమ్మిది సార్లు ప్రయత్నించినా విఫలం.. నిఖిల్‌ ఆసహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement