యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కరోనాను జయించాడు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. పద్నాలుగు రోజుల క్వారంటైన్ తర్వాత తనకు మరోమారు కోవిడ్ పరీక్షలు చేయించగా నెగెటివ్ వచ్చిందన్నాడు. 'నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అలాగే కరోనా నుంచి బయటపడేందుకు వైద్యసాయం అందించిన కిమ్స్ వైద్యులు ప్రవీణ్ కులకర్ణి, వీరులకు ప్రత్యేక ధన్యవాదాలు. వారు అందించిన సేవల వల్లే ఈ మహమ్మారిని జయించగలిగాను' అని ట్వీట్ చేశాడు.
'కోవిడ్‌ను చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటూ, పాజిటివ్‌గా ఉంటే దీన్ని సునాయాసంగా జయించవచ్చు. ఈ పోరాటంలో మీ ఆత్మస్థైర్యమే అన్నింటికన్నా పెద్ద ఆయుధం. ధైర్యంగా ఉండండి. మాస్కు ధరించండి, ఇంట్లోనే ఉండండి' అని ఎన్టీఆర్ మరో ట్వీట్‌లో సూచించాడు.
Covid 19 needs to be taken very seriously. But it is also a disease that can be beaten with good care and a positive frame of mind. Your will power is your biggest weapon in this fight. Stay strong. Do not panic.
— Jr NTR (@tarak9999) May 25, 2021
Wear a mask. Stay at home.
ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో కొమురం భీమ్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అనంతరం 'కేజీఎఫ్’ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. అనంతరం ‘ఉప్పెన’ ఫేం బుచ్చి బాబు సానా డైరెక్షన్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ.. హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన ఎన్టీఆర్
Comments
Please login to add a commentAdd a comment