Director Gunasekhar Daughter Neelima Engagement Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Gunasekhar Daughter: దర్శకుడు గుణశేఖర్ ఇంట్లో శుభకార్యం

Oct 8 2022 6:13 PM | Updated on Oct 8 2022 10:29 PM

Director Gunasekhar Daughter Neelima Engagement Completed Today  - Sakshi

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడి ఇంట్లో పెళ్లి గంట మోగింది. ఆయన పెద్ద కుమార్తె నీలిమ త్వరలోనే వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నారు. నీలిమ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. రవి ప్రక్యా అనే అబ్బాయితో ఏడడుగులు నడవనుంది. ఈ వేడుకలో వారి కుటుబసభ్యులు, ప్రముఖ సినీనటులు హాజరయ్యారు. ఈ విషయాన్ని గుణశేఖర్ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. 

నీలిమ సైతం తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 'నా జీవిత ప్రయాణం మొదలైంది' అంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో నీలిమ నిర్మాతగా మారారు. గతంలో గుణశేఖర్‌ తెరకెక్కించిన ‘రుద్రమ దేవి’కి చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన ఆమె.. ప్రస్తుతం ‘శాకుంతలం’ చిత్రానికి నిర్మాతగా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement