సమంత తల్లి కావాలనుకుంది కానీ.. సంచలన నిజాలు వెల్లడించిన నీలిమ | Neelima Guna Shocking Comments On Samantha Pregnancy Rumours Goes Viral | Sakshi
Sakshi News home page

ChaySam Divorce: సామ్‌ తల్లి కావాలనుకుంది కానీ..: నీలిమ గుణ

Published Sat, Oct 9 2021 9:14 AM | Last Updated on Sat, Oct 9 2021 1:16 PM

Neelima Guna Shocking Comments On Samantha Pregnancy Rumours Goes Viral - Sakshi

నాగచైతన్య, సమంత తమ వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమంతపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరుగుతోంది. సామ్‌ పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని.. ఇప్పటికే రెండు సార్లు అబార్షన్‌ చేయించుకుందని..అందుకే చైతన్య విడాకులు ఇచ్చాడనే పుకార్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీటిపై సమంత సీరియస్‌ అయింది. ‘నన్ను కొందరు వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి, నాకు అఫైర్స్‌ ఉన్నాయని, అబార్షన్స్‌ చేయించుకున్నానని, నేను అవకాశవాదినని అంటున్నారు. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతో కూడుకున్నది. కొంత స్వాంతన పొందడానికి నన్ను ఒంటరిగా వదిలేయండి’ అని సామ్‌ విజ్ఞప్తి చేసింది. 



ఇదిలా ఉంటే.. చై-సామ్‌ విడాకులపై ‘శాకుంతలం’ నిర్మాత నీలిమ గుణ షాకింగ్‌ విషయాలను వెల్లడిచింది. సమంత పిల్లల్ని కనేందుకు అంతా సిద్దం చేసుకుందని, కానీ ఆగస్ట్‌ నెలలోనే ఏదో జరిగి విడాకులు తీసుకున్నారని చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. చై-సామ్‌ విడాకులపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
(చదవండి: అఫైర్స్‌, అబార్షన్‌ వార్తలపై స్పందించిన సమంత)

‘శాకుంతలం సినిమా కోసం మా నాన్న(దర్శకుడు గుణశేఖర్‌) సమంతను సంప్రదించాడు. అయితే అప్పటికే ఆమె సినిమాలు చేయకూడదని ఫిక్స్‌ అయింది. ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నామని, ఇప్పట్లో మూవీ చేయనని చెప్పింది. కానీ, శాకుంతలం కథ నచ్చడంతో కొన్ని కండిషన్స్‌ పెట్టి ఓకే చెప్పింది. త్వరగా షూటింగ్‌ పూర్తి చేయాలని చెప్పింది. ఈ మూవీ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకోవాలని సమంత నిర్ణయం తీసుకుంది. ఆమె తల్లి కావాలని కోరుకుంది. జూలై, ఆగస్ట్‌లోకెల్లా షూటింగ్ పూర్తిచేయాలని సామ్‌ కోరడంతో.. మేము ఓకే చెప్పి అలానే ప్లాన్‌ చేసుకున్నాం. ఆమె సినిమాలకు విరామం ఇచ్చి, పిల్లల్ని కనేందుకు ప్లాన్‌ చేసుకుంది. తన ప్రాధాన్యత అదేనని చెప్పింది. కానీ ఇప్పుడు చై-సామ్‌లు విడిపోవడం షాకింగ్‌గా ఉంది’ అని నీలిమా చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement