sakuntala
-
సమంత తల్లి కావాలనుకుంది కానీ.. సంచలన నిజాలు వెల్లడించిన నీలిమ
నాగచైతన్య, సమంత తమ వైవాహిక జీవితానికి ఫుల్స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమంతపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. సామ్ పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని.. ఇప్పటికే రెండు సార్లు అబార్షన్ చేయించుకుందని..అందుకే చైతన్య విడాకులు ఇచ్చాడనే పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీటిపై సమంత సీరియస్ అయింది. ‘నన్ను కొందరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, నాకు అఫైర్స్ ఉన్నాయని, అబార్షన్స్ చేయించుకున్నానని, నేను అవకాశవాదినని అంటున్నారు. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతో కూడుకున్నది. కొంత స్వాంతన పొందడానికి నన్ను ఒంటరిగా వదిలేయండి’ అని సామ్ విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉంటే.. చై-సామ్ విడాకులపై ‘శాకుంతలం’ నిర్మాత నీలిమ గుణ షాకింగ్ విషయాలను వెల్లడిచింది. సమంత పిల్లల్ని కనేందుకు అంతా సిద్దం చేసుకుందని, కానీ ఆగస్ట్ నెలలోనే ఏదో జరిగి విడాకులు తీసుకున్నారని చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. చై-సామ్ విడాకులపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. (చదవండి: అఫైర్స్, అబార్షన్ వార్తలపై స్పందించిన సమంత) ‘శాకుంతలం సినిమా కోసం మా నాన్న(దర్శకుడు గుణశేఖర్) సమంతను సంప్రదించాడు. అయితే అప్పటికే ఆమె సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయింది. ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నామని, ఇప్పట్లో మూవీ చేయనని చెప్పింది. కానీ, శాకుంతలం కథ నచ్చడంతో కొన్ని కండిషన్స్ పెట్టి ఓకే చెప్పింది. త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చెప్పింది. ఈ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకోవాలని సమంత నిర్ణయం తీసుకుంది. ఆమె తల్లి కావాలని కోరుకుంది. జూలై, ఆగస్ట్‌లోకెల్లా షూటింగ్ పూర్తిచేయాలని సామ్ కోరడంతో.. మేము ఓకే చెప్పి అలానే ప్లాన్ చేసుకున్నాం. ఆమె సినిమాలకు విరామం ఇచ్చి, పిల్లల్ని కనేందుకు ప్లాన్ చేసుకుంది. తన ప్రాధాన్యత అదేనని చెప్పింది. కానీ ఇప్పుడు చై-సామ్‌లు విడిపోవడం షాకింగ్‌గా ఉంది’ అని నీలిమా చెప్పుకొచ్చింది. -
హాస్టల్లో ఉండలేక.. చున్నీతో ఉరేసుకుంది
మామడ(ఆదిలాబాద్ జిల్లా): మామడ మండలం కొరటికల్ గ్రామంలో శకుంతల(20) అనే యువతి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల టీటీసీ పరీక్ష రాసింది. కౌన్సెలింగ్‌లో మొదటిదశలో సీటు రాకపోవడంతో కన్వీనర్ కోటాలో సిద్ధిపేటలోని ఓ కాలేజీలో చేరి హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. నాలుగు రోజుల క్రితమే స్వగ్రామం వచ్చింది. తల్లిదండ్రులను వదిలి హాస్టల్లో ఉండలేక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చున్నీతో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. స్థానిక ఎస్ఐ మల్లేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త వద్దకు పంపాలంటూ పోరాటం
-
అత్తింట్లో యువతి పోరాటం
రేపల్లె రూరల్, న్యూస్‌లైన్ :తన భర్త హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంటే.. తాను అత్తవారింట్లో ఉండడమేంటని ప్రశ్నిస్తూ.. తనను భర్తతో కాపురానికి పంపించాలంటూ ఓ యువతి అత్తవారింట్లో నిరాహార దీక్ష చేపట్టింది. సేకరించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని 8వ వార్డులో ఉంటున్న వీసం రామారావు రెండో కుమారుడు శ్రీధర్‌కు చెరుకుపల్లికి చెందిన అన్నం పుల్లారావు కుమార్తె శకుంతల నాగార్జునతో 2011లో వివాహం చేశారు. హైదరాబాద్‌లో హెచ్ఎస్బీసీలో సాఫ్ట్వేర్ విభాగంలో పనిచేస్తున్న శ్రీధర్ పెళ్లయ్యాక 15 రోజులకోసారి ఇక్కడకు వచ్చి ఒకరోజు ఉండి వెళుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కాపురం పెట్టాలని శకుంతల బంధువులు శ్రీధర్ తల్లిదండ్రులను కోరగా అంగీకరించారు. దీంతో ఏడాది క్రితం రెండు లక్షలు విలువైన ఇంటి సామానును హైదరాబాద్‌కు పంపించారు .ఇంతలో అత్తమామలతో పాటు అత్త తమ్ముడు దిల్‌బాబు కలిసి శ్రీధర్‌కు మేనకోడల్ని ఇచ్చి పెళ్లిచేయాలని కుట్రపన్నారు. కాపురం పెట్టడానికి శకుంతలను హైదరాబాద్ తీసుకువెళ్లి కొద్దిరోజులకే మళ్లీ రేపల్లెకు తీసుకువచ్చారు. అత్తింటివారు పథకం ప్రకారం ఆమెను మానసికంగా హింసించి పుట్టింటికి పంపించారు. దీంతో శకుంతల బంధువులు ఆమె అత్తమామలను ప్రశ్నించగా కాపురం అప్పుడు పెడతాం .. ఇప్పుడు పెడతామంటూ దాటవేస్తూ వచ్చారు. పెద్దమనుషుల జోక్యంతో కాపురానికి తీసుకువెళతామన్న అత్తమామలు దాటవేసే ధోరణిని అవలంబించసాగారు. దీంతో మానసిక వ్యధకు గురైన శకుంతల, ఆమె బంధువులు పెద్ద మనుషులను తీసుకుని అత్తవారింటికి వ చ్చి నిరాహార దీక్ష ప్రారంభించింది. తనను భర్తతో కాపురానికి పంపించి, తనకు న్యాయం చేయాలని శకుంతల విలపించింది. వివాహ సమయంలో భారీగా కట్నకానుకలు కూడా ఇచ్చినట్లు ఆమె బంధువులు చెబుతున్నారు. కృష్ణబలిజ సంఘం మద్దతు.. ఏడాదిన్నర కాలంగా కాపురానికి పంపిస్తామని వీసం రామారావు దంపతులు మభ్యపెడుతూ శకుంతలకు అన్యాయం చేయడం సరైన విధానం కాదని కృష్ణబలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నం రాఘవయ్య అన్నారు. న్యాయం జరిగే వరకు సామాజిక పోరాటం చేస్తున్న శకుంతలకు అండ గా ఉంటామన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగమని లక్షలు కట్నం తీసుకుని ఆడపిల్లను చిత్రహింసలు పెట్టడాన్ని సమాజం హర్షించదని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బొమ్మిడి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయపోరాటం చేస్తున్న శకుంతలకు మద్దతు ప్రకటించారు.