Guna Shekhar
-
గుణశేఖర్ 'యుఫోరియా' గ్లింప్స్.. ఈసారి కొత్తగా ప్లాన్ చేశాడుగా!
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ రూటు మార్చాడు. ఈసారి భారీ బడ్జెట్ చిత్రాలు కాకుండా సింపుల్‌గా ఉండేలా యూత్‌కు కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ఎంచుకున్నాడు. 'వరల్డ్ ఆఫ్ యుఫోరియా' సినిమా తెరకెక్కించాడు. ఇందులో భూమిక ప్రధాన పాత్రలో నటించగా సారా అర్జున్, నాజర్, రోహిత్, పృథ్వీరాజ్, లిఖిత కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.గ్లింప్స్‌లో డ్రగ్స్, అత్యాచారం వంటి సీరియస్ అంశాలను చూపించారు. ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందించాడు. చాలా రోజుల తర్వాత హిట్ కోసం ఆరాటపడుతున్న గుణశేఖర్‌కు యుఫోరియా తిరిగి సక్సెస్‌ను ఇచ్చేట్లు కనిపిస్తోంది. నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీన్ కె పోతన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. -
చిరంజీవి 'చూడాలని ఉంది' సినిమాకు 25 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన 'చూడాలని ఉంది' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1998వ సంవత్సరం.. ఆగష్టు 27న విడుదలైన ఈ చిత్రం నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటుంది. అప్పట్లో ఒకే రకం ఫక్తు హీరోయిజం ఉన్న పాత్రల్లో కనిపిస్తున్న చిరంజీవి.. హిట్లర్ నుంచి రూట్ మార్చారు. తన హీరోయిజం పక్కనబెట్టి కాసింత కొత్తదనం ఉన్న కథలను ఎంచుకునే క్రమంలోనే 'చూడాలని ఉంది' సినిమా విడుదల అయింది. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం హైలెట్‌గా నిలిచింది. ఇందులో సౌందర్యతో పాటు అంజల ఝవేరి, ప్రకాశ్‌రాజ్ అద్భుతంగా ప్రేక్షకులను మెప్పించారు. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా కూడా ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. అంతలా కథను గుణశేఖర్ రాసుకున్నాడు. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. సినిమా ప్రకటనతో ఫ్యాన్స్‌లో ఆందోళన మెగాస్టార్‌కు స్టార్ ఇమేజ్‌తో పాటు అప్పటికే ఆయన వరుసగా 6 హిట్లు కొట్టి దూసుకుపోతున్నాడు… అందులోనూ టాలీవుడ్లో మాస్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉన్న హీరో... దీంతో ఆయన తర్వాత తీయబోయే సినిమా ఏంటి అని అంతటా చర్చా... ఆ సమయంలో 'చూడాలని ఉంది' అనే క్లాస్ టైటిల్‌తో సినిమా చెయ్యడం ఏంటి..? అది కూడా అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన యంగ్ డైరెక్టర్ అయిన గుణశేఖర్‌కు ఛాన్స్ ఇవ్వడం ఏంటని అప్పట్లో చిరు డై హార్డ్ ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడ్డారు. అంతేకాకుండా సినిమాపై కూడా వారు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. ఎందుకంటే..? ఈ సినిమాకు ముందు రామ్ గోపాల్ వర్మ, సింగీతం శ్రీనివాసరావులతో చిరంజీవి-అశ్వనిదత్‌లు చేయాల్సిన రెండు సినిమాలు స్టార్ట్ అయ్యి అర్థాంతరంగా ఆగిపోయాయి. కానీ మెగాస్టార్ డేట్స్ చేతిలో ఉండి కూడా సినిమా తీయలేకపోతున్నాను అనే బాధ అశ్వనిదత్లో ఉంది. అలాంటి సమయంలో ఒక కథను గుణశేఖర్ ఆయన వద్దకు పట్టుకొచ్చాడు. దీంతో కథ కూడా ఆయనకు నచ్చడం ఆపై వెంటనే చిరంజీవి వద్దకు గుణశేఖర్‌ను పంపించడం వంటివి జరిగిపోయాయి. చిరంజీవిని గుణ కలవడం అదే తొలిసారి కూడా.. కానీ 'చూడాలని ఉంది' అనే టైటిల్‌ను మాత్రం మెగాస్టారే సెలెక్ట్ చేశారని అప్పట్లో గుణ చెప్పాడు. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో కోల్కత్తా బ్యాక్ డ్రాప్లో భారీ అపార్ట్ మెంట్ సెట్‌తో పాటు కొన్ని ఇంటీరియర్స్‌ని ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి నేతృత్వంలో వేశారు. ఇందుకు గాను అప్పట్లో రూ.75 లక్షలు ఖర్చు చేశారు. ఒక సినిమా సెట్ కోసం ఇంత ఖర్చు చేయడం ఏంటని ఇండస్ట్రీలో అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్క సీన్ కోసం రైల్వేస్టేషన్.. సినిమాకు అదే హైలెట్ రైల్వేస్టేషన్లో చిరంజీవి- అంజల ఝవేరి మధ్య లవ్ సీన్ దాదాపు పది నిమిషాలు ఉంటుంది. చిరంజీవికి అసలు డైలాగ్‌లు ఉండవు. ఆయన స్టేషన్లో చైర్ మీద కూర్చొని అమ్మాయిని చూస్తూ ఉంటారు. చిరంజీవికి డైలాగ్ లేకుండా ఒక నిమిషం పాటు సన్నివేశం నడపటం మామూలు విషయం కాదు. అలాంటిది 10 నిమిషాల పాటు ఆ సీన్ రన్ అవుతుంది. ఈ సన్నివేశం తీయడానికి నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు కావాలని గుణశేఖర్ పట్టుబట్టి మరీ నిర్మాత అశ్వనిదత్ను ఒప్పించాడు. అతి కష్టమ్మీద రైల్వే నుంచి అనుమతి లభించడం... ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా చాలా మంది రైళ్లు ఎక్కకుండా స్టేషన్లోనే ఆగిపోయారు. 'చూడాలని ఉంది' సినిమాలో ఇవన్నీ ప్రత్యేకం ► పద్మావతి.. పద్మావతి అనే డైలాగ్‌తో పాటు 'రామ్మా చిలకమ్మా' అనే పాట అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. చిరంజీవికి ఇష్టంలేకపోయినా, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యాన్ని కాదని, ఈ పాట ఉదిత్ నారాయణతో పాడించారు మణిశర్మ. ► చూడాలని ఉంది సినిమాకు రెండు నంది అవార్డులు, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను దక్కించుకుంది. ► డైలాగ్ లేకుండా చిరంజీవి- అంజల ఝవేరి మధ్య పది నిమిషాల పాటు లవ్ సీన్.. ఇది వర్కౌట్ అవుతుందా అని షాకైన అశ్వనీదత్.. తర్వాత సినిమాకు ఇదే హైలెట్‌గా నిలిచింది. ► మాస్టర్ సజ్జా తేజ ( ప్రస్తుతం యంగ్ హీరో) ఈ సినిమాతోనే ఎంట్రీ.. మూవీలో అతన్ని స్విమ్మింగ్ పూల్‌లోకి విసిరేసే సీన్ చేయడానికి ప్రకాష్ రాజ్ ఒప్పుకోలేదట. చిన్న పిల్లాడిని అలా విసరడం బాగోదని అనడంతో ఎలాగోలా ఒప్పించి చేయడంతో ఆ సీన్ బాగా క్లిక్ అయింది. ► కలెక్షన్స్ వర్షం కురిపించిన ఈ సినిమా 63సెంటర్స్‌లో వందరోజులకు పైగానే కొనసాగింది. అప్పట్లో ఈమూవీ 20కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలుకొట్టింది ► బాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన దివంగత సరోజా ఖాన్ కోసం ముంబయి వెళ్లగా చిరు సాంగ్‌కి కంపోజ్ అనగానే బిజీగా ఉన్నాసరే ఆమె ఒకే చేసింది. 'ఓ మారియా సాంగ్'కు గాను ఆమెకు నంది అవార్డు వరించింది. ► ఈ సినిమాలో 'రామ్మా చిలకమ్మా' అనే పాట ఉదిత్ నారాయణ్‌కు తెలుగులో మొదటి పాట. ఆ పాట చాలా హిట్ అయ్యింది. ► అల్లు అరవింద్- అశ్వినిదత్ కలిసి 'చూడాలని ఉంది' చిత్రాన్ని 'కోల్‌కతా మెయిల్' పేరుతో హిందీలో రీమేక్ చేశారు. అందులో హీరోగా అనిల కపూర్ నటించారు. ఈ సినిమాతో చేరో రూ. 6 కోట్లు పోగొట్టుకున్నామని అశ్వినిదత్ తెలిపారు. -
శాకుంతలం టీమ్ తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
సమంత తల్లి కావాలనుకుంది కానీ.. సంచలన నిజాలు వెల్లడించిన నీలిమ
నాగచైతన్య, సమంత తమ వైవాహిక జీవితానికి ఫుల్స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమంతపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. సామ్ పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని.. ఇప్పటికే రెండు సార్లు అబార్షన్ చేయించుకుందని..అందుకే చైతన్య విడాకులు ఇచ్చాడనే పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీటిపై సమంత సీరియస్ అయింది. ‘నన్ను కొందరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, నాకు అఫైర్స్ ఉన్నాయని, అబార్షన్స్ చేయించుకున్నానని, నేను అవకాశవాదినని అంటున్నారు. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతో కూడుకున్నది. కొంత స్వాంతన పొందడానికి నన్ను ఒంటరిగా వదిలేయండి’ అని సామ్ విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉంటే.. చై-సామ్ విడాకులపై ‘శాకుంతలం’ నిర్మాత నీలిమ గుణ షాకింగ్ విషయాలను వెల్లడిచింది. సమంత పిల్లల్ని కనేందుకు అంతా సిద్దం చేసుకుందని, కానీ ఆగస్ట్ నెలలోనే ఏదో జరిగి విడాకులు తీసుకున్నారని చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. చై-సామ్ విడాకులపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. (చదవండి: అఫైర్స్, అబార్షన్ వార్తలపై స్పందించిన సమంత) ‘శాకుంతలం సినిమా కోసం మా నాన్న(దర్శకుడు గుణశేఖర్) సమంతను సంప్రదించాడు. అయితే అప్పటికే ఆమె సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయింది. ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నామని, ఇప్పట్లో మూవీ చేయనని చెప్పింది. కానీ, శాకుంతలం కథ నచ్చడంతో కొన్ని కండిషన్స్ పెట్టి ఓకే చెప్పింది. త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చెప్పింది. ఈ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకోవాలని సమంత నిర్ణయం తీసుకుంది. ఆమె తల్లి కావాలని కోరుకుంది. జూలై, ఆగస్ట్‌లోకెల్లా షూటింగ్ పూర్తిచేయాలని సామ్ కోరడంతో.. మేము ఓకే చెప్పి అలానే ప్లాన్ చేసుకున్నాం. ఆమె సినిమాలకు విరామం ఇచ్చి, పిల్లల్ని కనేందుకు ప్లాన్ చేసుకుంది. తన ప్రాధాన్యత అదేనని చెప్పింది. కానీ ఇప్పుడు చై-సామ్‌లు విడిపోవడం షాకింగ్‌గా ఉంది’ అని నీలిమా చెప్పుకొచ్చింది. -
‘శాకుంతలం’ టీంకు గుడ్‌బై చెప్పిన సామ్!
సమంత అక్కినేని ప్రస్తుతం నటిస్తున్న చిత్రం శాకుంతలం. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో పాన్ ఇండియా మూవీ చిత్రంగా గుణశేఖర్ తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ చిత్రీకరణలో సమంత పాల్గొన్ని సంగతి తెలిసిందే. కాగా తాజాగా సామ్ శాకుంతలంలో తన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా సమంత వెల్లడించింది. అయితే సమంత షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో శాకుంతలం సెట్లో మూవీ టీం కేక్ కట్ చేయించిన ఫొటోలను ఈ సందర్భంగా ఆమె షేర్ చేసింది. తన పోస్ట్‌లో సమంత.. ‘ఒక చిన్న అమ్మాయిగా నేను అద్భుత కథలను నమ్మాను. అవి పెద్దగా మారలేదు. నా అద్భుతమైన గాడ్ ఫాదర్ గుణశేఖర్ సార్ నా కలను నిజం చేసినందుకు సంతోషంగా ఉంది’ అంటూ శాకుంతలం ప్రాజెక్టు గురించి చెప్పుకొచ్చింది. ‘గుణశేఖర్ నాకు కథ చెప్పినపుడు.. వెంటనే చాలా అందమైన ప్రపంచంలోకి వెళ్లిపోయాను. శాకుంతలం లాంటి ప్రపంచం మరొకటి లేదు అనిపించింది. సెల్యూలాయిడ్ మీద అలాంటి అందమైన ప్రపంచాన్ని సృష్టించడం సాధ్యమేనా..? అనిపించింది. కానీ గుణ శేఖర్ సార్ నా అంచనాలకు మించిన ప్రపంచాన్ని సృష్టించారంది. షూటింగ్లో ఉన్నంత సేపు నాలోని చిన్నపిల్ల ఆనందంతో చిందులేసింది. నేటితో శాకుంతలం టీంకు గుడ్‌బై చెబుతున్నా. గుణ శేఖర్ పట్ల ఎప్పటికి కృతజ్ఞతా భావం ఉంటుంది’ అంటూ సామ్ రాసుకొచ్చింది. కాగా శాకుంతలం చిత్రంలో దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఒకేసారి తెలుగు, హిందీ, తమిళ భాషలలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) -
Shakuntalam: సమంత ఫస్ట్‌లుక్‌పై క్రేజీ అప్డేట్
సమంత హీరోయిన్గా నటిస్తున్న తొలి పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. లాక్డౌన్ సమయంలోనే సెకండ్ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్స్‌ని తిర్చిదిద్దారు. ప్రస్తుతం అందులోనే షూటింగ్ జరుగుతోంది. ‘దిల్’ రాజు, నీలిమా గుణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయింది. The second schedule of #Shaakuntalam begins🐎#EpicLoveStory 🤍@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @DilRajuProdctns @GunaaTeamworks pic.twitter.com/YwGYmFzSkt — Gunaa Teamworks (@GunaaTeamworks) June 28, 2021 ఇదిలా ఉంటే.. శాకుంతలం సినిమా మీద సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. సమంత ఫస్ట్‌లుక్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నిర్మాత నీలిమా గుణ స్పందించారు. ఇప్పుడే రెండో షెడ్యూల్ ప్రారంభించామని, ఫస్ట్‌లుక్ కోసం కొంత సమయం పడుతుందని ట్వీట్ చేశారు. Been getting so many such tweets guys, thank you so much for the love 🤍 but you’ve got to wait a little longer.. we’ve just started our second schedule today, keep the love & support coming ✨🤍 https://t.co/PXJL84NwpN — Neelima Guna (@neelima_guna) June 28, 2021 చదవండి: ఎదుటివారిని ఎంత ప్రేమిస్తున్నారో చెప్పేయండి: అనుష్క -
సమంతకు బంపర్ ఆఫర్ : నయారోల్‌లో
'ఏమాయ చేశావే' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సమంత.. నేడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. మూడేళ్ల క్రితం అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టిన ఈ భామ.. ప్రస్తుతం చేతి నిండా పనులతో బిజీగా ఉన్నారు. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లు, బిజినెస్‌లతో ముందుకు సాగుతున్నారు. దీనికి తోడు సమయం చిక్కినప్పుడల్లా కుటుంబం, స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతుంటారు. ప్రస్తుతం కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా భర్త చైతన్య, స్నేహితులతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సమంత నుంచి ఓ తాజా అప్డేట్ వచ్చింది. చదవండి: అప్పటివరకూ మేం స్నేహితులమే: సమంత సంచలన దర్శకుడు గుణశేఖర్ ఆప కమింగ్ యూవీలో సమంత బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఆయన తెరకెక్కించనున్న భారీ చిత్రం శాకుంతలంలో సమంత మెయిన్ లీడ్‌లో(శకుంతల) నటించనుందని అధికారిక ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలో శాకుంతలం.. కావ్యనాయకి గా సమంత నటించనుందని శుక్రవారం గుణశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్లో మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీనిపై సమంత కూడా ట్విటర్ ద్వారా సంతోషం ప్రకటించారు. విభిన్నమైన పౌరాణిక ప్రణయ గాథగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో సమంత మొదటిసారి పౌరాణిక పాత్రలో అలరించనున్నారు. ఇక ఈ 'శాకుంతలం' సినిమాను జనవరిలో ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తిచేయాలని గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు. అతి త్వరలో ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా సమంత ఈ సినిమాలో నటించనుందనే విషయం తెలిసిన వెంటనే సామ్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. అయితే దుష్యంత మహారాజుగా ఎవరు కనిపిస్తారు? అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. శాకుంతలం..కావ్యనాయకి.. 🤍 Shaakuntalam.. Kavyanayaki.. Here's the BIG REVEAL Motion poster https://t.co/S46JDIHmUN#Shaakuntalam#EpicLoveStory #MythologyForMillennials@Gunasekhar1 @neelima_guna #ManiSharma @GunaaTeamworks — Gunasekhar (@Gunasekhar1) January 1, 2021 -
నాలుగేళ్ల తర్వాత...
అదిగో ఇదిగో అంటూ సినీప్రేక్షకులను ఊరిస్తూ వస్తున్న రానా ‘హిరణ్యకశ్యప’ సినిమా అధికారిక ప్రకటన రానే వచ్చింది. దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘‘మైథలాజికల్ ఫిల్మ్ ‘హిరణ్యకశ్యప’పై నేను వర్క్ చేస్తున్నాను. నటుడు రానా దగ్గుబాటి టైటిల్ రోల్ చేయనున్నారు. విస్తృత స్థాయిలో మూడేళ్లుగా ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవును.. మూడేళ్లుగా చేస్తూనే ఉన్నాం. చాలా ఉత్తేజంగా ఉన్నాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం. రానాతో ఇది ఎగై్జటింగ్ జర్నీగా ఉండబోతోంది’’ అని దర్శకుడు గుణశేఖర్ వెల్లడించారు. ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మైథలాజికల్ సినిమా కాబట్టి గ్రాఫిక్స్ వర్క్ కూడా బాగానే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సంగతి ఇలా ఉంచితే ... 2015లో వచ్చిన పీరియాడికల్ మూవీ ‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ‘అరణ్య’ సినిమాతో రానా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. -
జూన్ నుంచి రోలింగ్
పీరియాడికల్ చిత్రాలు, ప్యాన్ ఇండియా చిత్రాలపై రానా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారన్న సంగతి ఆయన సినిమాల ఎంపిక విషయాన్ని చూసి గమనించవచ్చు. ‘హాధీమేరీ సాథీ, 1945’ వంటి బహుబాషా చిత్రాలతోప్రస్తుతం బిజీగా ఉన్నారు రానా. ఇది వరకే అంగీకరించిన ‘హిరణ్యకశిప’ చిత్రాన్ని జూన్ నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట. గుణశేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సుమారు 180 కోట్ల బడ్జెట్‌తో సురేశ్‌బాబు నిర్మించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయని సమాచారం. ఈ చిత్ర వీఎఫ్ఎక్స్కు సుమారు 17 వీఎఫ్ఎక్స్ స్టూడియోలు పని చేయనున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
జరిగిన అన్యాయం అందరికీ తెలియాలి
‘‘జీవితారాజశేఖర్గారంటే నాకు గౌరవం. ఆవిడ ‘నంది’ అవార్డుల ప్రకటన అవగానే బయటికొచ్చి ‘చంద్రబాబునాయుడుగారు రాకింగ్.. తెలుగుదేశం రాకింగ్’ అన్నారు. ‘మీరు తెలుగుదేశంలో చేరబోతున్నారా? అని కొందరు అడిగితే.. వాళ్లు చేరమంటే ఎందుకు చేరను? అని ఆమె అన్నట్టుగా కొన్ని పేపర్లలో నేను చదివాను. ఇది చదివాక ఆమెపై నాకు విశ్వసనీయత పోయింది. అది పోయినప్పుడు మనం వాళ్ల మాటలని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తోంది’’ అని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నంది అవార్డులపై తన అభిప్రాయాలను చెప్పారు. వర్మగారిని నిందించడం తగదు దర్శకులు రామ్‌గోపాల్‌వర్మగారి మీద మరో దర్శకుడు మద్దినేని రమేశ్‌గారు చేసిన ఆరోపణలు, ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు సాటి దర్శకుడిగా బాధ కలిగించాయి. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన ఎందుకంత తీవ్ర పదజాలంతో వాడకూడని భాష వాడాల్సి వచ్చిందన్నదే నా బాధ. దాసరి నారాయణరావుగారి తర్వాత యువ దర్శకులందరికీ మంచి గుర్తింపు తీసుకొచ్చారు వర్మ. ఆయనే మాకు స్ఫూర్తి అని ఈ రోజుకి కూడా కొత్త దర్శకులు చెప్పుకుంటున్నారు. అలాంటి ఆయన్ను తీవ్ర పదజాలంతో మాట్లాడటం తగదు. దయచేసి ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని రమేశ్‌గారిని కోరుతున్నా. వర్మగారి మాటలు వ్యంగ్య బాణాల్లాంటివి. ఆయన మాటల్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. కానీ, మద్దినేని రమేశ్‌గారు ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. ఆయన వ్యంగ్య మాటల నుంచి కొన్ని రియలైజ్ అవ్వాలి, మరికొన్ని నవ్వి ఊరుకోవాలి తప్పితే ఇలా మాట్లాడకూడదు. ఆ మధ్య ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు’ సినిమాలోని ఓ పాటలో ఆయన్ని ఆయనే విమర్శించుకుని మమ్మల్నీ తీవ్రంగా విమర్శించడంతో మేం నవ్వుకున్నాం. నా గురించి ఏం రాశారా? అని బోయపాటి శ్రీను తెలుసుకుని మరీ నవ్వుకున్నారట. వర్మలా ప్రశ్నించే వ్యక్తిని మనమెప్పుడూ దూషించకూడదు. మనం వాళ్లకీ, వీళ్లకీ భయపడుతుంటాం. కానీ, ఆయన కల్మషం లేకుండా మాట్లాడేస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఇక మాట్లాడకుండా చేయకూడదు. ఆయన లాంటోళ్లు మాట్లాడితే మంచిది. ఆర్కే లక్ష్మణ్‌గారు, కార్టూనిస్ట్ శ్రీధర్‌గారు, దర్శకుడు బాలాగారు.. వారివన్నీ వ్యంగ్యాస్త్రాలు. అవి హాని కలిగించేవి కావు. వాళ్ల ధోరణిలో సమాజాన్ని చూస్తుంటారు. మహామహులు దాన్ని స్పోర్టివ్‌గా తీసుకున్నారు. నా వెనక శక్తులేం లేవు! నిన్న, మొన్న చాలామంది అన్నారు. అస్సలు ఈ గుణశేఖర్ ఎవడు? ‘రుద్రమదేవి’ సినిమా రిలీజ్ అయి రెండు మూడేళ్లయింది. ఇప్పుడు మళ్లీ ట్యాక్స్ మినహాయింపు, నాకు అన్యాయం జరిగిందని అంటాడేంటి? అసలు తను దరఖాస్తు సరిగ్గా చేయలేదు. రిలీజ్ అయ్యాక చేశాడు. ముందే చేసుంటే పన్ను మినహాయింపు మా తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకివ్వదు? తప్పంతా ఆయనలోనే పెట్టుకుని ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే ఆయన వెనక ఏమైనా శక్తులున్నాయా? అంటున్నారు. నా వెనుక శక్తులేమీ లేవు నేనొక్కడినే. జ్యూరీ సభ్యులు టి.ప్రసన్నకుమార్‌గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ‘రుద్రమదేవి’ విడుదలయ్యాక దరఖాస్తు చేశారని. నేను రిలీజ్‌కి ముందే అప్లై చేశాను. 2015 అక్టోబర్ 9న రిలీజ్. 7వ తేదీ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్ ఉంటే తప్ప పన్ను మినహాయింపుకు దరఖాస్తు చేసుకోలేం. అక్టోబర్ 8న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు దరఖాస్తు చేశా. వాళ్లు ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. కానీ, ఏపీ స్పందించలేదు. 12న చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లంగారు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి ఒక నోటీస్ కూడా పంపించారు. నాకూ ఒక సీసీ పంపించారు. పన్ను మినహాయింపు కోసం ఒక స్క్రీనింగ్ కమిటీ వేసి పరిశీలించ మని ఆ నోటీస్‌లో ఉంది. కానీ, హైదరాబాద్ నుంచి ఆఫీసు విజయవాడకి సర్దుతున్నాం ఒక నెల ఆగమన్నారు. ఆ తర్వాత ఫైళ్లన్నీ సర్దుతున్నాం మరో నెల పడుతుందంటూ కాలయాపన చేశారు. మూణ్నెల్ల తర్వాత ఫైల్ క్లోజ్ చేయమని మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. షాక్ అయి, నేను దరఖాస్తు చేసిన, చీఫ్ సెక్రటరీగారు ఇచ్చిన కాపీలతో వైజాగ్ వెళ్లి మంత్రి అయ్యన్న పాత్రుడిని కలిశా. అజయ్ కల్లంగారిచ్చిన నోటీస్ చూసి, ‘ఆదేశాలున్నా ఎందుకు కమిటీ వేయలేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుందాం. నేను అమరావతికి వెళ్లినప్పుడు చెబుతాను నువ్వు కూడా రా’ అన్నారు. ఆ తర్వాత ఆయన్నుంచి నాకు కాల్ రాలేదు. నేనే ఫోన్ చేస్తే, లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ పెట్టినా స్పందించకపోవడంతో వదిలే శా. ఆ తర్వాత మంత్రి గంటా శ్రీనివాసరావుగారిని కలిశా. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకి పన్ను మినహాయింపు ఇచ్చేందుకు అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ పెట్టారు. ఆ సమావేశంలోనే ‘రుద్రమదేవి’ సినిమా విషయాన్ని ప్రస్తావిస్తా అన్నారు. ఆ తర్వాత ఆయన్నుంచి కూడా రెస్పాన్స్ లేదు. దాదాపు 70–80 కోట్లతో ‘రుద్రమదేవి’ లాంటి చారిత్రాత్మక సినిమా నిర్మించాను కాబట్టి, ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తే, మంచి సపోర్ట్ అవుతుందని భావించా. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కదా.. ఏపీ కూడా ఇస్తే నాకు సపోర్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతో నా వైపు నుంచి ఎటువంటి తప్పిదం లేకుండా దరఖాస్తు చేశా. నాకు సమాధానం రాలేదు కాబట్టే చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా లేఖ రాశా. ఆయన్ని విమర్శించలేదు. నాకు జరిగిన అన్యాయాన్ని వివరించా. ఆ నిబంధన తీసేయాలి నంది అవార్డుల విషయానికొస్తే ప్రతి సంవత్సరం విమర్శలుంటాయి. రానివాళ్లు అసంతృప్తి వెళ్లబుచ్చడం కరెక్టే. కానీ, ఈ ఏడాది.. మా అసంతృప్తిని వెళ్లగక్కడానికి కూడా వీలు లేకుండా ఓ నియమం పెట్టారు. అవార్డు రాకుంటే బహిరంగంగా విమర్శించకూడదనీ, అలా చేస్తే మరో మూడేళ్లు వారు దరఖాస్తు చేసుకోవడానికి కుదరదని దరఖాస్తులో పేర్కొనడం కరెక్ట్ కాదు. అందువల్ల బయటకి వచ్చి మాట్లాడాలంటే భయమేస్తోంది. మాలాంటి వాళ్లకి ఇప్పుడూ అవార్డులు రాక.. తర్వాత మరో మూడేళ్లు అవార్డులు రాకుంటే ఎలా సార్? అని అప్కమింVŠ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ నాతో అన్నారు. అడిగే హక్కు మాకు ఉంటుంది. ప్రతి సంవత్సరం విమర్శలు వస్తుంటాయి. నేను అవార్డు పొందినప్పుడు కూడా ఎవరో ఒక్కరు విమర్శించినవాళ్లే. ఎవరూ కూడా ఒక స్థాయికి మించి విమర్శించరు. ఓ స్థాయికి మించి విమర్శిస్తే సుమోటాగా స్వీకరించి చర్యలు తీసుకోవచ్చు. నాకు రాలేదు, ఎందుకు రాలేదు? అని ఎవరి హద్దులో వారు అడగొచ్చు. అది తప్పుకాదు? మెసేజ్ కనిపించలేదా? ‘రుద్రమదేవి’ సినిమా విడుదలైంది 2015లో. ఆ సంవత్సరం జ్యూరీ చైర్మన్ జీవితాగారు. మా విమర్శలను కొందరు మీడియా మిత్రులు ఆమె వద్ద ప్రస్తావించగా.. ఆవిడ స్పందించారు. ఉత్తమ చిత్రం విభాగంలో ‘బాహుబలి’తో ‘రుద్రమదేవి’ అన్ని విభాగాల్లో పోటీ పడలేకపోయింది. అందువల్ల ‘బాహుబలి’కి ఇచ్చాం అన్నారామె. పోటీ పడ్డప్పుడు ఉత్తమ చిత్రంగా రాకపోతే ఆ పోటీ పడ్డ సినిమా రన్నరప్ కింద అవుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం అవుతుంది కదా అని కొందరంటే.. జ్యూరీ కన్సిడర్ చేయడానికి కూడా చాలా గట్టి పోటీ ఉందని చెప్పారట. అంటే.. జ్యూరీలో ఉన్న సినిమాలకి కూడా మీరు తీసిన చారిత్రాత్మక చిత్రం పోటీ పడలేకపోయిందా? సార్ అని కొందరు నాతో అన్నారు. దర్శకత్వం విభాగంలో పోటీ పడలేదంటే డైరెక్టర్‌గా రాదు. టోటల్ సినిమాలో సమాజానికి మేలు చేసే ఒక మెసేజ్ ఉంది అనుకున్నప్పుడు కచ్చితంగా ఉత్తమ మూడు చిత్రాల విభాగంలో ఏదో ఒకటి ఇస్తారు. దీనికంటే వేరే సినిమాలు గొప్ప మెసేజ్ ఇస్తున్నాయంటే కనీసం జ్యూరీ కింద ఇస్తారు. మరి ‘రుద్రమదేవి’ కంటే మిగతా సినిమాల్లో ఏం సందేశం కనిపించిందో తెలియడం లేదు. జ్యూరీ బాధ్యతగా వ్యవహరించాలి. ఎక్కువ మంది సినిమావాళ్లనే పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. రాజకీయ లబ్ధి పొందేవారు అస్సలు ఉండకూడదు. అవార్డులు ప్రకటించి బయటికొచ్చి ఓ ప్రభుత్వాన్ని జీవితగారు మెచ్చుకున్నారంటే.. ఏదో రాజకీయ లబ్ధి ఆశించే అనుకుంటారు. రాజకీయ ప్రయోజనాల కోసం కళాభిమానుల కష్టాన్ని పణంగా పెట్టొద్దని విన్నవించుకుంటున్నా.అల్లు అర్జున్ విషయంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అప్లై చేశారని చెప్పారు. సహాయ నటుడిగానే దరఖాస్తు చేశా. సహాయ నటుడిగానే అప్లయ్ చేసినా, ఎస్వీ రంగారావు పేరు మీద ఉంది కదా అని క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇచ్చాం అన్నారు. మేం ఏ కేటగిరీకి దరఖాస్తు చేశామో దాన్ని వారు మార్చడానికి లేదు. రంగారావుగారి పేరు మీద ఉంది కదా అని క్యారెక్టర్ ఆర్టిస్టు అవార్డు ఇచ్చామంటే సహాయ నటుడి అవార్డుని తగ్గించినట్లవుతుంది కదా? ఇప్పుడు చాలామంది జాతీయ అవార్డులని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. జాతీయ అవార్డు గైడ్‌లైన్స్ వేరు.. నంది అవార్డు గైడ్‌లైన్స్ వేరు. మనకి మన ప్రాంతీయత, సంస్కృతిపైన ఆధారపడి ఉంటాయి. అలా ‘రుద్రమదేవి’ విషయానికొస్తే.. కొన్నింటిలో వాళ్లకి కన్వీనెంట్‌గా ఉన్నవి జాతీయ అవార్డులతో కంపేర్ చేసుకుంటున్నారు. కన్వీనెంట్‌గా లేనివి మనది వేరు కదా అంటున్నారు. ‘రుద్రమదేవి’కి జాతీయ అవార్డులో ఉత్తమ ప్రాంతీయ చిత్రం రానందుకు నాకు ఏమాత్రం అసంతృప్తి లేదు. ‘కంచె’ సినిమాకి ఇచ్చారు. ఆ సినిమా నా దృష్టిలో ‘రుద్రమదేవి’ కంటే గొప్ప సందేశం ఇచ్చిన సినిమా. అది కుల వ్యవస్థ మీద పోరాడే, ప్రశ్నించే సినిమా. ‘కంచె’కి అవార్డు రావడంతో తొలుత షాక్ అయ్యా. కథ విన్నాక కరెక్టే అనిపించింది. ‘రుద్రమదేవి’లో తెలుగువారు మరచిపోతున్న చరిత్రను చూపించా. దర్శకత్వమో, మరొకటో నాసిరకంగా కనిపించి ఉండవచ్చు. కానీ, సినిమా ఇచ్చిన సందేశం అందలేదా? అందువల్ల నేను అప్సెట్ అయ్యానే కానీ, ఉత్తమ దర్శకుడి అవార్డు రాలేదనే బాధ లేదు. ‘బాహుబలి’ బెటర్ సినిమానే. రాజమౌళికి అవార్డు ఇచ్చినందకు హ్యాపీ. కానీ, ‘రుద్రమ దేవి’లో సందేశం లేదా? సాటి మహిళ జ్యూరీలో ఉండి కూడా మహిళా సాధికారత మీద తీసిన సినిమాకి న్యాయం జరగలేదంటే ఏమనాలి? ఇండియా కాదు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ అన్నది మేల్ డామినేషన్. అలాంటిది 70–80 కోట్లు పెట్టి ఓ మహిళ మీద సినిమా తీశాడే. చెడగొట్టాడే. అయినా వీడి సందేశం బాగుందే. ప్రయత్నాన్ని చిన్నగా తట్టి ప్రోత్సహిద్దామనుకుంటే నాకు లక్షలు వచ్చేయవు కదా? పన్ను మినహాయింపు గురించి నేనిప్పుడు మాట్లాడింది కూడా అది తిరిగి ఇచ్చేస్తారని కాదు. అది సమాధి అయిపోయింది. కానీ, నాకు జరిగిన అన్యాయం అందరికీ తెలియాలి. -
తిరుపతి సైకిల్‌కి అమరావతిలో రిపేర్
♦ నగర అధ్యక్షుని ఎంపికలో బయల్పడ్డ స్పర్థలు ♦ భాస్కర్‌యాదవ్, గుణశేఖర్‌ల మధ్యనే పోటీ ♦ రెండు గ్రూపులుగా విడిపోయిన పార్టీ నేతలు ♦ నేడో రేపో పేరు ప్రకటించనున్న పార్టీ అధిష్టానం తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర కమిటీ అధ్యక్షుని ఎంపిక ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నగర నాయకుల మధ్య సఖ్యత, సమన్వయం లోపించిన కారణంగా అధ్యక్ష పదవికి పోటీ ఏర్పడింది. పార్టీ ఎమ్మెల్యే ఒకరి పేరు చెబుతుంటే, మెజార్టీ నాయకులు మరొకరి పేరు చెబుతున్నారు. దీంతో పరిశీలకులుగా హాజరైన నాయకులు సైతం తలలు పట్టుకుని నిర్ణయం చెప్పకుండానే ఉడాయించారు. దీంతో రెండు గ్రూపులుగా చీలిన పార్టీ నగర నేతలు మంత్రి అమరనాథరెడ్డి దగ్గర పంచాయితీ పెట్టారు. నేడో రేపో పార్టీ అధిష్టానం నూతన అధ్యక్షుడి పేరును ప్రకటించే వీలుందని సమాచారం. సాక్షి ప్రతినిధి, తిరుపతి : టీడీపీ తిరుపతి నగర కమిటీ ఎంపిక వివాదం అమరావతికి చేరింది. ఇందుకోసం తిరుపతి నగర పార్టీ నాయకుల్ని అమరావతి పిలిపించుకుని మాట్లాడేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమైంది. ప్రస్తుతం తిరుపతి నగర టీడీపీ అధ్యక్షునిగా దంపూరి భాస్కర్‌యాదవ్ నాలుగేళ్లుగా కొనసాగుతున్నారు. ఈయన పదవీకాలం ముగియడంతో పార్టీ అధిష్టానం నూతన కార్యవర్గ నియామకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మ పది రోజుల కిందట పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేసి పార్టీ ప్రముఖుల అభిప్రాయాలను అడిగారు. కొంతమంది దంపూరి భాస్కర్‌యాదవ్ పేరును, మరికొంత మంది పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న గుణశేఖర్‌నాయుడు పేరును ప్రస్తావించారు. మెజార్టీ నాయకులు గుణశేఖర్ పేరును చెప్పడంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని దంపూరి భాస్కర్యాదవ్నే మళ్లీ అధ్యక్షునిగా కొనసాగించాలని చెప్పారు. మెజార్టీ నాయకులు ఈ నిర్ణయాన్ని విభేదించారు. పరిశీలకుల రాజీ చర్చలు టీడీపీ తిరుపతి నగర అధ్యక్ష పదవికి ఒక పక్క దంపూరి భాస్కర్‌యాదవ్, మరోపక్క గుణశేఖర్ నాయుడు పోటీ పడటంతో పార్టీ రాజీచర్చల కోసం పరిశీలకులను పంపింది. వారం కిందట తిరుపతి చేరుకున్న పార్టీ పరిశీలకులు, ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి స్థానిక హోటల్లో డివిజన్ అధ్యక్ష, కార్యదర్శుల అభిప్రాయాలను సేకరించారు. ఇక్కడ కూడా గుణశేఖర్నాయుడి వైపే మొగ్గు కనిపించింది. అయినప్పటికీ ఎమ్మెల్యే సుగుణమ్మ దంపూరి భాస్కర్ యాదవ్ పేరునే సూచిస్తుండటంతో పార్టీ జిల్లా నాయకులు సందిగ్ధంలో పడ్డారు. విషయాన్ని గుర్తించిన గుణశేఖర్‌నాయుడు గ్రూపు నాయకులందరూ గురువారం మంత్రి అమరనాథరెడ్డిని కలిసి సమస్యను పరిష్కరించాలన్నారు. నగర పార్టీ ప్రముఖులు నరసింహయాదవ్, తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళి తదితరులు గుణశేఖర్‌నాయుడు పక్షాన నిలబడ్డారు.∙ఎమ్మెల్యే నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. తమ అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు. నాలుగేళ్ల పాటు పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన వ్యక్తిని మళ్లీ అధ్యక్షుడిగా చేయాలనుకోవడం ఎంతమాత్రమూ సబబు కాదనీ, కొత్త వారికి అవకాశం కల్పించాలని వీరు గట్టిగా పట్టుబడుతున్నారు. ఐవీఆర్ఎస్ పద్ధతిలో ఎంపిక తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడిని ఐవీఆర్ఎస్ పద్ధతిలో ఎంపిక చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. నగర పార్టీ నాయకులు, వివిధ డివిజన్ల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులకు సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందించి వారి నుంచి అభిప్రాయాలను∙సేకరించే పద్ధతినే ఐవీఆర్ఎస్ పద్ధతి అంటారు. ఎక్కువమంది ఎవరి పేరును సూచిస్తే వారి పేరునే ప్రకటిస్తామని పార్టీ అధిష్టానం చెబుతోంది. అయితే ఎమ్మెల్యే వర్గం మాత్రం దంపూరి పేరునే ఖరారు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి పార్టీ ఏం చేస్తుందో వేచిచూడాల్సిందే. -
ఆ బాధతోనే ఓసారి ఇండస్ట్రీని వదిలివెళ్లిపోయా!
‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’... ఈ ఒక్క డైలాగ్‌తోనే వంద సినిమాలు చేసినంత గుర్తింపును తెచ్చుకున్న నటుడు పృథ్వీ. ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నా... నటనపట్ల మక్కువతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన తాజాగా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘భీమవరం బుల్లోడు తదితర చిత్రాలతో అలరించారు. తన ఆటుపోట్ల సినీప్రయాణం గురించి పృథ్వీ చెప్పిన విశేషాలు... మా అబ్బాయిని చిన్నప్పుడు... ‘బాల రామాయణం’లో ఇంద్రజిత్ పాత్ర కోసం తీసుకున్నారు గుణశేఖర్. ట్రెయినింగ్ కూడా ఇచ్చాక వేరే అబ్బాయిని తీసుకున్నారు. దాంతో డిజప్పాయింట్ అయ్యాడు. ఇక సినిమాల జోలికి రాకూడదని అప్పుడే డిసైడ్ చేసేసుకున్నాడు. మా అమ్మాయి చెన్నై టీసీఎస్‌లో పని చేస్తోంది. తనకీ ఈ ఫీల్డ్ మీద ఆసక్తి లేదు. వాళ్లు వస్తానంటే నాకు అభ్యంతరమూ లేదు! థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ... ఎలా ఉంది ఎక్స్‌పీరియెన్స్? (నవ్వుతూ) నేను ఇండస్ట్రీకొచ్చి ఇంకా థర్టీ ఇయర్స్ అవ్వలేదండీ... ఇరవయ్యేళ్లే అయ్యింది. ‘ఖడ్గం’లోని ఆ డైలాగ్ మీ జీవితాన్నే మార్చేసింది కదా... అందుకని...? అవును. నిజానికి అది ముందు అనుకుని పెట్టిన డైలాగ్ కాదు. వేరే ఏదో అనుకున్నాం. కానీ రోజంతా ఎన్ని టేకులు చేసినా తృప్తికరంగా రాలేదు. సాయంత్రం సడెన్‌గా కృష్ణవంశీ ఆ డైలాగ్ చెప్పారు. అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చింది. నా కెరీర్‌ని మలుపు తిప్పింది. ఆ సిన్మాతోనే మీ గురించి అందరికీ తెలిసింది. అంతకుముందు ఏం సినిమాలు చేశారు? చాలానే చేశాను.‘గండిపేట రహస్యం’ చిత్రంలో హీరోగా చేశాను. అయితే అది పక్కా పొలిటికల్ చిత్రం కావడంతో విడుదల తరువాత చాలా గొడవలయ్యాయి. నేను ఎన్టీయార్‌ని ఇమిటేట్ చేశానని చాలామంది విమర్శించారు. చివరికి ఎన్టీయారే పిలిచి... ‘డెరైక్టర్ చెప్పింది చేశావ్, నీ స్థానంలో ఎవరున్నా అలాగే చేసేవారు, నీ తప్పేమీ లేదు’ అన్నారు. దాంతో నా టెన్షన్ తగ్గింది. మరికొన్ని చిత్రాల్లో కూడా నటించాను కానీ అంత గుర్తింపు రాలేదు. అసలు నటుడవ్వాలని ఎందుకనుకున్నారు? మాది తాడేపల్లిగూడెం. మా నాన్న సుబ్బారావు నటుడే. నాటకాలు, ఓ పదిహేను పౌరాణిక చిత్రాల్లో నటించారు. ఆయన ప్రభావం కొంత ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్.ఏ. చేస్తున్నప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనేవాడిని. అప్పుడందరూ నటుడిగా ట్రై చేయొచ్చుగా అనేవారు. దాంతో ఆసక్తి ఏర్పడింది. నటుడు ప్రభాకర్‌రెడ్డిగారు నాన్న స్నేహితుడు. ఆయన సహకారంతో 1994లో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. ఆయనే నా నట గురువు. సక్సెస్ కావడానికి చాలా టైమ్ పట్టిందే? ఇండస్ట్రీ అలాంటిది. ఇప్పుడంటే చదువుకున్నవాళ్లు వస్తున్నారు, ఎవరి పని వాళ్లు చేసుకుపోతున్నారు, ఎదుటివారిని గౌరవిస్తున్నారు. అప్పట్లో అలా కాదు. చాలా యాటిట్యూడ్ ప్రాబ్లెమ్స్ ఉండేవి. నాకు ఇస్తామన్న రోల్స్ చివరి నిమిషంలో వేరేవాళ్లకి ఇచ్చేసేవారు. చాలా డిజప్పాయింట్ అయ్యేవాడిని. ఇంత చదువుకున్నాం, ఇలా అవమానాలు భరించడం అవసరమా అని కుమిలిపోయేవాడిని. చివరికి ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్లిపోయాను. వెళ్లిపోయారా.. మళ్లీ ఎలా వచ్చారు? నన్ను నటుడిగా చూడాలని మా అమ్మ కలలు కంది. కానీ తన కల నెరవేరకముందే కన్నుమూసింది. ఆ బాధతో కొంత ఇక సినిమాలు వద్దనుకుని, ఓ కాలేజీలో లెక్చెరర్‌గా చేరిపోయాను. కొన్నాళ్ల తర్వాత కృష్ణవంశీ ఫోన్ చేశారు. ఆయనది మా ఊరే కావడంతో నేను ఆయనకు బాగా తెలుసు. ‘ఖడ్గం’లో నటించడానికి రమ్మని పిలిచారు. ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ డైలాగ్‌తో కొత్త జీవితాన్నిచ్చారు. ఇప్పుడు హ్యాపీనా...? హ్యాపీనే. ‘ఆగడు’, ‘అవతారం’తో పాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నాను. ‘గే’ల సమస్యల ఆధారంగా తీసిన ‘థర్డ్ మ్యాన్’ అనే కన్నడ సినిమాలో లీడ్ రోల్ చేశాను. ఇది తెలుగులో కూడా రానుంది. ఏదైనా డ్రీమ్‌రోల్ ఉందా? ‘అంతఃపురం’లో ప్రకాశ్‌రాజ్ పాత్రలాంటిది చేయాలి. అంతేకాదు... కైకాల సత్యనారాయణగారు నా రోల్ మోడల్. ఆయన చేయని పాత్ర లేదు. ఆయనలానే నేను కూడా రకరకాల రోల్స్ చేయాలి. నటన కాకుండా మీకున్న మరో లక్ష్యం? సమాజ సేవ. మనిషిగా పుట్టినందుకు సమాజానికి ఏదైనా చేయాలి. అందుకు రాజకీయాలు ఓ మంచి మార్గమని నా నమ్మకం. అందుకే వైఎస్సార్సీపీలో చేరాను. తీరిక దొరికినప్పుడల్లా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాను. వైఎస్సార్‌ని ఆరాధించేవాడిగానే కాదు... ఓ వ్యక్తిగా ఈ సమాజం పట్ల నా బాధ్యతను కాస్తయినా తీర్చుకోవాలన్నదే నా ఆశ, ఆశయం. - సమీర నేలపూడి -
ప్రభుత్వ పాలన భేష్: గల్లా
పలమనేరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, పథకాలను తెలుగుదేశం ఎంపీ శివప్రసాదే మెచ్చుకుంటున్నారంటే ప్రభుత్వం ప్రజల కోసం ఎంతగా కృషి చేస్తోందో ఇట్టే తెలుసుకోవచ్చని రాష్ట్ర భూగర్భ గనులు,వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు. వి.కోటలో ఆదివారం జరిగిన రచ్చబండ సభలో ఆమె మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ పథకాలను పొగడడం కంటే విమర్శించడమే ఎక్కువన్నారు. అందుకు భిన్నంగా జిల్లా ఎంపీ తమ ప్రభుత్వ పథకాలను మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో ఎన్జీ రంగా లాంటి నాయకులు మాత్రమే ఇలా అందరినీ సమానంగా చూసేవారన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రచ్చబండ అవసరమా అని ఎన్నో విమర్శలు వచ్చాయన్నారు. అయితే ప్రజా సమస్యలకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి సహసోపేత నిర్ణయాన్ని తీసుకోవడం గొప్పవిషయమన్నారు. ప్రతి ఇంట్లో తలుపు తడితే ప్రభుత్వ పథకాలు పలుకరిస్తాయని మంత్రి తెలిపారు. రచ్చబండలో అపశ్రుతి వి.కోట, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లా వీ.కోటలో ఆదివారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గుండె పోటుతో ఒకరు మృతిచెందగా, తొక్కిసలాటలో ఒకరు, అధికారుల కాన్వాయ్ ఢీకొని మరొకరు తీవ్రం గా గాయపడ్డారు. వి.కోట మండలం చింతవూకులపల్లెకు చెందిన గుణశేఖర్(40) ఆదివారం వుధ్యాహ్నం రచ్చబండలో అర్జీ ఇచ్చేందుకు వి.కోటకు వచ్చాడు. ప్రభుత్వ కళాశాలలోని సభా మైదానానికి నడిచివస్తూ ఉద్వేగానికి లోనై గుండెపోటుకు గురయ్యూడు. దారిలో ఒక్కసారిగా కుప్పకూలిపోయూడు. తోడున్న వారు 108కు సవూచారవుందించారు. సిబ్బంది చేరుకునేటప్పటికే బాధితుడు మృతి చెందాడు. మృతితునికి భార్య, పిల్లలు సోనియూ(18), పవిత్ర(16), సంధ్య(13) ఉన్నారు. సొంతింటి కల సాకారం చేసుకొని ఇంటికివస్తాడనుకున్న తండ్రి విగతజీవిగా తిరిగి రావడంతో వారి శోకానికి అంతులేకుండా పోయింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రావుస్తులు సీఎంకు అర్జీ ఇచ్చారు. సభానంతరం వర్షం ప్రారంభం కావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో నాయుకనేరి కొత్తూరుకు చెందిన సుజాతకు కాలు విరిగింది. ఆమెను కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. కేజీఎఫ్ రోడ్లో ద్విచక్రవాహనంపై వెళుతున్న కర్ణాటకలోని వున్నాయునపల్లెకు చెందిన వుణికంఠను అధికారుల కాన్వాయ్ ఢీకొట్టింది. దీంతో అతను తీవ్రంగా గాయుపడ్డాడు.