ప్రభుత్వ పాలన భేష్: గల్లా | Government concluded : Galla Aruna kumari | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాలన భేష్: గల్లా

Published Mon, Nov 25 2013 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM

Government concluded : Galla Aruna kumari

పలమనేరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, పథకాలను తెలుగుదేశం ఎంపీ శివప్రసాదే మెచ్చుకుంటున్నారంటే ప్రభుత్వం ప్రజల కోసం ఎంతగా కృషి చేస్తోందో ఇట్టే  తెలుసుకోవచ్చని రాష్ట్ర  భూగర్భ గనులు,వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు. వి.కోటలో ఆదివారం జరిగిన రచ్చబండ సభలో ఆమె మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ పథకాలను పొగడడం కంటే విమర్శించడమే ఎక్కువన్నారు.

అందుకు భిన్నంగా జిల్లా ఎంపీ తమ ప్రభుత్వ పథకాలను మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో ఎన్‌జీ రంగా లాంటి నాయకులు మాత్రమే ఇలా అందరినీ సమానంగా చూసేవారన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రచ్చబండ అవసరమా అని ఎన్నో విమర్శలు వచ్చాయన్నారు. అయితే ప్రజా సమస్యలకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి సహసోపేత నిర్ణయాన్ని తీసుకోవడం గొప్పవిషయమన్నారు. ప్రతి ఇంట్లో తలుపు తడితే ప్రభుత్వ పథకాలు పలుకరిస్తాయని మంత్రి తెలిపారు.
 
రచ్చబండలో అపశ్రుతి

వి.కోట, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లా వీ.కోటలో ఆదివారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గుండె పోటుతో ఒకరు మృతిచెందగా, తొక్కిసలాటలో ఒకరు, అధికారుల కాన్వాయ్ ఢీకొని మరొకరు తీవ్రం గా గాయపడ్డారు. వి.కోట మండలం చింతవూకులపల్లెకు చెందిన గుణశేఖర్(40) ఆదివారం వుధ్యాహ్నం రచ్చబండలో అర్జీ ఇచ్చేందుకు వి.కోటకు వచ్చాడు.

ప్రభుత్వ కళాశాలలోని సభా మైదానానికి నడిచివస్తూ ఉద్వేగానికి లోనై గుండెపోటుకు గురయ్యూడు. దారిలో ఒక్కసారిగా కుప్పకూలిపోయూడు. తోడున్న వారు 108కు సవూచారవుందించారు. సిబ్బంది చేరుకునేటప్పటికే బాధితుడు మృతి చెందాడు. మృతితునికి భార్య, పిల్లలు సోనియూ(18), పవిత్ర(16), సంధ్య(13) ఉన్నారు. సొంతింటి కల సాకారం చేసుకొని ఇంటికివస్తాడనుకున్న తండ్రి విగతజీవిగా తిరిగి రావడంతో వారి శోకానికి అంతులేకుండా పోయింది.

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రావుస్తులు సీఎంకు అర్జీ ఇచ్చారు. సభానంతరం వర్షం ప్రారంభం కావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో నాయుకనేరి కొత్తూరుకు చెందిన సుజాతకు కాలు విరిగింది. ఆమెను కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. కేజీఎఫ్ రోడ్‌లో ద్విచక్రవాహనంపై వెళుతున్న కర్ణాటకలోని వున్నాయునపల్లెకు చెందిన వుణికంఠను అధికారుల కాన్వాయ్ ఢీకొట్టింది. దీంతో అతను తీవ్రంగా గాయుపడ్డాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement