siva prasad
-
MP Goddeti Madhavi: ఎంపీ అయినా రైతే!
సాక్షి, కొయ్యూరు (విశాఖపట్నం): వరి నూర్పిడి అనంతరం రాశిగా పోసిన ధాన్యాన్ని బస్తాలోకి ఎత్తుతోంది ఎవరో గమనించారా? ఇంకెవరు.. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి. సహజంగానే ఆమె ఎలాంటి అధికార దర్పాన్ని ప్రదర్శించకుండా సాదాసీదాగా ఉంటారు. శరభన్నపాలెంలో శుక్రవారం వారి పొలంలో వరి నూర్పిడి చేశారు. ఆ పనుల్లో ఎంపీతో పాటు, ఆమె భర్త శివప్రసాద్‌లు పాలుపంచుకున్నారు. చదవండి: (ఇలాంటి వాళ్లంతా పేదలకు శత్రువులే: సీఎం జగన్) -
రోజాను హీరోయిన్ చేసింది ఆయనే
తిరుపతి అర్బన్/తిరుపతి కల్చరల్/సాక్షి, చెన్నై/ సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, సినీ నటుడు నారమల్లి శివప్రసాద్ (68) శనివారం మధ్యాహ్నం 2.07 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సమస్యతోపాటు వెన్నునొప్పితో బాధ పడుతున్నారు. తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న శివప్రసాద్‌ను మెరుగైన వైద్యం కోసం ఈ నెల 12వ తేదీన చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయన మృతిచెందారు. శివప్రసాద్ భౌతిక కాయాన్ని చెన్నై నుంచి తిరుపతిలోని హరేరామ్ హరేకృష్ణ రోడ్డు ఎన్జీవో కాలనీలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. అభిమానుల సందర్శన నిమిత్తం ఆదివారం తెల్లవారుజాము వరకు అక్కడే ఉంచనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు శివప్రసాద్ స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పూటిపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శివప్రసాద్ మృతి తమను షాక్‌కు గురి చేసిందని ఆయన అల్లుడు నరసింహప్రసాద్ చెప్పారు. వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి.. నారమల్లి శివప్రసాద్ 1951 జూలై 11న పూటిపల్లిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చెంగమ్మ, నాగయ్య. శివప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అ«భ్యసించారు. కొంతకాలం వైద్యుడిగా సేవలందించారు. అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999లో సత్యవేడులో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మూడేళ్ల పాటు సమాచార, సాంస్కృతిక శాఖల మంత్రిగా పనిచేశారు. 2009, 2014లో చిత్తూరు ఎంపీగా గెలిచారు. 2019లో వైఎస్సార్సీపీ అభ్యర్థి రెడ్డెప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. శివప్రసాద్ ఇద్దరు కుమార్తెలు వైద్యులే. నిరసనల్లో ఆయనది ప్రత్యేక శైలి సామాజిక చైతన్య కార్యక్రమాలంటే శివప్రసాద్‌కు ఎంతో ఇష్టం. ఆయన పేరు చెప్పగానే వెంటనే గుర్తుకొచ్చేది.. వివిధ సమస్యలపై తనదైన వేషధారణలతో చేపట్టిన నిరసనలే. ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ సమావేశాలప్పుడు రోజుకో వేషధారణతో నిరసన తెలిపారు. అందరి దృష్టిని ఆకర్షించారు. రాముడు, కృష్ణుడు, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, హిట్లర్, కరుణానిధి, మాంత్రికుడు తదితర చిత్రవిచిత్రమైన వేషాలతో నిరసన వినిపించారు. ప్రోత్సహించిన వైఎస్సార్, భూమన ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రోత్సాహంతో శివప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారు. భూమన స్థాపించిన వైఎస్సార్ యువసేనలో 1989–97 మధ్య కాలంలో శివప్రసాద్ చురుగ్గా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా శివప్రసాద్‌ను రాజకీయాల్లో ప్రోత్సహిస్తూ వచ్చారు. 1996లో ఎంపీ టికెట్ ఇప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. సినీ రంగంలో తనదైన ముద్ర ‘అమ్మతోడు.. వాడు నన్ను కొట్టలే.. ఉత్తినే ప్రచారం చేసుకుంటున్నాడు’అంటూ ‘ఆటాడిస్తా’ సినిమాలో బోనాల శంకర్‌గా నవ్వులు పూయించిన శివప్రసాద్‌ని ప్రేక్షకులు అంత సులభంగా మరచిపోలేరు. ఆయన వెండితెరపై ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను అలరించి, తనకంటూ గుర్తింపు పొందారు. పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే నాటకాలు వేశారు. 1980లో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ‘కొత్త జీవితాలు’ సినిమాలో తొలిసారిగా నటించారు శివప్రసాద్. అప్పట్లో సినిమా అవకాశం రావడమే గొప్ప. అందుకే పారితోషికం అవసరం లేదని చెప్పారట. తర్వాత వసంత సేన్ దర్శకత్వం వహించిన ‘ఓ అమ్మ కథ’ చిత్రంలో నటించారు. చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఖైదీ’ సినిమాలో నటిస్తున్నప్పుడే ఒకేసారి 17 సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శివప్రసాద్. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను అలరించిన ఆయన 2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘డేంజర్’ సినిమాలో విలన్ పాత్రకు నంది అవార్డు అందుకున్నారు. యముడికి మొగుడు, యమగోల మళ్లీ మొదలైంది, బాలు, జైచిరంజీవ, లక్ష్మి, కితకితలు, తులసి, ఒక్క మగాడు, బలాదూర్, ద్రోణ, మస్కా, పిల్ల జమీందార్, దూసుకెళ్తా వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘సాఫ్ట్వేర్ సుధీర్’ విడుదల కావాల్సి ఉంది. ఓ వైపు నటిస్తూనే మెగాఫోన్ పట్టిన శివప్రసాద్ ‘ప్రేమ తపస్సు, టోపీ రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరోకో’ సినిమాలకు దర్శకత్వం వహించారు. పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. శివప్రసాద్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. హీరోయిన్గా రోజాకు అవకాశం శ్రీలత అనే అమ్మాయిని హీరోయిన్ రోజాగా మార్చింది శివప్రసాదే కావడం గమనార్హం. రాజేంద్రప్రసాద్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన ‘ప్రేమ తపస్సు’ చిత్రంతో రోజాని హీరోయిన్గా పరిచయం చేశారు. శ్రీలతగా ఉన్న ఆమె పేరుని రోజాగా మార్చింది కూడా ఆయనే. ఆ తర్వాత రోజా ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యారో అందరికీ తెలిసిందే. శివప్రసాద్ పదో తరగతిలోనే ‘పరువు కోసం’ అనే డ్రామాలో కామెడీ విలన్‌గా నటించారు. ఎస్వీ మెడికల్ కాలేజీకి ఓసారి తమిళ దర్శకుడు భారతీరాజా రావడంతో ఆయనతో ఏర్పడిన పరిచయం శివప్రసాద్ సినీ రంగ ప్రవేశానికి నాంది పలికింది. సీఎం వైఎస్ జగన్ సంతాపం మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి తీరని లోటు: చంద్రబాబు తన చిరకాల మిత్రుడు శివప్రసాద్ మరణం విచారకరమని ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆయన మృతి చిత్తూరు జిల్లాకే కాకుండా రాష్ట్రానికే తీరని లోటని పేర్కొన్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నేతలను (కోడెల శివప్రసాదరావు, ఎన్.శివప్రసాద్) కోల్పోవడం టీడీపీకి తీరని లోటన్నారు. వ్యక్తిగతంగా నాకు తీరని లోటు: రోజా సినీ, రాజకీయ రంగాలకు తనను పరిచయం చేసిన ఎన్.శివప్రసాద్ మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రికి స్నేహితుడైన శివప్రసాద్ కుటుంబంతో తమకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఆయన లేని లోటు రాజకీయాల్లో, సినీరంగంలో, కుటుంబపరంగా కనిపిస్తోందన్నారు. కాగా, శివప్రసాద్ మృతి పట్ల చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప సంతాపం వ్యక్తం చేశారు. శివప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. శివప్రసాద్ మృతి పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం రాజకీయ, కళారంగానికి తీరని లోటన్నారు. -
టీడీపీ నేత శివప్రసాద్ కన్నుమూత
సాక్షి, చెన్నై : టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్ (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మరణించారు. ఈ నెల 12 న శివప్రసాద్‌ను ఆయన కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా, అప్పటి నుంచి డయాలసిస్ చేస్తున్నారు. శివప్రసాద్ మృతిపట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. చంద్రబాబు నిన్న సాయంత్రం శివప్రసాద్‌ను పరామర్శించిన విషయం తెలిసిందే. 1951జూలై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో ఆయన జన్మించారు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు కూడా శివప్రసాద్ మృతి పట్ల సంతాపం తెలిపారు. వైద్యుడిగా సేవలు అందిస్తూ చిత్రరంగంలోకి ప్రవేశించారు. తొలుత చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన ఆ తర్వాత పలు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక 2006లో ‘డేంజర్’ చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. అనంతరం రాజకీయాలపై ఆసక్తితో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా, రెండుసార్లు చిత్తూరు ఎంపీగా పని చేశారు. శివప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు. అలాగే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆయన రోజుకో వేషం వేస్తూ వినూత్నంగా నిరసనలు చేశారు. పార్లమెంట్ ఆవరణలో విచిత్ర వేషధారణతో శివప్రసాద్ తన నిరసన తెలిపేవారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం శివప్రసాద్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
టీడీపీ ఎంపీ శివప్రసాద్‌పై భూకబ్జా ఆరోపణలు
సాక్షి, తిరుపతి : టీడీపీ ఎంపీ శివప్రసాద్‌పై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేణిగుంట మండలం కరకంబాడిలో కోట్ల రూపాయల విలువైన స్థలం కబ్జా చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఎంపీ శివప్రసాద్ పేరు చెప్పి టీడీపీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారు. కాగా బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవటం గమనార్హం. -
జగనన్న కోసం పనిచేస్తాం
తిరుచానూరు: ఐదుకోట్ల ఆంధ్రుల భవిష్యత్తే శ్వాసగా పనిచేస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి వెంటే తామంతా ఉంటామని యువకులు గొంతెత్తారు. వైఎస్సార్సీపీ యువ నాయకుడు భూమన అభినయ్ సారథ్యంలో టీడీపీ బీసీ సెల్ నగర మాజీ అధ్యక్షుడు, వివేకానంద యూత్ అధ్యక్షుడు శివప్రసాద్ యా దవ్ సోమవారం సాయంత్రం వైఎస్సార్సీపీ ఒక టో డివిజన్ అధ్యక్షుడు రాధారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అంతకుముందు పద్మావతీపురం మెయిన్ రోడ్డు నుంచి ర్యాలీగా కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శివప్రసాద్ యాదవ్ తన అనుచరులతో కలసి పార్టీలో చేరారు. కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున యువకులు, మహిళలు పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అప్పట్లో ప్రజల కష్టాలు తెలుసుకునేం దుకు 1,500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే నేడు ఆయన తనయుడు 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం యువతకు ఆదర్శమన్నారు. ప్రజా సంకల్పయాత్రతో ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారన్నారు. తండ్రి ఆశయ సాధన కోసం పనిచేస్తున్న జగనన్న రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా మారనన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడిచి, రోజుకు రెండు గంటలు పార్టీ కోసం పనిచేయాలని కోరారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే, పార్టీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున యువత పార్టీలోకి రావడం శుభపరిణామమన్నారు. వైఎస్ జగన్‌కు బాసటగా, కరుణాకరరెడ్డికి తోడుగా నిలుద్దామని పిలుపునిచ్చారు. రాజన్న పాలన జగన్‌తోనే సాధ్యమన్నారు. నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్కె బాబు, పాముల రమేష్‌రెడ్డి, తలారి రాజేంద్ర, మల్లం రవిచంద్రారెడ్డి, కృష్ణచైతన్య యాదవ్, వాసు యాదవ్, కట్టా గోపి యాదవ్, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, కేతం జయచంద్రారెడ్డి, గోపాల్‌రెడ్డి, మోహన్, నగర అధ్యక్షరాలు కుసుమ, లక్ష్మి, గీతా యాదవ్, రమణ మ్మ, సాయికుమారి, రాధ మాదవి పాల్గొన్నారు. -
వడదెబ్బతో కూలీ మృతి
తాడిపత్రి రూరల్ : తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లికి చెందిన శివప్రసాద్ (28) అనే కూలీ వడదెబ్బకు గురై సోమవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. శివప్రసాద్ తాడిపత్రికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాక ఒక్కసారిగా కూప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతునికి భార్య సరోజ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
దళితులకి న్యాయం జరగాలని కోరడం తప్పా?
-
గిరిజనుల నుంచి నాగరికులు ఎంతో నేర్చుకోవాలి
పర్యావరణంలో ఒక భాగంగా జీవించే గిరిజనుల జీవన విధానం నుంచి పట్టణ ప్రజలు, నాగరికులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ప్రొ. శివప్రసాద్ అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మన సంస్కృతిని కోల్పోతున్నామని, ఆరోగ్యకరమైన అతి ప్రాచీనమైన ఈ మూలాలు గిరిజనుల్లోనే ఉన్నాయన్నారు. వాటిని కాపాడుకుంటూ వస్తున్న గిరిజనులు ప్రస్తుతం నాగరికులమని చెప్పుకుంటున్న నాగరికులకంటె అధికులని పేర్కొన్నారు. గిరిజనులు పాటిస్తున్న ఆచార వ్యవహారాలు ప్రకృతికి, సాటి ప్రజలకు మేలు చేకూర్చేవిగా ఉంటాయని, అందువల్ల వారి విజ్ఞానాన్ని రికార్డు చేసుకుని గిరిజనేతరులంగా పాటించాలని సూచించారు. మంగళవారం సంక్షేమభవన్‌లోని ఎస్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు.గిరిజనులు బాగు పడాలంటే విద్యాసౌకర్యాలను వారి వద్దకు తీసుకెళ్లాలని, వారి మృతృభాషల్లో బోధించే ఉపాధ్యాయులతోనే ఎస్టీ పిల్లలకు ప్రాథమిక విద్యను అందించాని ప్రొ.సూర్య ధనుంజయ్ అన్నారు. ఎస్టీ శాఖ రూపొందిస్తున్న తెలంగాణ గిరిజన సంస్కృతి సూచీ (ఇన్వెంటరీ) కృషి ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలిసారిగా ఎస్టీ శాఖ రూపొందించిన గోండు, గోండు సంబంధిత తెగల కుల పురాణ చిత్రలేఖనాన్ని ఆవిష్కరించారు. ఎస్టీ సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ డెరైక్టర్ డా. నవీన్ నికొలస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డా. ద్యావనపల్లి సత్యనారాయణ, ప్రాజెక్టు అధికారి విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ భార్య అనుమానాస్పద మృతి..
కడప: కడప నగర శివార్లలోని రాయచోటి రైల్వేగేటు రైల్వేస్టేష్టన్ మధ్య ట్రాక్‌లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలు మండెం శివజ్యోతి( 28)గా గుర్తించారు. ఘటనా స్థలానికి మృతురాలి బంధువులు, పోలీసులు వచ్చి పరిశీలించారు. మృతురాలి అక్క శివ కళావతి, తల్లి సరోజమ్మ, సీఐ సదాశివయ్య తెలిపిన వివరాల మేరకు... ఊటుకూరుకు చెందిన మండెం శివశంకరయ్య, సరోజమ్మలకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. చివరి సంతానమైన మండెం శివజ్యోతికి, సుండుపల్లెకు చెందిన కిషోర్‌కుమార్‌కు 2003 వివాహమైంది. వీరికి కళ్యాణ్‌కుమార్ (8) కుమారుడు ఉన్నాడు. వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడి విడిపోయారు. 2013లో కానిస్టేబుల్ శివప్రసాద్‌తో శివజ్యోతికి పరిచయం ఏర్పడింది. అతను ప్రస్తుతం రాజంపేటలో పనిచేస్తున్నాడు. గత ఏడాది భాకరాపేట (విశ్వనాథపురం)లోని శివాలయంలో కానిస్టేబుల్ శివప్రసాద్‌తో శివజ్యోతి వివాహమైంది. ఊటుకూరులో అవ్వ సరోజమ్మ దగ్గర కళ్యాణ్‌కుమార్ ఉంటున్నాడు. శివజ్యోతి, తన భర్త శివప్రసాద్‌తో కలిసి నగరంలోని అక్కాయపల్లెలో నివసిస్తోంది. ఆమె బ్యూటీషియన్ కోర్సు చేసింది. శివప్రసాద్‌కు, మృతురాలికి తీవ్ర స్థాయిలో మనస్ఫర్థలు ఏర్పడ్డాయి. ఈనెల 11న రాత్రి 7:30 గంటల సమయంలో తన అక్క శివకళావతి సెల్‌ఫోన్‌కు తనను శివ వేధిస్తున్నాడని మెసేజ్ పెట్టింది. తర్వాత ఆదివారం ఉదయం రైల్వేట్రాక్‌లో శవమై కన్పించింది. శివజ్యోతి మృతిపై అనుమానం శివజ్యోతి, శివప్రసాద్‌ల మధ్య ఏర్పడిన మనస్పర్థల వలనే ఆమె మృతికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో మృతదేహాన్ని పరిశీలిస్తే రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లుగానీ, శరీరం ఛిద్రమైనట్లుగాగానీ కన్పించలేదు. రైల్వే ట్రాక్ మధ్యలో నిలువుగా పడి ఉంది. పథకం ప్రకారం హత్య చేసి రైల్వే ట్రాక్ మధ్య పడుకోబెట్టి ఉండవచ్చునని అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై మొదట కడప రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం దర్యాప్తు ప్రారంభిస్తామనీ అర్బన్ సీఐ సదాశివయ్య తెలిపారు. -
బాబు మాటలకు చప్పట్లు కొట్టడం తెలుసా?
చిత్తూరు గ్రామీణం : 'పార్టీలో పని చేస్తున్న ప్రతి ఎస్సీ నాయకుడికీ, కార్యకర్తకు పదవులు మేం ఇవ్వలేం.. మీరు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబును అడగండి' అంటూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ టీడీపీ ఎస్సీ నాయకులు, కార్యకర్తలకు షాక్ ఇచ్చారు. బుధవారం చిత్తూరు నగరంలోని బాలాత్రిపుర సుందరి కల్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ శివప్రసాద్ తోపాటు జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్యే సత్యప్రభ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమకు పదవులు ఇవ్వాలని కొందరు ఎస్సీ నాయకులు శివ ప్రసాద్‌ను డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహించిన ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు పదవులు అడగవచ్చు కదా.... చంద్రబాబు వచ్చినప్పుడు ఆయన మాటలకు చప్పట్లు కొట్టడం మాత్రమే తెలుసా..? ఆయన్ని ఎందుకు ప్రశ్నించరు... మమ్మల్ని ఎందుకు నిలదీస్తున్నారు... పదవులు ఇవ్వడం మా వల్ల కాదు, ఇవ్వడం కుదరదండి.. మీరే వెళ్లి సీఎంను అడగండి అంటూ ఎంపీ.. ఎస్సీ నాయకులు, కార్యకర్తలకు తేల్చి చెప్పేశారు. రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకోవాలని నాయకులను ఈ సందర్భంగా శివప్రసాద్ కోరారు. దీంతో ఆ పార్టీ ఎస్సీ నాయకులు శివప్రసాద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని ప్రశ్నలు అడిగే సరికి వద్దు అంటూ దండం పెట్టి అక్కడ నుంచి శివప్రసాద్ వెళ్లిపోయారు. -
భూ వివాదంలో టీడీపీ ఎంపీ
-
కుటుంబ కలహాలతో గొంతు కోశారు..
పెద్దపల్లి రూరల్ (కరీంనగర్): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తిని అతడి కుటుంబసభ్యులే గొంతు కోశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. పెద్దపల్లి పట్టణానికి చెందిన శివప్రసాద్ (35) స్థానికంగా పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, అతడి సోదరి కుటుంబం పొరుగునే ఉంటుంది. అక్క, బావ తరచూ పోట్లాడుకోవటం శివప్రసాద్‌కు నచ్చలేదు. దీనిపై వారిని అతడు మందలించాడు. అది మనసులో పెట్టుకున్న అక్క, బావ, వారి కుమారుడు కలిసి గురువారం సాయంత్రం శివప్రసాద్‌తో గొడవకు దిగారు. కత్తితో అతడి గొంతు కోశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. -
చిత్తూరులో వ్యక్తి ఆత్మహత్య
చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని రామ్‌నగర్ కాలనీలో డిఎన్.శివప్రసాద్ (48) అనే వ్యక్తి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక రవాణాశాఖ కార్యాలయం ఆవరణంలో ఏజెంటుగా పనిచేస్తున్న అతడు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో భార్య పని చేసుకుంటుండగా పడక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. సీలింగ్ ఫ్యాన్ కొక్కీకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపు తర్వాత గమనించిన అతడి భార్య చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే శివప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
సజీవ పాత్రల చేవ్రాలు ‘నాగేటి చాలు’
మంచి పుస్తకం మంచి కథ ఒక్కటి చాలు, ఒక రచయిత ప్రతిభా కౌశలాన్ని పాఠకుడి ముందుంచటానికి. వల్లూరి శివప్రసాద్ కథా సంపుటి ‘నాగేటి చాలు’ను తిరగేయండి. మొత్తం 22 కధలుంటే ప్రతి కథలోనూ అలాంటి ప్రతిభా కౌశలం చూస్తారు. శివప్రసాద్ కథలన్నీ వర్తమాన సమస్యలను స్వీకరిస్తాయి. ముఖ్యంగా రైతు సమస్యలని. పాత్రలన్నీ చాలా సహజంగా గంటూరు జిల్లా రైతు భాషను మాట్లాడతాయి. ఎక్కడా భావోద్వేగాల్ని అసహజంగా పలికించవు. ‘నాగేటి చాలు’లోని చలమయ్య అయినా, ‘పురుగు’ కథలోని అమరయ్య అయినా, ‘గిట్టుబాటు’ కథలోని కోటేశ్వరరావు అయినా ,‘పగ’ కథలోని ముత్తయ్య అయినా వీరందరిదీ మట్టిభాష. ఈ కథల్లోని విషాదం, బీభత్సం మన గుండేల్ని తాకుతుంది. అలాగే ‘గుండెలోతు’ ‘వానప్రస్థం’ కథల్లో వయసు పైబడిన తల్లిదండ్రుల సంఘర్షణను ఆయన కళ్ళకు కట్టిస్తారు. మైనారిటీ వర్గాలకు చెందిన కథలు రెండు ఉన్నాయి. రెండూ కంటతడి పెట్టించేవే. ‘దొరకోటు’లో ముసలి పాలేరు ‘ఆదాం’ది చిన్న కోరిక. పొలానికి కాపలా కాసే సమయంలో చలి నుంచి అతనికి కొంత ఊరట కావాలి. ఏ ధర్మప్రభువైనా ఒక కోటు యివ్వకపోతాడా అన్న చిన్న కోరిక అతనిది. క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు అతనికో దొరలు వాడిన కోటును దానంగా యిస్తారు. ఆ ప్రభువే యిచ్చాడని పొంగిపోతాడు. చివరికి జ్వరానికి తట్టుకోలేకపోతున్న మనవడి వైద్యం కోసం ఆ కోటును అమ్మేస్తాడు. సరే ఇలాంటి వితరణ సంస్థల్లో వుండే రాజకీయాల్ని ప్రశ్నిస్తాడు రచయిత. అది సెకండరీ. ఆదాం దోరకోటుతో ఊళ్ళో తిరిగినప్పుడు అతన్ని ఎకసెక్కమాడిన వాళ్ళు, సానుభూతి చూపించిన వాళ్ళు, నయానా భయానా బెదిరించిన వాళ్ళూ అందరూ రైతులే. రైతుల్లో వుండే మరో కోణాన్ని చూపిస్తాడు యిక్కడ రచయిత. ఆదాం లాంటి వాళ్ళ జీవితాల్లోని దుర్భరతను మనమూ చూస్తాం. ఆదాంను ఒక పట్టాన మర్చిపోలేం. ఇక రెండవ కథ ఎండమావి. ముస్లిం జీవితాల పేదరికం ఎంత భయంకరంగా వుంటుందో చూపే కథ. వృద్ధాప్య పింఛను ఇస్తున్నారని తెలిసిన అరవైయేళ్ళ బూబమ్మ దాని కోసం ప్రయత్నిస్తుంది. అనేక చీత్కారాలను దాటుకుని ఫోటోదిగడం కోసం డబ్బు కూడపెట్టుకుని చివరకు ఫోటో దిగుతుంది. ఆమె తపన మనలో టెన్షన్ పుట్టించి ఎట్లయినా ఆ ముసలి బూబమ్మకు పింఛను దక్కాలి అని భావిస్తుండగానే ఊరి రాజకీయాల లాలూచీతో ఆ ముసల్దాని దరఖాస్తు ఫారాన్ని చించేస్తాడు మునసబు. ఆ మునసబుని కొట్టాలనిపించేంత కోపం పాఠకుడికి కలుగుతుంది. ఈ రెండు కథల్లోనూ పాత్ర చిత్రణ, సన్నివేశ కల్పన సంభాషణలు వేటికవే సాటి. ఈ రచయితకు రైతులంటే గౌరవముంది. రిటైరయిపోయిన తల్లిదండ్రులంటే జాలి వుంది. ఆడవాళ్ళను స్వంతంగా ఆలోచించనివ్వరన్న ఆక్రోశం వుంది. వ్యవసాయాన్ని నాశనం చేసిన పాలకులంటే తీవ్రమయిన కోపం వుంది. అందుకే సందిగ్ధావస్థలో, సంక్షోభిత దశలో వున్న ఒక సమాజపు ప్రతీకలు ‘నాగేటి చాలు’ కధలన్నీ. - సి.ఎస్.రాంబాబు 94904 01005 నాగేటి చాలు- వల్లూరి శివప్రసాద్; వెల: రూ.140; ప్రతులకు- విశాలాంధ్ర -
చెవిరెడ్డి మాటమీద నిలబడే వ్యక్తి
తిరుచానూరు : చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి. నమ్మిన పార్టీని, సిద్ధాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోని వ్యక్తి. అని చెవిరెడ్డిపై చిత్తూరు ఎంపీ డాక ్టర్ ఎన్. శివప్రసాద్ ప్రశంసల జల్లు కురిపించారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లి, కుంట్రపాకం గ్రామ పంచాయతీలో ఆదివారం జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చెవిరెడ్డి నమ్మిన సిద్ధాంతం, పార్టీ కోసం పని చేసే వ్యక్తి అన్నారు. 2001 టీడీపీ పాలనలో తాను రాష్ట్ర మంత్రిగా ఉన్నానని, ఆ సమయంలో జిల్లాలో టీడీపీ 32, కాంగ్రెస్ 33జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుందన్నారు. ఎలాగైనా సీఎం సొంత జిల్లా అయిన చిత్తూరులో జెడ్పీ స్థానాన్ని టీడీపీ సొంతం చేసుకోవాలని, ఆ సమయంలో చెవిరెడ్డిని టీడీపీలోకి తీసుకోవడానికి అనేక ప్రయత్నాలు, ప్రలోభాలు పెట్టినా లొంగలేదని తెలిపారు. చివరకు కిడ్నాప్ చేయాలనుకున్నానని ఎంపీ ఆనాటి సంగతులను గుర్తుకు తెచ్చుకున్నారు. కేవలం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వల్లే టీడీపీ హయాంలోనూ జిల్లా పరిషత్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగిందని తెలిపారు. చిన్నప్పటి నుంచే చెవిరెడ్డితోనూ, వారి కుటుంబతోనూ అనుబంధం ఉందని, ఆ చనువుతోనే చెవిరెడ్డిని తమ పార్టీలోకి తీసుకోవాలని అనుకున్నట్లు తెలిపారు. నమ్మిన పార్టీని, సిద్ధాంతాన్ని మోసం చేయలేనని తమ్ముడు చెవిరెడ్డి తనతో చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తు ఉందన్నారు. అంతటి నిబద్ధత కలిగిన చెవిరెడ్డితో కలిసి చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేస్తానని, ప్రజలు కూడా తమతో పనిచేయించుకోవాలని కోరారు. అంతకుముందు ఎంపీ శివప్రసాద్‌ను పుష్పగుచ్ఛం, దుశ్శాల్వతో చెవిరెడ్డి సత్కరించారు. -
టీడీపీలో గుర్తింపు లేనందుకే పార్టీ వీడా
ఆలూరు: తెలుగుదేశం పార్టీలో గుర్తింపు లేనందుకే పార్టీని వీడానని టీడీపీ ఆలూరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జి వైకుంఠం శివప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన స్థానిక క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తన కుటుంబం పార్టీకి విశేష సేవలు అందించిందన్నారు. చివరికి పార్టీ కోసం తన తల్లిదండ్రులను, తన కుటుంబానికి సహకరించిన కొందరిని కూడా పోగొట్టుకున్నానన్నారు. తమ సేవలను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గుర్తించకపోవడం చాలా బాధాకరమన్నారు. ఆ పార్టీలో ఉండలేకనే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇటీవల హైదరాబాద్‌లో కలిసినట్లు చెప్పారు. త్వరలో అధికారికంగా పార్టీలో తన అనుచరవర్గంతో చేరుతున్నట్లు చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా తన అభివృద్ధిని కోరుకునే నాయకులు, కార్యకర్తలకు సహాయ, సహకారాలను అందిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఆలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానన్నారు. -
ఏసీబీ వలలో వీఆర్వో
కొనకనమిట్ల, న్యూస్‌లైన్: పాసుపుస్తకం జారీ చేసేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..కొనకనమిట్ల మండలంలోని చినారికట్ల గ్రామానికి చెందిన బరిగె గురువులు ఐదేళ్లుగా పాసు పుస్తకం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈక్రమంలో ఇటీవల వీఆర్వోగా వచ్చిన ఎస్.శివప్రసాద్‌ను కలిసిన సదరు రైతు మొత్తం వివరాలు అందచేసి, పాసు పుస్తకం వచ్చేలా చూడాలని వేడుకున్నాడు. వీఆర్ఓ *5 వేలు ఇస్తే, వెంటనే పాసు పుస్తకం వచ్చేలా చూస్తానని చెప్పాడు. అంత ఇచ్చుకోలేనని రైతు వేడుకున్నా, పై వారికి నేనేం చెప్పాలని కసురుకున్నాడు. దీంతో రైతు విషయం ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. రైతు గురువులు సోమవారం కార్యాలయానికి వచ్చి వీఆర్వోకు * 3,500 ఇచ్చి తొందరగా పనిజరిగేలా చూడాలని కోరాడు. అప్పటికే మాటువేసిన ఏసీబీ అధికారులు వీఆర్వో నుంచి నగదును, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దాడిలో నెల్లూరు డీఎస్పీ జే భాస్కరరావు, ఒంగోలు సీఐలు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, ఎస్సైలు కృపానందం, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
నాడే అంతం చేశారు...
వెంకటాపురం,న్యూస్‌లైన్ : వెంకటాపురం మండలం వీఆర్‌కె పురం గ్రామానికి చెందిన డర్రా రాధ, డర్రా పోతురాజుల అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. ఎప్పటికైనా తిరిగి వస్తారని ఎదురుచూస్తున్న వారి కుటుంబ సభ్యులను పోలీసులు ఇచ్చిన సమాచారం హతాశులను చేసింది. రాధ, పోతురాజులను సమీప బంధువులే అత్యంత కిరాతకంగా అంతమొందించారు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు సంబంధించి వెంకటాపురం సీఐ కే ఆర్కే ప్రసాద్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వీఆర్కేపురానికి చెందిన డర్రా దామోదర్‌కు ఇదే గ్రామానికి చెందిన రాధతో పదేళ్ల క్రితం వివాహమైంది. వివాహమై సంవత్సరాలు గడుస్తున్నప్పటకీ వీరికి పిల్లలు పుట్టలేదు. దీంతో దామోదర్ అదే గ్రామంలోని వేరే మహిళతో వివాహేతర సం బంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇదిలా ఉండగా దామోదర్ చిన్నాన్న కుమారుడైన పోతురాజు అనే వ్యక్తి రాధతో సన్నిహితంగా మెలగటమే కాకుండా ఆమెతో వివాహేతర సం బంధం పెట్టుకున్నాడు. రాధ,పోతురాజు 2012 జూలై నెలలో ఊరు నుంచి పారిపోయారు. నెల్లూరు జిల్లా బోగాల మండలం సీఆర్ పురం గ్రామంలోని బ్రహ్మయ్య ఇంటికి వారు వెళ్లారు. గతంలో వెంకటాపురం ఏరియాలో తాపీ మేస్త్రీగా బ్రహ్మయ్య పనిచేయటంతో అతనితో ఉన్న పరిచయం మేరకు రాధ, పోతురాజు ఇరువురు బ్రహ్మయ్యను ఆశ్రయించారు. అక్కడ నుంచి వారు చెన్నై వెళ్లి కూలిపనులు చేసుకుంటూ సహజీవనం సాగించారు. రాధ, పోతురాజులు కలిసి పారిపోయినట్లుగా తెలుసుకున్న రాధ భర్త దామోదర్ వీరి గురించి ఆరా తీశాడు. వారు బ్రహ్మయ్య దగ్గర ఉన్నట్లు 15రోజుల తర్వాత తెలుసుకున్నాడు. దామోదర్, అతని కుటుంబ సభ్యులు సర్వేశ్వరరావు, వెంకటే శ్, నాగరాజు,వేణు,గోపి నెల్లూరు జిల్లా సీఆర్పురంలోని బ్రహ్మయ్య ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. రాధ, పోతురాజులను చె న్నై పంపించింది బ్రహ్మయ్య అని నిర్ధారించుకొని వారిని వెంటనే తమకు అప్పగించాలని నిలదీ శారు. వారిని తమకు అప్పగించకపోతే పోలీ సులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో బ్రహ్మయ్య చెన్నై వెళ్లి వారిద్దరినీ నెల్లూరుకు తీసుకొస్తుండగా, అప్పటికే వారి కోసం బస్టాండ్‌లో వేచిఉన్న సర్వేశ్వరరావు, వెంకటేష్‌లను చూసిన రాధ, పోతురాజులు వారి కంట పడకుండా అక్కడనుంచి తప్పించుకుని కావలి వెళ్లిపోయారు. రాధ, పోతురాజులు పారిపోగా... బ్రహ్మయ్యను దామోదర్ పట్టుకున్నాడు. తమఊరు నుంచి వచ్చిన వారి గురించి తెలుసుకునేందుకు సాయంత్రం రాధ, పోతురాజులు బ్రహ్మయ్యకు ఫోన్ చేశారు. దీంతో తప్పించుకుపోయిన వారు కావలిలో ఉన్నట్లుగా నిర్ధారించుకొని బ్రహ్మయ్యను అక్కడికి పంపించారు. వారిని జమ్మల పాలెం మీదుగా గుంటూరుకు తీసుకురమ్మని చెప్పి బ్రహ్మయ్యను పంపించినప్పటికీ, అతని వెనుకే ఆటో ద్వారా దామోదర్ తదితరులు వెంబడించారు. ఆటోలో ఎదురుగా తీసుకొస్తున్న రాధ, పోతురాజులను పట్టుకొని తమ ఆటోలో ఎక్కించుకున్నారు. అక్కడ నుంచి నేరు గా భద్రాచలం తీసుకొచ్చారు. అయితే రాధ, పోతురాజు దొరికారనే విషయం గ్రామంలో తెలిసింది. కాగా, భార్య వివాహేతర సం బంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని దామోదర్ ఎలాగైనా వారిని అంతమొందించాలని నిర్ణయానికి వచ్చాడు. సహజీవనం చేసిన ఇరువురిని ఒక్కటి చేసేందుకు గ్రామంలోని పెద్దలను ఒప్పిస్తానని నమ్మబలికాడు. రాధతో తమ గ్రామంలో ఉన్న అత్తమామలకు ఫోన్ చేయిం చి, తాము బెంగుళూరులో ఉన్నట్లుగా చెప్పిం చాడు. వారం రోజుల తరువాత రాధ, పోతురాజు భద్రాచలం రావాలని చెప్పి వారిని అక్క డ నుంచి కరీంనగర్‌లోని బంధువులు ఇంటికి పంపించాడు. దామోదర్ మాటలు నమ్మిన వారిద్దరూ వారం రోజుల తరువాత కరీంనగర్ నుంచి రైలులో కొత్తగూడెం వరకూ వచ్చారు. అప్పటికే కొత్తగూడెం రైల్వే స్టేషన్లో వేచి ఉన్న దామోదర్, వెంకటేష్, సర్వేశ్వరరావు, నాగరాజు, వేణు వారిని ఆటో ద్వారా భద్రాచలం తీసుకొచ్చారు. ఆటో భద్రాచలం గోదావరి బ్రిడ్జి మధ్యలోకి రాగా వారిని అంత మొందించాలని నిర్ణయించుకున్న దామోదర్, మిగతా వారు పోతురాజు మెడకు కండువా చుట్టి బిగించారు. చనిపోయినట్లుగా నిర్ధారించుకొని బ్రిడ్జి పై నుంచి గోదావరిలో శవాన్ని వేశారు. ఆ తరువాత రాధను గొంతు నులిమి ప్రాణాలు పోకముందే గోదావరి నదిలో తోసేశారు. తరువాత వీరంతా గ్రామానికి వచ్చేశారు. వెలుగులోకి ఎలా వచ్చిందంటే.... రాధ తమ్ముడు సతీష్ మొక్కు తీర్చుకునే క్రమంలో మూడు నెలల క్రితం తిరుపతి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో అక్కను చూసేందుకని నెల్లూరు జిల్లాలోని సీఆర్పాలెంలో గల బ్రహ్మయ్య ఇంటికి వెళ్లాడు. అయితే రాధ, అతనితో పాటు ఉన్న పోతురాజును చాలా కాలం క్రితమే దామోదర్, మరికొంతమంది వచ్చి గ్రామానికి తీసుకెళ్లినట్లుగా బ్రహ్మయ్య చెప్పాడు. తిరిగి గ్రామానికి వచ్చిన సతీష్ ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో రాధ విషయమై వారు దామోదర్‌ను నిలదీశారు. తనకేమీ తెలియదని దామోదర్ తప్పించుకోగా, దీనిపై అనుమానం వచ్చిన రాధ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రాధ తల్లిదండ్రుల ఫిర్యాదుతో అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసిన పోలీసులు ఆరా తీశారు. దీంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తే కాలయముడుగా మారి అత్యంత కిరాతకంగా అంతమొందించటం సర్వత్రా చర్చనీయాంశమైంది. హత్యకు పాల్పడినవారిలో నలుగురిని పోలీసు లు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేణు, గోపిలు పరారీలో ఉన్నారు. వీరిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సీఐ కేఆర్కే ప్రసాద్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్సై శివప్రసాద్, ట్రైనీ ఎస్సై వెంకటేశ్వర్లు ఉన్నారు. -
భలే గొప్ప చిచ్చుపెడితివే...ఓ సోనియమ్మ
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై చిత్రవిచిత్ర వేషధారణలతో నిరసన తెలిపే చిత్తూరు టిడిపి ఎంపి శివప్రసాద్ మంగళవారం ఏకంగా నారదుడి అవతారమెత్తారు. నారదుడి అవతారంలో పార్లమెంట్‌కు వచ్చిన ఆయన చిడతలు వాయిస్తూ ... పాటలు పాడుతూ హడావుడి చేశారు. సీమాంధ్ర సమస్యలను ఏకరువు పెడుతూ .. హరికథ చెప్పారు. రాష్ట్ర విభజనను ఆపాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కోరారు. భలే గొప్ప చిచ్చుపెడితివే..... ఓ సోనియమ్మ .... అన్నదమ్ములే అసెంబ్లీలో, పార్లమెంట్లో తన్నుకునే చచ్చేలా భలే గొప్ప చిచ్చుపెడితివే... భలే గొప్ప ఉన్న రాష్ట్రాలు ఏలుకోక...ఊరుకే కూర్చోక సీమాంధ్ర జనం శఠగోపం పెట్టినావు రెండుసార్లు గెలిపిస్తే...రాష్ట్రం రెండు కావాలా? రాహుల్ పదవి కోసం ...రాద్ధాంతం చేస్తావా? భలే గొప్ప చిచ్చుపెడితివే..... ఓ సోనియమ్మా .... అని రాగయుక్తంగా పాడారు. ప్రజల కోసం కాదని .... తన కొడుకు కోసం సోనియాగాంధీ రాష్ట్రంలో విభజన చిచ్చు పెట్టారని ఎంపీ శివప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలని... ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకు వెళ్లేందుకే నారదుని అవతారంలో వచ్చినట్లు ఆయన చెప్పి....నారాయణ ...నారాయణ అంటూ వెళ్లిపోయారు. -
నారదుడిలో టిడిపి ఎంపి శివప్రసాద్
-
ప్రభుత్వ పాలన భేష్: గల్లా
పలమనేరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, పథకాలను తెలుగుదేశం ఎంపీ శివప్రసాదే మెచ్చుకుంటున్నారంటే ప్రభుత్వం ప్రజల కోసం ఎంతగా కృషి చేస్తోందో ఇట్టే తెలుసుకోవచ్చని రాష్ట్ర భూగర్భ గనులు,వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు. వి.కోటలో ఆదివారం జరిగిన రచ్చబండ సభలో ఆమె మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ పథకాలను పొగడడం కంటే విమర్శించడమే ఎక్కువన్నారు. అందుకు భిన్నంగా జిల్లా ఎంపీ తమ ప్రభుత్వ పథకాలను మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో ఎన్జీ రంగా లాంటి నాయకులు మాత్రమే ఇలా అందరినీ సమానంగా చూసేవారన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రచ్చబండ అవసరమా అని ఎన్నో విమర్శలు వచ్చాయన్నారు. అయితే ప్రజా సమస్యలకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి సహసోపేత నిర్ణయాన్ని తీసుకోవడం గొప్పవిషయమన్నారు. ప్రతి ఇంట్లో తలుపు తడితే ప్రభుత్వ పథకాలు పలుకరిస్తాయని మంత్రి తెలిపారు. రచ్చబండలో అపశ్రుతి వి.కోట, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లా వీ.కోటలో ఆదివారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గుండె పోటుతో ఒకరు మృతిచెందగా, తొక్కిసలాటలో ఒకరు, అధికారుల కాన్వాయ్ ఢీకొని మరొకరు తీవ్రం గా గాయపడ్డారు. వి.కోట మండలం చింతవూకులపల్లెకు చెందిన గుణశేఖర్(40) ఆదివారం వుధ్యాహ్నం రచ్చబండలో అర్జీ ఇచ్చేందుకు వి.కోటకు వచ్చాడు. ప్రభుత్వ కళాశాలలోని సభా మైదానానికి నడిచివస్తూ ఉద్వేగానికి లోనై గుండెపోటుకు గురయ్యూడు. దారిలో ఒక్కసారిగా కుప్పకూలిపోయూడు. తోడున్న వారు 108కు సవూచారవుందించారు. సిబ్బంది చేరుకునేటప్పటికే బాధితుడు మృతి చెందాడు. మృతితునికి భార్య, పిల్లలు సోనియూ(18), పవిత్ర(16), సంధ్య(13) ఉన్నారు. సొంతింటి కల సాకారం చేసుకొని ఇంటికివస్తాడనుకున్న తండ్రి విగతజీవిగా తిరిగి రావడంతో వారి శోకానికి అంతులేకుండా పోయింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రావుస్తులు సీఎంకు అర్జీ ఇచ్చారు. సభానంతరం వర్షం ప్రారంభం కావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో నాయుకనేరి కొత్తూరుకు చెందిన సుజాతకు కాలు విరిగింది. ఆమెను కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. కేజీఎఫ్ రోడ్లో ద్విచక్రవాహనంపై వెళుతున్న కర్ణాటకలోని వున్నాయునపల్లెకు చెందిన వుణికంఠను అధికారుల కాన్వాయ్ ఢీకొట్టింది. దీంతో అతను తీవ్రంగా గాయుపడ్డాడు. -
ఝలక్
-
టిడిపి ఎంపి శివప్రసాద్ ద్వంద్వ వైఖరి
-
కొరడాతో కొట్టుకున్న ఎంపీ శివప్రసాద్