
సాక్షి, తిరుపతి : టీడీపీ ఎంపీ శివప్రసాద్‌పై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేణిగుంట మండలం కరకంబాడిలో కోట్ల రూపాయల విలువైన స్థలం కబ్జా చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఎంపీ శివప్రసాద్ పేరు చెప్పి టీడీపీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారు. కాగా బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవటం గమనార్హం.