గిరిజనుల నుంచి నాగరికులు ఎంతో నేర్చుకోవాలి
Published Tue, Aug 9 2016 8:09 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
పర్యావరణంలో ఒక భాగంగా జీవించే గిరిజనుల జీవన విధానం నుంచి పట్టణ ప్రజలు, నాగరికులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ప్రొ. శివప్రసాద్ అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మన సంస్కృతిని కోల్పోతున్నామని, ఆరోగ్యకరమైన అతి ప్రాచీనమైన ఈ మూలాలు గిరిజనుల్లోనే ఉన్నాయన్నారు. వాటిని కాపాడుకుంటూ వస్తున్న గిరిజనులు ప్రస్తుతం నాగరికులమని చెప్పుకుంటున్న నాగరికులకంటె అధికులని పేర్కొన్నారు. గిరిజనులు పాటిస్తున్న ఆచార వ్యవహారాలు ప్రకృతికి, సాటి ప్రజలకు మేలు చేకూర్చేవిగా ఉంటాయని, అందువల్ల వారి విజ్ఞానాన్ని రికార్డు చేసుకుని గిరిజనేతరులంగా పాటించాలని సూచించారు.
మంగళవారం సంక్షేమభవన్‌లోని ఎస్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు.గిరిజనులు బాగు పడాలంటే విద్యాసౌకర్యాలను వారి వద్దకు తీసుకెళ్లాలని, వారి మృతృభాషల్లో బోధించే ఉపాధ్యాయులతోనే ఎస్టీ పిల్లలకు ప్రాథమిక విద్యను అందించాని ప్రొ.సూర్య ధనుంజయ్ అన్నారు. ఎస్టీ శాఖ రూపొందిస్తున్న తెలంగాణ గిరిజన సంస్కృతి సూచీ (ఇన్వెంటరీ) కృషి ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలిసారిగా ఎస్టీ శాఖ రూపొందించిన గోండు, గోండు సంబంధిత తెగల కుల పురాణ చిత్రలేఖనాన్ని ఆవిష్కరించారు. ఎస్టీ సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ డెరైక్టర్ డా. నవీన్ నికొలస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డా. ద్యావనపల్లి సత్యనారాయణ, ప్రాజెక్టు అధికారి విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement