tribal day
-
అధికారంలోకి వచ్చాక ఎస్టీ రిజర్వేషన్లపైనే తొలి సంతకం
కవాడిగూడ: రాష్ట్రంలోబీజేపీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఎస్టీ రిజర్వేషన్ల ఫైల్ మీద ఉంటుందని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి మురళీధర్ రావు చెప్పారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్‌పై కొమురంభీం విగ్రహం వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్టీ రిజర్వేషన్లపై గిరిజనులను సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు. దళితబంధు మాదిరిగానే గిరిజనబంధు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్ రెడ్డి చొరవతో మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తింపునిస్తామని చెప్పారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్స వాన్ని అధికారికంగా నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్, గిరిజన ఐక్యవేదిక నేతలు వివేక్ నాయక్, డాక్టర్ హెచ్‌కె నాగు, సిదం అర్జున్, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కుతాడి కుమార్, లోనిక రాజు పాల్గొన్నారు. -
గాంధీ జయంతి నాడు గిరిజనులకు నజరానా
సాక్షి, అమరావతి: అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి నాడు గిరిజన ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ట్వీట్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చేసిన ఈ ట్వీట్లో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ‘దేశీయంగా ఉన్న విభిన్న జాతులకు ఆంధ్రప్రదేశ్ నిలయం. మా గిరిజన వారసత్వం గురించి మేము గర్విస్తున్నాము. వారి సంస్కృతి, గిరిజన జాతిని ఉద్ధరించడానికి, సంరక్షించడానికి మా శక్తి సామర్థ్యం మేరకు అన్నీ చేస్తున్నాము. కోవిడ్–19 వల్ల గిరిజనులకు పంపిణీ చేయాల్సిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ అక్టోబర్ 2కి వాయిదా వేశాము. అదే రోజు కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరులో మెడికల్ కాలేజీ, గిరిజన విశ్వవిద్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నాము. అదే రోజు ఏడు ఐటీడీఏల పరిధిలో ఏడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నాము.’’ -
'గిరిజన సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తాం'
సాక్షి, అమరావతి : ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ట్విటర్ వేదికగా స్పందించారు. గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని గిరిజనులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. గాంధీ జయంతి రోజున కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, పాడేరులో వైద్య కళాశాల, గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఐటీడీఏ పరిధిలోని 7 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపడతాన్నారు. -
గిరిజనుల నుంచి నాగరికులు ఎంతో నేర్చుకోవాలి
పర్యావరణంలో ఒక భాగంగా జీవించే గిరిజనుల జీవన విధానం నుంచి పట్టణ ప్రజలు, నాగరికులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ప్రొ. శివప్రసాద్ అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మన సంస్కృతిని కోల్పోతున్నామని, ఆరోగ్యకరమైన అతి ప్రాచీనమైన ఈ మూలాలు గిరిజనుల్లోనే ఉన్నాయన్నారు. వాటిని కాపాడుకుంటూ వస్తున్న గిరిజనులు ప్రస్తుతం నాగరికులమని చెప్పుకుంటున్న నాగరికులకంటె అధికులని పేర్కొన్నారు. గిరిజనులు పాటిస్తున్న ఆచార వ్యవహారాలు ప్రకృతికి, సాటి ప్రజలకు మేలు చేకూర్చేవిగా ఉంటాయని, అందువల్ల వారి విజ్ఞానాన్ని రికార్డు చేసుకుని గిరిజనేతరులంగా పాటించాలని సూచించారు. మంగళవారం సంక్షేమభవన్‌లోని ఎస్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు.గిరిజనులు బాగు పడాలంటే విద్యాసౌకర్యాలను వారి వద్దకు తీసుకెళ్లాలని, వారి మృతృభాషల్లో బోధించే ఉపాధ్యాయులతోనే ఎస్టీ పిల్లలకు ప్రాథమిక విద్యను అందించాని ప్రొ.సూర్య ధనుంజయ్ అన్నారు. ఎస్టీ శాఖ రూపొందిస్తున్న తెలంగాణ గిరిజన సంస్కృతి సూచీ (ఇన్వెంటరీ) కృషి ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలిసారిగా ఎస్టీ శాఖ రూపొందించిన గోండు, గోండు సంబంధిత తెగల కుల పురాణ చిత్రలేఖనాన్ని ఆవిష్కరించారు. ఎస్టీ సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ డెరైక్టర్ డా. నవీన్ నికొలస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డా. ద్యావనపల్లి సత్యనారాయణ, ప్రాజెక్టు అధికారి విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
నిలదీస్తారేమోనని వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్
పార్వతీపురం (విజయనగరం): ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ సీపీ నేతలపై అప్రజాస్వామిక చర్యలు ఎక్కువైపోతున్నాయి. ఆదివారం విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో 12 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ జరుగుతున్న ఆదివాసీ దినోత్సవాలకు రాష్ట్ర మంత్రులు మృణాళిని మరికొందరు రాబోతున్నారు. అయితే, ప్రజలకిచ్చిన హామీల అమలుపై వైఎస్సార్ సీపీ నేతలు మంత్రులను నిలదీస్తారని, ఆందోళన చేస్తారని ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ఈ చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు మద్ది వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎం.రవికుమార్ సహా 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో 5 వేల ఆదివాసీ తెగలున్నాయి. 6,700 భాషలు మాట్లాడుతున్న వీరి జనాభా 40 కోట్ల పైమాటే. ఆదివాసీ తెగలు, భాషలు పలు కారణాలతో అంతరించిపోతున్న నేపథ్యంలో ఆదివాసుల సాంస్కృతిక జీవనాన్ని, వారి హక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపాలని ఐక్య రాజ్యసమితి 1993లో తీర్మానించింది. ఈ తీర్మానం అమలులో భాగం గా.. అడవులపై హక్కులు ఆదివాసులకే ఉన్నాయని 2010 జూలై 14న జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రకటించారు. అది ఇంతవరకు అమలు కాలేదు. ఆదివాసీ ప్రపంచం అభివృద్ధి ముసుగులో అంతం కాబోతోంది. మన దేశ పార్లమెంటులో 30 మంది ఆదివాసీ ఎంపీలు ఉన్నా ఆదివాసీ సమస్యలపై వారేనాడూ నోరు విప్పింది లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసులపై నరమేథం కొనసాగుతోంది. అంతర్యుద్ధం వంటి పరిస్థితుల మధ్యన ఆదివాసులు నలిగిపోతున్నారు. ఆదివాసులను పూర్తిగా అంతరింపజేసి వారి సమాధులపై సామ్రాజ్యాల నిర్మాణం జరుగుతున్న ఆధునిక చరిత్ర నేటికాలంలోనూ సాగుతోంది. రెడ్ ఇండియన్లను నిర్మూలించిన అమెరికా సంయుక్త రాష్ట్రాల పంథాలో ఆదివాసుల అంతానికి అన్ని దేశాలూ నడుం కట్టిన పరిణామాలను ఇప్పుడు ప్రతి దేశంలోనూ చూడవచ్చు. ఈ చరిత్రను మన దేశ పాలకులు కూడా అందిపుచ్చుకున్నారు. భారతదేశంలో సహజవనరులను, ఖనిజ సంపదనూ ధ్వంసం చేస్తున్న తరుణంలో దానికి వ్యతిరేకంగా మధ్యభారతం కేంద్రంగా ఉన్న ఆదివాసీలు నడిపే ప్రత్యామ్నాయ పరిపాలన (మావోయిస్టుల ఆధ్వర్యంలోని జనతన్ సర్కార్)లో భాగమైన ఆదివాసులు జల్, జంగిల్, జమీన్నూ ఉమ్మడి జీవన విధానాన్ని రక్షించుకోవటంలో తమ ప్రాణాలనే బలిపెడుతున్నారు. మరోవైపున ఆదివాసుల రక్షణకు ఐరాస తీర్మానించిన విధానాలను వివిధ దేశాల ప్రభు త్వాలు పూర్తిగా పక్కనబెడుతున్నాయి. ఈ క్రమంలో ఆదివాసుల ఉమ్మడి జీవన వ్యవస్థ వార సత్వం ధ్వంసమైపోతోంది. మన దేశంలోనూ ఆదివాసీల హక్కులు, రాజ్యాంగ పరమైన రిజర్వే షన్లను అమలు చేయడంలో మన పాలకవర్గాలు తీవ్రంగా విఫలమయ్యాయి. రాచరికపు మహా సామ్రాజ్యాలు కూడా ఆదివాసుల విషయంలో చేయనంత మహా విధ్వంసాన్ని ఓపెన్ కాస్టుల పేర అత్యాధునిక రాజ్య వ్యవస్థ చేస్తోంది. ఆనకట్టలు, ప్రాజెక్టులు, మైనింగ్.. ఇలా దేశంలో ఏ భారీ నిర్మాణాలకు పూనుకున్నా బలవుతున్నది ఆదివాసీలే. నిత్యం వీరు ఎదుర్కొంటున్న ప్రా ణాంతక వ్యాధులకు చికిత్స లేదు. వీరి భాషకు గుర్తింపు లేదు. ప్రాణాల కు విలువ లేదు. వారి చరిత్రకు గౌరవం లేదు. ఈ విధ్వంసకర అభివృద్ధి నుంచి తమ రక్షణకు ఆదివాసీ తెగలు ఏకమ వ్వాలి. మన దేశ మైనింగ్ మాఫియా దోపిడీలో ప్రతి ఆదివాసీ అనాథ అయితే ఓపెన్ కాస్టులు వారి శ్మశాన వాటికలు. ఈ శ్మశాన వాటికల్లో ఆదివాసులను తగులబె డుతున్న బహుళజాతి కంపె నీలకూ, వారికి వత్తాసుగా నిలుస్తున్న దళారీ పాలకవర్గాలకూ వ్యతిరేకంగా ఆదివాసులు చేస్తున్న పోరాటాలకు సకల వర్గాల ప్రజలూ అండగా నిలవాలి. ఆదివాసులు తమ అస్తిత్వాన్ని, మను గడను కోల్పోతే, ఈ సమాజానికీ, చరిత్రకీ, సంస్కృతికీ, సంప్రదాయాలకూ చాలా ప్రమాదం. (రచయిత: వూకే రామకృష్ణ ) ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వ్యాసకర్త ఆదివాసీ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ, మొబైల్ : 9866073866