పార్వతీపురం (విజయనగరం): ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ సీపీ నేతలపై అప్రజాస్వామిక చర్యలు ఎక్కువైపోతున్నాయి. ఆదివారం విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో 12 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ జరుగుతున్న ఆదివాసీ దినోత్సవాలకు రాష్ట్ర మంత్రులు మృణాళిని మరికొందరు రాబోతున్నారు.
అయితే, ప్రజలకిచ్చిన హామీల అమలుపై వైఎస్సార్ సీపీ నేతలు మంత్రులను నిలదీస్తారని, ఆందోళన చేస్తారని ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ఈ చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు మద్ది వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎం.రవికుమార్ సహా 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.