చిత్తూరు నగరంలోని రామ్‌నగర్ కాలనీలో డిఎన్.శివప్రసాద్ (48) అనే వ్యక్తి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని రామ్‌నగర్ కాలనీలో డిఎన్.శివప్రసాద్ (48) అనే వ్యక్తి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక రవాణాశాఖ కార్యాలయం ఆవరణంలో ఏజెంటుగా పనిచేస్తున్న అతడు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో భార్య పని చేసుకుంటుండగా పడక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.
సీలింగ్ ఫ్యాన్ కొక్కీకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపు తర్వాత గమనించిన అతడి భార్య చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే శివప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.