కుటుంబ కలహాలతో గొంతు కోశారు.. | family members attacked and man injures | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో గొంతు కోశారు..

Published Thu, Sep 10 2015 8:09 PM | Last Updated on Mon, Oct 8 2018 3:08 PM

family members attacked and man injures

పెద్దపల్లి రూరల్ (కరీంనగర్): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తిని అతడి కుటుంబసభ్యులే గొంతు కోశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. పెద్దపల్లి పట్టణానికి చెందిన శివప్రసాద్ (35) స్థానికంగా పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, అతడి సోదరి కుటుంబం పొరుగునే ఉంటుంది. అక్క, బావ తరచూ పోట్లాడుకోవటం శివప్రసాద్కు నచ్చలేదు. దీనిపై వారిని అతడు మందలించాడు. అది మనసులో పెట్టుకున్న అక్క, బావ, వారి కుమారుడు కలిసి గురువారం సాయంత్రం శివప్రసాద్‌తో గొడవకు దిగారు. కత్తితో అతడి గొంతు కోశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement