హైదరాబాద్: తన సంస్థలో విధులు నిర్వహిస్తున్న యువతి కోసం అమెరికా నుంచి వచ్చిన ఓ సీఈఓ..ఆమెను వేధించి కటకటాల పాలైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అమీర్‌పేటలో ఉన్న ఇన్ఫోగ్రావిటీ సంస్థ సీఈఓ టి.చంద్ర అమెరికాలో ఉంటాడు. ఇండియాలో తన కంపెనీ అభివృద్ధిలో భాగంగా నిరంతరం జూమ్ సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగులకు సలహాలు, సూచనలు ఇస్తుంటాడు.
ఈ క్రమంలో తన కంపెనీలో (అమీర్‌పేట సంస్థ)లో హెచ్‌ఆర్‌గా విధులు నిర్వహిస్తున్న యువతిని జూమ్ సమావేశంలో చూశాడు. అంతేగాకుండా ఆమెపై మనసు పారేసుకున్నాడు. తన కంపెనీ అభివృద్ధి కోసం అందమైన అమ్మాయిలకు ఉద్యోగాలు ఇవ్వాలని సూచించడమే కాకుండా ఆమెను నిత్యం పొగిడేవాడు. అయితే అతను తన యజమాని కావడంతో యువతి ఏమీ అనలేక పోయింది. గతేడాది డిసెంబర్‌లో ఇండియాకు వచి్చన చంద్ర ఆ యువతిని వేధించడం మొదలుపెట్టాడు.
తనతో సన్నిహితంగా ఉండాలని ఒత్తిడి చేశాడు. దీంతో విసుగుచెంది అదే నెల 12న ఉద్యోగానికి రాజీనామా చేసింది. తనకు రిలీవింగ్ లెటర్, జీతం, లీగల్ సరీ్వసెస్ డ్యూస్, ఎక్స్‌పీరియన్స్ లెటర్స్ కావాలని కోరింది. అయితే తన కోర్కె తీరిస్తేనే వాటిని ఇస్తానని చంద్ర చెప్పడంతో ఆమె ఆగ్రహించి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment