అమెరికా కాన్సులేట్‌కు భద్రత పెంపు | Security tightened at US Consulate Hyderabad Nanakramguda Financial District | Sakshi
Sakshi News home page

అమెరికా కాన్సులేట్‌కు భద్రత పెంపు

Mar 2 2026 7:41 AM | Updated on Mar 2 2026 12:03 PM

Security tightened at US Consulate Hyderabad Nanakramguda Financial District

హైదరాబాద్‌: పశ్చిమాసియా పరిణామాలు, ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతి నేపథ్యంలో నగరంలో నిరసన ర్యాలీలు చేపడుతుండడంతో అమెరికా కాన్సులేట్‌కు భద్రత పెంచారు. నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్ లోని ఈ కార్యాలయం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని సైబరాబాద్‌ కమిషనరేట్‌ ఉన్నతాధికారులు గచి్చ»ౌలి పోలీసులను ఆదేశించారు. 

దీంతో ఆదివారం 70 మంది పోలీసులను అమెరికన్‌ కాన్సులేట్‌ వద్ద మోహరించారు. అటువైపు వెళ్లే రోడ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. కాగా, ఐటీ కారిడార్‌లోని స్టార్‌ హోటళ్లపైనా పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. వాటిలో బస చేసిన అమెరికన్లు , ఇతర దేశాలకు చెందిన పౌరుల వివరాలను సేకరిస్తున్నారు. అమెరికన్లు నివాసం ఉండేచోట ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement