
అమెరికాలో నివసిస్తున్న రాయలసీమ వారి కోసం మరో కొత్త సంస్థ పురుడుపోసుకొంది. ‘గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా- గ్రాడా’ పేరిట ఒక కొత్త తెలుగు సంఘం ఆవిర్భవించింది. ఇటీవల జరిగిన ‘గ్రాడా’ గ్రాండ్ లాంచ్‌లో రాయలసీమ వారు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ఫుడ్ డ్రైవ్ చేపట్టారు.
నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్‌లో నిర్వహించిన ఫుడ్ డ్రైవ్‌లో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని తమ వంతు సాయం చేశారు. ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు సంస్థ చేపడుతుందని నిర్వహకులు తెలిపారు. ‘గ్రాడా’ అసోసియేషన్ గురించి వివరించారు. ఇన్స్పిరేషన్, ఇంటరాక్షన్ , ఇన్‌క్లూజన్ అనే మూడు ఫండమెంటల్స్‌పై ‘గ్రాడా’ పనిచేస్తుందని తెలిపారు. అలాగే సంస్థ తరుపున చేపట్టే కార్యక్రమాలను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment