
హ్యూస్టన్ (టెక్సాస్) : ప్రజల హృదయాల్లో శాశ్వతంగా జీవించాలి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంటూ టెక్సాస్‌కి చెందిన ప్రవాస భారతీయులు అభిప్రాయపడ్డారు. మహానేత ప్రియతమ నాయకుడు డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలను వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఎంతో వైభవంగా హ్యూస్టన్ మహా నగరం లో జరిపారు. ఈ కార్య క్రమానికి వైఎస్సార్ అభిమానులు , డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ మెంబెర్స్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
మహానేత రాజన్న ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు చేసిన గొప్ప సంక్షేమ పథకాలు, ఆరోగ్య శ్రీ , ఫీజు రేయింబర్సుమెంట్ , 108 , ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఉచిత విద్యుత్, పేదలకు ఇల్లు వంటి అనేక కార్యక్రమాల గురించి చర్చించుకున్నారు. మహానేతతో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో గిరీష్ రామిరెడ్డి, డాక్టర్ రామి రెడ్డి బూచిపూడి, బ్రహ్మ రెడ్డి, మారుతీ రెడ్డి, వేణు దాసరి, రామ్ చెరువు, పుల్లా రెడ్డి, వీరా రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, హనుమంత రెడ్డి, రామ్, సుధీర్ , సురేష్ పగడాల, రామ్ మోహన్ రెడ్డి, విశ్వనాధ్ రెడ్డి, రాఘవ రెడ్డి కే, సన్నప్పరెడ్డి విశ్వ, అరవింద్ రెడ్డి ,వంశీ అరిమండ, సుధీర్ సూరా, సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment