అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో మరణించిన ఏలూరు జిల్లాకు చెందిన 'వీర సాయేష్' అకాల మరణంపై APNRTS సోషల్ మీడియా ద్వారా సాయేష్ కుటుంబ సభ్యుల వివరాలను కనుగొంది. వారు అందించిన ఫోన్ నంబర్లకు APNRTS 24/7 హెల్ప్ లైన్ టీమ్ ఫోన్ చేసి సంబంధిత వివరాలన్నింటినీ సేకరించింది. అమెరికా నుంచి సాయేష్ భౌతిక కాయాన్నిరాష్ట్రప్రభుత్వం ద్వారా స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తెలిపారు.
అయితే, సాయేష్ కుటుంబ సభ్యులు.. మృతదేహాన్ని భారతదేశం తీసుకురావడానికి తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ద్వారా సహాయం అందుతోందని తెలియజేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం కావాలంటే APNRTS ద్వారా తీసుకుంటామన్నారు.
APNRTS బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. గమ్యస్థాన విమానాశ్రయం నుండి సాయేష్ పార్థివదేహాన్ని వారి కుటుంబానికి చేర్చడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. సాయేష్ భౌతికకాయం ఒహియో రాష్ట్రంలో స్థానిక లాంఛనాలు పూర్తయిన తర్వాత రెండు రోజుల్లో స్వదేశం చేరుకునే అవకాశం ఉంది మేడపాటి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment