medapati venkat
-
అమెరికాలో ఏలూరు వాసి మృతి.. స్వదేశం రప్పించేందుకు సన్నాహాలు
అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో మరణించిన ఏలూరు జిల్లాకు చెందిన 'వీర సాయేష్' అకాల మరణంపై APNRTS సోషల్ మీడియా ద్వారా సాయేష్ కుటుంబ సభ్యుల వివరాలను కనుగొంది. వారు అందించిన ఫోన్ నంబర్లకు APNRTS 24/7 హెల్ప్ లైన్ టీమ్ ఫోన్ చేసి సంబంధిత వివరాలన్నింటినీ సేకరించింది. అమెరికా నుంచి సాయేష్ భౌతిక కాయాన్నిరాష్ట్రప్రభుత్వం ద్వారా స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తెలిపారు. అయితే, సాయేష్ కుటుంబ సభ్యులు.. మృతదేహాన్ని భారతదేశం తీసుకురావడానికి తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ద్వారా సహాయం అందుతోందని తెలియజేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం కావాలంటే APNRTS ద్వారా తీసుకుంటామన్నారు. APNRTS బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. గమ్యస్థాన విమానాశ్రయం నుండి సాయేష్ పార్థివదేహాన్ని వారి కుటుంబానికి చేర్చడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. సాయేష్ భౌతికకాయం ఒహియో రాష్ట్రంలో స్థానిక లాంఛనాలు పూర్తయిన తర్వాత రెండు రోజుల్లో స్వదేశం చేరుకునే అవకాశం ఉంది మేడపాటి పేర్కొన్నారు. -
యూకే, యూరప్ దేశాలలో ముగిసిన దేవదేవుడి కల్యాణోత్సవాలు
తాడేపల్లి: యూకే , యూరోప్ లలోని వివిధ దేశాలలో ఘనంగా జరిగిన శ్రీ మలయప్ప స్వామి వారి కల్యాణోత్సవాలపై ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి పత్రికా ప్రకటన విడుదల చేసారు. యూకే , యూరప్ దేశాలలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో అక్టోబర్ 15 నుండి నవంబర్ 13వ తేదీ వరకు పదకొండు (11) నగరాల్లో జరిగిన శ్రీనివాస కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిసాయి. వైఖానస ఆగమం ప్రకారం తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేద పండితులు ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అన్ని నగరాల్లో శ్రీవారి కళ్యాణోత్సవానికి అశేసంఖ్యలో భక్తులు హాజరయ్యి స్వామి వారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి భక్తి పులకితులయ్యారు. ఈ కల్యాణోత్సవాలకు ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయ సహకారం అందించింది. తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమన్వయ సూచనలతో బేసింగ్ స్టోక్-ఇంగ్లాండ్ లో బేసింగ్ స్టోక్ తెలుగు సంఘం, మాంచెస్టర్ - ఇంగ్లాండ్ లో శ్రీ వైకుంఠమ్, బెల్ఫాస్ట్ -నార్త్ ఐర్లాండ్ లో నార్త్ ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్, డబ్లిన్ - ఐర్లాండ్, ఇండో-ఐరిష్ తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్, జురిక్-స్విట్జర్లాండ్ లో స్విస్ వేదిక్ భక్తీ ఫౌండేషన్, ఐండ్ హోవెన్ - నెదర్లాండ్స్ లో SVK, నవంబర్ ౩వ తేదీన జర్మనీ లోని మునిక్, 5వ తేదీన ఫ్రాంక్ఫర్ట్, 6వ తేదీన ఫ్రాన్స్ లోని పారిస్, 12వ తేదీన ఇంగ్లాండ్ లోని లండన్, 13 వ తేదీన స్కాట్లాండ్ లోని ఎడిన్ బర్గ్ నగరాలలో తెలుగు, భారతీయ సంస్థల సహకారంతో శ్రీ మలయప్ప స్వామివారి కళ్యాణం కన్నులపండుగగా నిర్వహించడం జరిగింది. ఈ 11 నగరాలలో శ్రీవారి కళ్యాణం నిర్వహించడానికి దాదాపు 15వేల కిలోమీటర్లకు పైగా బస్సు ప్రయాణం చేసిన తితిదే అర్చకులు, వేదపండితులు ప్రతి కల్యాణాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఐండ్ హోవెన్ లో జరిగిన శ్రీవారి కళ్యాణానికి ది హేగ్, నెదర్లాండ్స్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం అంబాసిడర్ శ్రీమతి రీనత్ సంధు, సత్య పినిశెట్టి, సెక్రటరీ (ఎకనామిక్స్ అండ్ కామర్స్) బెల్జియం భారత రాయబార కార్యాలయ అధికారులు హాజరయ్యారు. అలాగే ఫ్రాంక్ఫర్ట్ లో జరిగిన శ్రీవారి కళ్యాణంలో జర్మనీలో భారత రాయబార కార్యాలయం అంబాసిడర్ పర్వతనేని హరీష్ దంపతులు, స్థానిక మేయర్ పాల్గొన్నారు. ఇక పారిస్ లో జరిగిన కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో తమిళ, పాండిచ్చేరి భక్తులు హాజరయ్యారు. 11 నగరాలలోని కల్యాణోత్సవాల్లో తెలుగు, భారతీయ భక్తులతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న వారుకూడా అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణ ఘట్టాన్ని వీక్షించి ఆశీర్వాదాలు అందుకున్నారు. 11 నగరాలలోని కల్యాణోత్సవాల్లో ఆయా నగరాల్లోని తెలుగు, భారతీయ, ధార్మిక సేవా సంస్థలు భక్తులకు ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేసారు. ప్రతి ఏటా ప్రపంచంలోని వివిధ దేశాలలో శ్రీ మలయప్పస్వామి వారి కల్యాణం నిర్వహించాలని భక్తులు, తెలుగు, భారతీయ సంస్థలు ముందుకొస్తే ఆయా దేశాలలో శ్రీవారి కల్యాణం నిర్వహించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని మేడపాటి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తితిదే సిద్ధంగా ఉన్నాయని, దీనికి ఏపీఎన్ఆర్టీఎస్ తమ వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. -
రుణపడి ఉంటాం.. థాంక్యూ జగనన్న
సాక్షి, విజయవాడ: కువైట్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను ప్రభుత్వం వెనక్కి రప్పించిందని ఏపీఎన్ఆర్టీ ఛైర్మన్ మేడపాటి వెంకట్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక విమానం కువైట్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. గత నెలలుగా కువైట్‌లో ఉపాధి లేక ఏపీ వలస కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కువైట్‌లో చిక్కుకున్న బాధితుల్ని వెనక్కి తీసుకురావాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారని తెలిపారు. (రాజకీయ కార్యక్రమాలొద్దు: సజ్జల) సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.. అమ్నెస్టీ సాయంతో 152 మంది బాధితులు ఏపీకి చేరుకున్నారని వెల్లడించారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు అనంతరం 14 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలిస్తామని వెంకట్ పేర్కొన్నారు. చొరవ తీసుకుని ఏపీకి రప్పించిన సీఎం వైస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. (విపత్తు సమయంలోనూ సంక్షేమం: సుచరిత) సీఎం వైఎస్ జగన్ కృషి ఫలితంగా.. గురువారం ప్రత్యేక విమానంలో కువైట్‌లోని 145 మంది వలస కార్మికులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సంగతి తెలిసిందే.. వారిలో 126 మంది మహిళలు, 18 మంది పురుషులు, ఓ బాలుడు ఉన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వీరిని నూజివీడు త్రిబుల్ ఐటీలో ఉన్న ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా వలస కార్మికులు దశల వారీగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంటున్నారు. -
యువతకు ఉపాధి కల్పించడమే సీఎం ఆకాంక్ష
సాక్షి, విజయవాడ: క్రీస్తు రాజపురంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్ మంగళవారం ప్రారంభించారు. టైమ్స్ గ్రూప్, ఏపీఎన్ఆర్టీ సౌజన్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే సీఎం జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని తెలిపారు. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏపీఎన్ఆర్టీతో టైమ్స్ గ్రూప్ ఎంఓయూ కుదుర్చుకుందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఏపీలో టైమ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో మొదటి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని విజయవాడలో ప్రారంభించడం శుభపరిణామన్నారు. తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో సైతం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలను టైమ్స్ గ్రూప్ ఏర్పాటు చేయాలని కోరారు. -
ఏపీ ప్రభుత్వ ఎన్నారై సలహాదారుగా మేడపాటి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రవాసాంధ్రుల సలహాదారుగా మేడపాటి వెంకట్ నియమితులయ్యారు. అలాగే ఆయన ఏపీ ఎన్నార్టీ చైర్మన్ హోదాలో రాష్ట్రానికి సేవలు, పెట్టుబడులకు సంబంధించిన ఆంశాలను కూడా పర్యవేక్షిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ వింగ్ కన్వీనర్‌గా పనిచేశారు. ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధికార భాషా సంఘం కొనసాగుతుందని జీవోలో పేర్కొంది. -
మేడపాటి వెంకట్,వైఎస్ఆర్ సీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్ తో సాక్షి వేదిక
-
వైఎస్సార్సీపీ ఎన్.ఆర్.ఐ. వింగ్ ఉదారత
ఈ మధ్య ఉత్తరాఖాండ్‌లో సంభవించిన ఘోర ప్రకృతి వైపరీత్య నష్టాన్ని పూడ్చడానికి, ఛారధామ్ పుననిర్మాణం కొరకు తమ వంతు సహాయం రూ.5 లక్షలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్.ఆర్.ఐ వింగ్, వివిధ దేశాలలో ఉన్న పార్టీ ప్రతినిధులు విరాళాలను వింగ్ కన్వీనర్ మేడపాటి వెంకట్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారి ద్వారా ఉత్తరాఖండ్ సి.ఎం. రిలీఫ్ ఫండ్‌కు అందజేయడం జరిగింది. విరాళాలు అందజేసిన దాతలు: అమెరికా నుండి.. మేడపాటి వెంకట్, రమేష్ రెడ్డి వల్లూరు, పవన్ నరమ్ రెడ్డి, సి. సుబ్బారెడ్డి, డా. వాసుదేవ్ రెడ్డి, దయాకర్ రెడ్డి, విశ్వనాథ్ కిచిలి, రఘు పాడి, సుబ్బారెడ్డి షమ్మి, శ్రీనివాస్ చిట్టలూరు, కుమార్ అశ్వపతి, ప్రవర్థన్ చెమ్ముల, నారాయణరెడ్డి, మురళి బండ్లపల్లి, రఘు సిద్ధపురెడ్డి, రవి బల్లాడ, ప్రసాద్ గురిజాల, స్వదీప్రెడ్డి కువైట్ నుండి.. వై.లలితరాజా, యమ్.బాలిరెడ్డి, దాసరి సంక్షేమ సంఘం, కొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి, కె.రమణయాదవ్, టి.జి. భాస్కర్ రెడ్డి, ఆకుల ప్రభాకర్, రహిమాన్ ఖాన్, దుర్గరెడ్డి, వైఎస్ లాజరస్, చింతల చంద్ర శేఖర్‌రెడ్డి, నాయని మహీశ్వర్ రెడ్డి, యమ్, వి.నరసారెడ్డి, గోవింద్ నాగరాజు, తెట్టురఫి, మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, వి.పి.రామచంద్ర రెడ్డి, చింత శివారెడ్డి,వినోద్ కుమార్ దేవా, రక్కసి శ్రీను, పి.సత్తార్ ఖాన్, రవి నాయుడు, సురేంద్రబాబు నాయుడు, నూర్ భాషా, షేక్ ఇనియత్, కె.వాసుదేవారెడ్డి, ఎ.వెంకట సుబ్బారెడ్డి, మల్లు వెంకట రెడ్డి, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పి. సురేష్ కుమార్ రెడ్డి, మర్రి కళ్యాణ్, షేక్ అజీజ్, ఓ.పి.శివారెడ్డి, సుదర్శన్ రెడ్డి, యస్.మున్నా, డి.గంగాధర్, దిబ్బి రెడ్డి సుబ్బారెడ్డి. యూ.కె. నుండి.. సందీప్ రెడ్డి