
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రవాసాంధ్రుల సలహాదారుగా మేడపాటి వెంకట్ నియమితులయ్యారు. అలాగే ఆయన ఏపీ ఎన్నార్టీ చైర్మన్ హోదాలో రాష్ట్రానికి సేవలు, పెట్టుబడులకు సంబంధించిన ఆంశాలను కూడా పర్యవేక్షిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్‌ఆర్‌ఐ వింగ్ కన్వీనర్‌గా పనిచేశారు. ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధికార భాషా సంఘం కొనసాగుతుందని జీవోలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment