Karnataka Couple, 6-Year-Old Son Found Dead in Us, Relatives Appeal GoI to Bring Back Mortal Remains - Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు ఇంజినీర్‌ దంపతుల ఆత్మహత్య

Published Sun, Aug 20 2023 1:20 AM | Last Updated on Mon, Aug 21 2023 5:44 PM

- - Sakshi

కర్ణాటక: ఆమెరికాలో నివాసం ఉంటున్న దావణగెరెకి చెందిన దంపతులు, కొడుకు అనుమాస్పదంగా మృతి చెందారు. దావణగెరె జిల్లా జగళూరు తాలూకా హలేకల్లు గ్రామానికి చెందిన యోగేశ్‌ హొన్నాళ (37), ప్రతిభా (35), వారి కొడుకు యశ్‌ (6) అమెరికాలోని మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌ నగరంలో నివసిస్తున్నారు. తొమ్మిదేళ్ల నుంచి యోగేశ్‌ దంపతులు అమెరికాలోనే ఐటీ ఇంజినీర్లుగా ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. అప్పుడప్పుడూ సొంతూరికి వచ్చి బంధుమిత్రులను కలిసేవారు.

గురువారమే యోగేశ్‌ దావణగెరెలోని తల్లి శోభతో ఫోన్‌లో మాట్లాడారు. ఏం జరిగిందో కానీ శనివారం కుటుంబసభ్యులకు ముగ్గురి మరణవార్త చేరింది. వారు ఆత్మహత్య చేసుకున్నారని బాల్టిమోర్‌ పోలీసులు ప్రకటించారు. ఎందుకు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకున్నారో విచారిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలను త్వరగా తరలించి సాయం చేయాలని ఇరువురి కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement