IT engineers
-
ఊరుకాని ఊరిలో ఏం కష్టం వచ్చిందో ఏమో!
కర్ణాటక: ఆమెరికాలో నివాసం ఉంటున్న దావణగెరెకి చెందిన దంపతులు, కొడుకు అనుమాస్పదంగా మృతి చెందారు. దావణగెరె జిల్లా జగళూరు తాలూకా హలేకల్లు గ్రామానికి చెందిన యోగేశ్ హొన్నాళ (37), ప్రతిభా (35), వారి కొడుకు యశ్ (6) అమెరికాలోని మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ నగరంలో నివసిస్తున్నారు. తొమ్మిదేళ్ల నుంచి యోగేశ్ దంపతులు అమెరికాలోనే ఐటీ ఇంజినీర్లుగా ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. అప్పుడప్పుడూ సొంతూరికి వచ్చి బంధుమిత్రులను కలిసేవారు. గురువారమే యోగేశ్ దావణగెరెలోని తల్లి శోభతో ఫోన్లో మాట్లాడారు. ఏం జరిగిందో కానీ శనివారం కుటుంబసభ్యులకు ముగ్గురి మరణవార్త చేరింది. వారు ఆత్మహత్య చేసుకున్నారని బాల్టిమోర్ పోలీసులు ప్రకటించారు. ఎందుకు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకున్నారో విచారిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలను త్వరగా తరలించి సాయం చేయాలని ఇరువురి కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరాయి. -
దంపతులిద్దరూ ఐటీ ఉద్యోగులే.. పిల్లలు లేకపోవడంతో భర్త..
కృష్ణరాజపురం: వేధింపుల భర్తతో విరక్తి చెందిన మహిళ అపార్ట్మెంటు 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన కర్నాటక రాజధాని బెంగళూరు మహాదేవపురలో వర్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. టెక్కీలుగా పనిచేస్తూ.. వివరాల ప్రకారం.. ఉపాసన(30), ఆమె భర్త రంజన్ రావత్ దంపతులు ఉత్తరాది నుంచి వలస వచ్చారు. దిశా అపార్ట్మెంటులో 9వ అంతస్తులో అద్దె ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి 9 సంవత్సరాల క్రితం పెళ్లయింది. వేర్వేరు ఐటీ కంపెనీల్లో టెక్కీలుగా ఉద్యోగం చేస్తున్నారు. వీరికి సంతానం కలగకపోవడంతో ఆ విషయమై తరచూ గొడవ పడేవారు. చివరికి విడాకులు తీసుకోవడానికి కూడా సిద్ధమైనట్లు తెలిసింది. తన జీవితం ఏమాత్రం బాగాలేదని విరక్తి చెందిన ఉపాసనా రావత్.. డెత్‌నోట్ రాసి బుధవారం సాయంత్రం తన ఫ్లాటు వరండా నుంచి కిందికి దూకేసింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కన్నుమూసింది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి భర్త రంజన్ రావత్‌ను అరెస్టు చేశారు. డెత్‌నోట్‌లో ఏముంది? ఆమె ఆరు లైన్లలో ఆంగ్లంలో క్లుప్తంగా రాసిన డెత్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నా భర్త నన్ను మానసికంగా, భౌతికంగా వేధిస్తున్నాడు. అందుకనే నేను చనిపోతున్నా. లైంగికంగా అతడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతన్ని కఠినంగా శిక్షించాలి అని లేఖలో రాసి ఉంది. -
ప్రమాదంలో ఆరు లక్షల మంది టెకీలు
ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు ప్రమాదకర స్థాయిల్లోకి వెళ్తోంది. ఈ ఉద్యోగాల తొలగింపు వచ్చే మూడేళ్లలో ఏటా రెండు లక్షల వరకు ఉంటుందని పరిశోధన సంస్థలు వెల్లడిస్తున్నాయి. హెడ్ హంటర్స్ ఇండియా అనే పరిశోధన సంస్థ అంచనాల ప్రకారం ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ఏటా 1.75 లక్షల నుంచి 2 లక్షల వరకు వచ్చే మూడేళ్లపాటు ఉంటుందని తెలిసింది. కంపెనీలు కొత్త టెక్నాలజీలను అందుకునేందుకు సన్నద్ధంగా లేకపోవడమే ఇందుకు కారణమని ఈ సంస్థ అంటోంది. ఈ ఏడాది ఇప్పటికే రూ.56,000 మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు హెడ్ హంటర్స్ ఇండియా వ్యవస్థాపక చైర్మన్, ఎండీ కె.లక్ష్మీకాంత్ పేర్కొన్నారు. అంటే మొత్తంగా మూడేళ్ల కాలంలో ఆరు లక్షల మంది ఐటీ ఇంజనీర్లు తమ ఉద్యోగాలను వదులుకోవాల్సిన ప్రమాదకర పరిస్థితుల్లో ఉండబోతున్నారని లక్ష్మీకాంత్ చెప్పారు. వచ్చే మూడు నాలుగేళ్లలో ఐటీ సర్వీసుల రంగంలో సగం మంది ఉద్యోగులు పనికిరారంటూ మెకిన్సే తాజా నివేదిక గురించి లక్ష్మీకాంత్ ప్రస్తావించారు. టెక్నాలజీల్లో గణనీయమైన మార్పుల కారణంగా 50–60% ఉద్యోగులను కొనసాగించడం కంపెనీలకు పెద్ద సవాలేనని మెకిన్సే పేర్కొంది. ‘‘30–40 శాతం మంది ఉద్యోగులకు తిరిగి శిక్షణనివ్వడం అన్నది సాధ్యం కాదు. ముఖ్యంగా 35 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న నిపుణులపై ఎక్కువ ప్రభావం ఉంటుందని, వీరికి ఉద్యోగాలు లభించడం కష్టంగా మారుతుంది '' అని లక్ష్మీకాంత్ అన్నారు.