ప్రమాదంలో ఆరు లక్షల మంది టెకీలు
ప్రమాదంలో ఆరు లక్షల మంది టెకీలు
Published Mon, May 15 2017 9:19 AM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM
ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు ప్రమాదకర స్థాయిల్లోకి వెళ్తోంది. ఈ ఉద్యోగాల తొలగింపు వచ్చే మూడేళ్లలో ఏటా రెండు లక్షల వరకు ఉంటుందని పరిశోధన సంస్థలు వెల్లడిస్తున్నాయి. హెడ్ హంటర్స్ ఇండియా అనే పరిశోధన సంస్థ అంచనాల ప్రకారం ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ఏటా 1.75 లక్షల నుంచి 2 లక్షల వరకు వచ్చే మూడేళ్లపాటు ఉంటుందని తెలిసింది. కంపెనీలు కొత్త టెక్నాలజీలను అందుకునేందుకు సన్నద్ధంగా లేకపోవడమే ఇందుకు కారణమని ఈ సంస్థ అంటోంది. ఈ ఏడాది ఇప్పటికే రూ.56,000 మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు హెడ్ హంటర్స్ ఇండియా వ్యవస్థాపక చైర్మన్, ఎండీ కె.లక్ష్మీకాంత్ పేర్కొన్నారు. అంటే మొత్తంగా మూడేళ్ల కాలంలో ఆరు లక్షల మంది ఐటీ ఇంజనీర్లు తమ ఉద్యోగాలను వదులుకోవాల్సిన ప్రమాదకర పరిస్థితుల్లో ఉండబోతున్నారని లక్ష్మీకాంత్ చెప్పారు.
వచ్చే మూడు నాలుగేళ్లలో ఐటీ సర్వీసుల రంగంలో సగం మంది ఉద్యోగులు పనికిరారంటూ మెకిన్సే తాజా నివేదిక గురించి లక్ష్మీకాంత్ ప్రస్తావించారు. టెక్నాలజీల్లో గణనీయమైన మార్పుల కారణంగా 50–60% ఉద్యోగులను కొనసాగించడం కంపెనీలకు పెద్ద సవాలేనని మెకిన్సే పేర్కొంది. ‘‘30–40 శాతం మంది ఉద్యోగులకు తిరిగి శిక్షణనివ్వడం అన్నది సాధ్యం కాదు. ముఖ్యంగా 35 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న నిపుణులపై ఎక్కువ ప్రభావం ఉంటుందని, వీరికి ఉద్యోగాలు లభించడం కష్టంగా మారుతుంది '' అని లక్ష్మీకాంత్ అన్నారు.
Advertisement
Advertisement