పశువుల కొట్టంగా పాఠశాల | School Building Turned Into Cattle Shed | Sakshi
Sakshi News home page

పశువుల కొట్టంగా పాఠశాల

Published Sat, Sep 4 2021 4:06 AM | Last Updated on Sat, Sep 4 2021 8:49 AM

School Building Turned Into Cattle Shed - Sakshi

జనగామ: జనగామ జిల్లా నర్మెట మండలం ఏనెతండాలో పదేళ్ల క్రితం రాజీవ్‌ విద్యామిషన్‌ నిధులతో నిర్మించిన నూతన పాఠశాల భవనం ప్రస్తుతం పశువుల కొట్టంగా మారిపోయింది. విద్యార్థులు లేరనే సాకుతో అధికారులు పాఠశాలను మూసివేయడంతో నిర్మించిన నాటి నుంచి ఒక్కరోజు కూడా ఈ బడి తెరుచుకోలేదు. దీంతో ఈ బడి కాస్తా పశువుల కొట్టంగా మారిపోయింది. దీనిపై మండల విద్యాధికారి (ఎంఈఓ) భగవాన్‌ ను వివరణ కోరగా..ఏనెతండాలో పిల్లలు, టీచర్లు లేకపోవడంతోనే బడి మూసి వేశారని తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement